Haritha Santhakam

Rs.500
Rs.500

Haritha Santhakam
INR
MANIMN6281
In Stock
500.0
Rs.500


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

న భూతో న భవిష్యతి

- తోటకూర వేంకట నారాయణ

రిటైర్డ్ ప్రిన్సిపాల్, చిలకలూరి పేట.

ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి అన్నట్లు “విలాసవంతమైన జీవితం కాదు జీవించటమంటే... ప్రేమించుతూ జీవించటం. అంటే పక్షులను, వృక్షములను, పువ్వులను, ఉపాధ్యాయులను, తల్లితండ్రులను... అంతేకాదు, అంతకుమించి మానవతనే ప్రేమించడం". మానవతా విలువలకు ప్రాధాన్యమిచ్చే సోమేపల్లి వారు నూటికి నూరుపాళ్ళూ అలానే జీవించారు.

"దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్" అన్న గురజాడ అడుగుజాడల్లోనే అడుగులు వేశారు. పదిమందికి ఉపయోగపడే పనులు చేయాలని తపనపడ్డారు. మనం చేసే మంచి పనులు తర్వాతి తరాల వారికి కూడా గుర్తుండిపోవాలని ఆశించారు. ఉన్నతాధికారుల సహకారంతో, బంధుమిత్రుల ప్రోత్సాహంతో మనసుకు నచ్చిన పని, మంచి అనుకున్న పని, చేయదగ్గ పని ఏదైనా, ఎవరి మనసూ నొప్పించకుండా చేసుకుంటూ పోయేవారు. ఏ పనినైనా పారవశ్యంతో చేయటం ఆయన ప్రత్యేకత. కార్యనిర్వహణాదక్షుడు.

ఎక్కడైనా క్రొత్తగా ఏర్పడే 'నగర్'లకు, 'కాలనీ'లకు రాజకీయ నాయకుల పేర్లు లేదా దేశ నాయకుల పేర్లు పెట్టడం సహజం. ఎక్కడో గాని పేదల పెన్నిధి ఐఏఎస్ శంకర్ లాంటి వారి పేర్లుతో ఉండవు. వెంకటసుబ్బయ్య పరమపదించినప్పుడు తాడేపల్లిగూడెంలోని సోమేపల్లి వెంకటసుబ్బయ్య నగర్ నుండి కొంతమంది నివాసితులు వచ్చి “మా పాలిట దేవుడండీ.. మాకు నివాసాలు, నివేషణ స్థలాలు ఇచ్చిన పుణ్యాత్ముడండీ, ఆయన పేరు చెప్పుకొని మా ఇంట దీపాలు వెలిగించుకుంటున్నాం" అంటూ కన్నీళ్ళతో ఘనమైన నివాళి అర్పించటం... అంతకన్నా మనిషి జీవితానికి ఇంకేం కావాలి. కొద్ది సాయం చేసి, ఎక్కువ గుర్తింపు కావాలని కోరుకునే రోజుల్లో ఆయన పేరుతో 'నగర్' ఉన్న విషయమే మనకు తెలియదు. అలా అని ఆయన ఎప్పుడూ చెప్పుకోనూ లేదు. పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపాలని తపించిన...................

న భూతో న భవిష్యతి - తోటకూర వేంకట నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపాల్, చిలకలూరి పేట. ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి అన్నట్లు “విలాసవంతమైన జీవితం కాదు జీవించటమంటే... ప్రేమించుతూ జీవించటం. అంటే పక్షులను, వృక్షములను, పువ్వులను, ఉపాధ్యాయులను, తల్లితండ్రులను... అంతేకాదు, అంతకుమించి మానవతనే ప్రేమించడం". మానవతా విలువలకు ప్రాధాన్యమిచ్చే సోమేపల్లి వారు నూటికి నూరుపాళ్ళూ అలానే జీవించారు. "దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్" అన్న గురజాడ అడుగుజాడల్లోనే అడుగులు వేశారు. పదిమందికి ఉపయోగపడే పనులు చేయాలని తపనపడ్డారు. మనం చేసే మంచి పనులు తర్వాతి తరాల వారికి కూడా గుర్తుండిపోవాలని ఆశించారు. ఉన్నతాధికారుల సహకారంతో, బంధుమిత్రుల ప్రోత్సాహంతో మనసుకు నచ్చిన పని, మంచి అనుకున్న పని, చేయదగ్గ పని ఏదైనా, ఎవరి మనసూ నొప్పించకుండా చేసుకుంటూ పోయేవారు. ఏ పనినైనా పారవశ్యంతో చేయటం ఆయన ప్రత్యేకత. కార్యనిర్వహణాదక్షుడు. ఎక్కడైనా క్రొత్తగా ఏర్పడే 'నగర్'లకు, 'కాలనీ'లకు రాజకీయ నాయకుల పేర్లు లేదా దేశ నాయకుల పేర్లు పెట్టడం సహజం. ఎక్కడో గాని పేదల పెన్నిధి ఐఏఎస్ శంకర్ లాంటి వారి పేర్లుతో ఉండవు. వెంకటసుబ్బయ్య పరమపదించినప్పుడు తాడేపల్లిగూడెంలోని సోమేపల్లి వెంకటసుబ్బయ్య నగర్ నుండి కొంతమంది నివాసితులు వచ్చి “మా పాలిట దేవుడండీ.. మాకు నివాసాలు, నివేషణ స్థలాలు ఇచ్చిన పుణ్యాత్ముడండీ, ఆయన పేరు చెప్పుకొని మా ఇంట దీపాలు వెలిగించుకుంటున్నాం" అంటూ కన్నీళ్ళతో ఘనమైన నివాళి అర్పించటం... అంతకన్నా మనిషి జీవితానికి ఇంకేం కావాలి. కొద్ది సాయం చేసి, ఎక్కువ గుర్తింపు కావాలని కోరుకునే రోజుల్లో ఆయన పేరుతో 'నగర్' ఉన్న విషయమే మనకు తెలియదు. అలా అని ఆయన ఎప్పుడూ చెప్పుకోనూ లేదు. పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపాలని తపించిన...................

Features

  • : Haritha Santhakam
  • : Somepalli Venkata Subbaiah
  • : Somepalli Literary Foundation
  • : MANIMN6281
  • : hard binding
  • : Dec, 2024
  • : 383
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Haritha Santhakam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam