కొన్ని కథలు ఎప్పుడూ ముగియవు
ఇప్పటికీ మన హృదయాలను తాకే ప్రేమ కథలు ఎన్నో చదువుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాం. కానీ కొన్ని మాత్రమే మన మౌనాల్లోకి నిశ్శబ్దంగా ప్రవేశించి, మన హృదయంలో ఒక మూలగా నిలిచిపోతాయి. అలాంటి కథలే కొంతకాలం మనతో కలిసి ప్రయాణం చేస్తాయి. ఇప్పుడు మీ చేతుల్లోకి రానున్న "నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ" కూడా అచ్చం అలాంటిదే.
ఈ కథని రాసిన అమ్మాయి నాకు ఎంతో సన్నిహితం. ఆమె వ్యక్తిత్వంలో ఓ ప్రత్యేకత ఉంటుంది - ఎంత చలాకీగా ఉన్నా, ఎంత జోష్ మాట్లాడినా, ఆమెలో ప్రేమంటే గౌరవమని, భావోద్వేగం అంటే | స్పృహ . అని తెలుస్తుంది. ఆమె రాతలో ఓ నిజాయితీ ఉంటుంది. ఒక పదాన్ని వదలకుండా, ఒక్క భావాన్ని మిస్ అవ్వకుండా పాఠకుడి గుండె దాకా వెళ్లేలా రాస్తుంది.
అది నేనెప్పుడో గమనించాను. అందుకే ఆమె ఈ కథ రాస్తున్నానని చెప్పినప్పుడే, ఇది ఓ సాధారణ ప్రేమకథ కాదని తెలిసింది. ఇది పుటలు తిరగేసే పుస్తకం మాత్రమే కాదు... అది మన మధ్యే తిరుగుతూ నిద్రిస్తున్న మనసుని తట్టి మేల్కొలిపే ఒక స్మృతి.
"నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ"లో ప్రేమకు ఓ రూపం ఉంది. అదే తన విశ్వాసంతో ఎదురు నిలిచిన ఓ మనసు రూపం. కథలోని ప్రతి క్షణం మన జీవితంలో ఎక్కడో ఒకప్పుడు జరిగినట్టే అనిపిస్తుంది. చదువుతూ ఉండగానే మన జ్ఞాపకాల తలుపు తెరవబోతుంది................
కొన్ని కథలు ఎప్పుడూ ముగియవు ఇప్పటికీ మన హృదయాలను తాకే ప్రేమ కథలు ఎన్నో చదువుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాం. కానీ కొన్ని మాత్రమే మన మౌనాల్లోకి నిశ్శబ్దంగా ప్రవేశించి, మన హృదయంలో ఒక మూలగా నిలిచిపోతాయి. అలాంటి కథలే కొంతకాలం మనతో కలిసి ప్రయాణం చేస్తాయి. ఇప్పుడు మీ చేతుల్లోకి రానున్న "నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ" కూడా అచ్చం అలాంటిదే. ఈ కథని రాసిన అమ్మాయి నాకు ఎంతో సన్నిహితం. ఆమె వ్యక్తిత్వంలో ఓ ప్రత్యేకత ఉంటుంది - ఎంత చలాకీగా ఉన్నా, ఎంత జోష్ మాట్లాడినా, ఆమెలో ప్రేమంటే గౌరవమని, భావోద్వేగం అంటే | స్పృహ . అని తెలుస్తుంది. ఆమె రాతలో ఓ నిజాయితీ ఉంటుంది. ఒక పదాన్ని వదలకుండా, ఒక్క భావాన్ని మిస్ అవ్వకుండా పాఠకుడి గుండె దాకా వెళ్లేలా రాస్తుంది. అది నేనెప్పుడో గమనించాను. అందుకే ఆమె ఈ కథ రాస్తున్నానని చెప్పినప్పుడే, ఇది ఓ సాధారణ ప్రేమకథ కాదని తెలిసింది. ఇది పుటలు తిరగేసే పుస్తకం మాత్రమే కాదు... అది మన మధ్యే తిరుగుతూ నిద్రిస్తున్న మనసుని తట్టి మేల్కొలిపే ఒక స్మృతి. "నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ"లో ప్రేమకు ఓ రూపం ఉంది. అదే తన విశ్వాసంతో ఎదురు నిలిచిన ఓ మనసు రూపం. కథలోని ప్రతి క్షణం మన జీవితంలో ఎక్కడో ఒకప్పుడు జరిగినట్టే అనిపిస్తుంది. చదువుతూ ఉండగానే మన జ్ఞాపకాల తలుపు తెరవబోతుంది................© 2017,www.logili.com All Rights Reserved.