పడమటి గాలి జోరందుకుంది.
గాలి మొహానికి తగులుతుంటే వీపుకు పట్టిన చెమట కూడా ఆరదు. జ్యేష్టమాసం కోసం తేమను దాచుకున్న పండుటాకులు ఎండ దెబ్బకు ఊడిపడుతుంటే, తొలకరి చినుకుల తడి కోసం చిగుర్లు అల్లాడిపోతున్నాయి.
అంత ఎండలోనూ మొండిగా పత్తిచేనుకు తవ్వకం పెడుతోంది సత్యం. తలలో పుట్టిన చెమట చెంపల మీదుగా కిందికి జారుతోంది. పొద్దెక్కొచ్చేకొద్దీ విపరీతమైన దప్పిక. గొంతు తడుపుకోనొద్దామని వేప చెట్టు కిందికి నడిచింది చెట్టు కొమ్మకు వేలాడకట్టిన బాటిల్లో నీళ్లు నోట్లో పోసుకోగానే కాలిపోతున్నాయి. అవక్కడే పడేసి ఏట్లోకి నడిచింది. బ్రహ్మసాగర్ డ్యామ్ పుణ్యాన ఎండాకాలంలో కూడా వడివడిగా పారుతోంది సగిలేరు.
ఎండ పొద్దున చల్లటి నీళ్లు తాగగానే ప్రాణం లేచొచ్చినట్టైంది సత్యానికి. కడుపునిండా తాగి, కాళ్లు చేతులు మొహం తడి చేసుకుంది. పూడు కదలకుండా నీళ్లు బాటిల్లోకి ముంచుకుని పైకొచ్చింది.....................
పడమటి గాలి జోరందుకుంది. గాలి మొహానికి తగులుతుంటే వీపుకు పట్టిన చెమట కూడా ఆరదు. జ్యేష్టమాసం కోసం తేమను దాచుకున్న పండుటాకులు ఎండ దెబ్బకు ఊడిపడుతుంటే, తొలకరి చినుకుల తడి కోసం చిగుర్లు అల్లాడిపోతున్నాయి. అంత ఎండలోనూ మొండిగా పత్తిచేనుకు తవ్వకం పెడుతోంది సత్యం. తలలో పుట్టిన చెమట చెంపల మీదుగా కిందికి జారుతోంది. పొద్దెక్కొచ్చేకొద్దీ విపరీతమైన దప్పిక. గొంతు తడుపుకోనొద్దామని వేప చెట్టు కిందికి నడిచింది చెట్టు కొమ్మకు వేలాడకట్టిన బాటిల్లో నీళ్లు నోట్లో పోసుకోగానే కాలిపోతున్నాయి. అవక్కడే పడేసి ఏట్లోకి నడిచింది. బ్రహ్మసాగర్ డ్యామ్ పుణ్యాన ఎండాకాలంలో కూడా వడివడిగా పారుతోంది సగిలేరు. ఎండ పొద్దున చల్లటి నీళ్లు తాగగానే ప్రాణం లేచొచ్చినట్టైంది సత్యానికి. కడుపునిండా తాగి, కాళ్లు చేతులు మొహం తడి చేసుకుంది. పూడు కదలకుండా నీళ్లు బాటిల్లోకి ముంచుకుని పైకొచ్చింది.....................© 2017,www.logili.com All Rights Reserved.