"ఓ రఘునందన, నాలో కలిసిన నీ భార్య సీతాదేవి మాటగా చెప్తున్నాను, నీ రఘువంశానికి వారసులు ఈ లవకుశులు, వారి బాధ్యత ఇక నీదే. వ్యాస మహర్షులవారు లవకుశులకు తగిన శిక్షణ ఇచ్చియున్నారు, ఇంక మిగిలినది నీ బాధ్యత. లక్ష్మణా, నువ్వు అగ్రజునికి ఎలా తోడుగా ఉన్నావో నీ కుమారులైన అంగద చంద్రకేతులు, లవకుశులకి అదే విధంగా తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను." ." అంటూ భూమాత పలికింది.
సీతాదేవి భూమాత తో కలిసిపోవడాన్ని ఇంకా జీర్ణించుకోలేని శ్రీరాముడు ఆ మాటలకి పైకి లేచి తన విల్లుని అందుకుని, లవకుశుల వైపు చూసాడు, అప్పటివరకు వారి ఆలనా పాలనా చూసిన వారి తల్లి భూమి లో కలిసిపోవడాన్ని, ఇక వారు అమ్మని ఎప్పుడు చూడలేరు అనే నిజాన్ని సహించలేక వెక్కి వెక్కి విలపిస్తున్నారు లవకుశులు. శ్రీరాముడు తమ వైపు చూస్తున్నాడు. అని గ్రహించిన లవకుశులు ఏడుపు ఆపుకుంటూ నమస్కారం శ్రీరాముడు లవకుశుల దగ్గరకు వెళ్లి వారిని హత్తుకున్నాడు.
"లక్ష్మణా, నా సీత ఇక లేదు, రాదు. నా బిడ్డల బాధ్యత ఇక నాదే. ఇన్నాళ్లు తండ్రిని మరిపించేలా పెంచి ఉంటుంది నా జానకి, ఇప్పుడు వీరికి తల్లిని మరిపించే ప్రేమ ఇవ్వాలి. అసలు తల్లిని మరిపించే ప్రేమ...............
"ఓ రఘునందన, నాలో కలిసిన నీ భార్య సీతాదేవి మాటగా చెప్తున్నాను, నీ రఘువంశానికి వారసులు ఈ లవకుశులు, వారి బాధ్యత ఇక నీదే. వ్యాస మహర్షులవారు లవకుశులకు తగిన శిక్షణ ఇచ్చియున్నారు, ఇంక మిగిలినది నీ బాధ్యత. లక్ష్మణా, నువ్వు అగ్రజునికి ఎలా తోడుగా ఉన్నావో నీ కుమారులైన అంగద చంద్రకేతులు, లవకుశులకి అదే విధంగా తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను." ." అంటూ భూమాత పలికింది. సీతాదేవి భూమాత తో కలిసిపోవడాన్ని ఇంకా జీర్ణించుకోలేని శ్రీరాముడు ఆ మాటలకి పైకి లేచి తన విల్లుని అందుకుని, లవకుశుల వైపు చూసాడు, అప్పటివరకు వారి ఆలనా పాలనా చూసిన వారి తల్లి భూమి లో కలిసిపోవడాన్ని, ఇక వారు అమ్మని ఎప్పుడు చూడలేరు అనే నిజాన్ని సహించలేక వెక్కి వెక్కి విలపిస్తున్నారు లవకుశులు. శ్రీరాముడు తమ వైపు చూస్తున్నాడు. అని గ్రహించిన లవకుశులు ఏడుపు ఆపుకుంటూ నమస్కారం శ్రీరాముడు లవకుశుల దగ్గరకు వెళ్లి వారిని హత్తుకున్నాడు. "లక్ష్మణా, నా సీత ఇక లేదు, రాదు. నా బిడ్డల బాధ్యత ఇక నాదే. ఇన్నాళ్లు తండ్రిని మరిపించేలా పెంచి ఉంటుంది నా జానకి, ఇప్పుడు వీరికి తల్లిని మరిపించే ప్రేమ ఇవ్వాలి. అసలు తల్లిని మరిపించే ప్రేమ...............© 2017,www.logili.com All Rights Reserved.