శరీరంపై పహారా, మనసు మాత్రం సంచరిస్తోంది
ఏకాంతమే తోడున్నది
ఎవరో స్వజనాన్ని పోగొట్టుకున్నట్లుంది.
ఆక్రందనం ఎప్పుడూ కరుణ భరితమైనది
జన్మదినాన్న సంతోషిస్తాం
మరణ దినాన్నెందుకు పండుగ చేసుకోం
అంతిమ యాత్రలో ఎప్పుడూ
అశ్రువుల ధరలే ఉంటాయి
అంతరం రోదించి కళ్ళు వర్షించకుంటే
కన్న కలలన్నీ భగ్నమౌతాయి
మోసం నిండిన ఈ లోకంలో
స్వప్నం ఒక్కటే నిజమైనది
ఈ జీవితం కన్నా మృత్యువే మంచిది
వీధి వీధిలో భయమే తాండవిస్తున్నప్పుడు
చుట్టుపక్కల ఎవ్వరూ లేకుంటే తోడు
నేనూ ఏడుస్తాను అప్పుడప్పుడు........................
© 2017,www.logili.com All Rights Reserved.