జీవాళి
ఈ పుస్తకానికి "జీవాళి" అని పేరుపెట్టేము. కొంచెం వివరిస్తే బాగుంటుందనిపించింది. సాధారణంగా గాయకుల వెనుక, వాద్యాలు వాయించేవారి వెనుక, వేదిక మీద తంబూరా అనే వాద్యం కనిపిస్తుంది; వినిపిస్తుంది. ఉత్తరాదిన దీన్నే 'తాన్పురా' అని పిలుస్తారు. సంగీతానికి ఆధారమైన ఆధారశ్రుతిని ఈ తంబూరా అందిస్తుంది. తంబూరాలో నాలుగు తీగలుంటాయి. ఆ తీగలలో మొదటిది మండ్రపంచమం, మధ్యనున్న రెండు తీగలూ మధ్యషడ్జమం. నాల్గవది మంద్రషడ్జమం. ఈ నాలుగు తీగలనూ వరుసగా మీటుతూ ఉంటే కర్ణపేయంగా ఆధారశ్రుతి మధురధ్వనితో వినిపిస్తుంది, పాడేవారికీ శ్రోతలకూ. పైన చెప్పిన మూడు స్వరాలే కాకుండా ప్రతి తీగా పూర్తిగానూ, సెక్షనల్ గానూ కంపించడంవల్ల ఆధారస్వరానికి పైస్థాయిలో అంతరధ్వనులుగా రిషభం, గాంధారం, పంచమం, నిషాదం మొదలైన సంవాదిస్వరాలు కూడా జనిస్తాయి. వీటినే స్వయంభూధ్వనులని పిలుస్తారు. ఈ సంవాదులూ,.............................
జీవాళి ఈ పుస్తకానికి "జీవాళి" అని పేరుపెట్టేము. కొంచెం వివరిస్తే బాగుంటుందనిపించింది. సాధారణంగా గాయకుల వెనుక, వాద్యాలు వాయించేవారి వెనుక, వేదిక మీద తంబూరా అనే వాద్యం కనిపిస్తుంది; వినిపిస్తుంది. ఉత్తరాదిన దీన్నే 'తాన్పురా' అని పిలుస్తారు. సంగీతానికి ఆధారమైన ఆధారశ్రుతిని ఈ తంబూరా అందిస్తుంది. తంబూరాలో నాలుగు తీగలుంటాయి. ఆ తీగలలో మొదటిది మండ్రపంచమం, మధ్యనున్న రెండు తీగలూ మధ్యషడ్జమం. నాల్గవది మంద్రషడ్జమం. ఈ నాలుగు తీగలనూ వరుసగా మీటుతూ ఉంటే కర్ణపేయంగా ఆధారశ్రుతి మధురధ్వనితో వినిపిస్తుంది, పాడేవారికీ శ్రోతలకూ. పైన చెప్పిన మూడు స్వరాలే కాకుండా ప్రతి తీగా పూర్తిగానూ, సెక్షనల్ గానూ కంపించడంవల్ల ఆధారస్వరానికి పైస్థాయిలో అంతరధ్వనులుగా రిషభం, గాంధారం, పంచమం, నిషాదం మొదలైన సంవాదిస్వరాలు కూడా జనిస్తాయి. వీటినే స్వయంభూధ్వనులని పిలుస్తారు. ఈ సంవాదులూ,.............................© 2017,www.logili.com All Rights Reserved.