కృషి ఉంటే మనుషులు ఋషులౌతారని వేటూరి వారన్నది నిజం. అడవి బాపిరాజుగారి వంటి గురుదేవులుంటే, ముట్నూరి కృష్ణారావుగారి వంటి మౌనబోధకులుంటే, మహాత్ముడి సాహచర్యం లభిస్తే, ఎలాంటివారైనా విభాకర శుభాకర ప్రభాకరులై ఎదుగుతారు.
అలా ఎదిగి ప్రముఖ గాంధేయవాదిగా మారిన సేవాయోధుడు, దివి ఉప్పెన సమయంలో దగ్గరుండి సేవా కార్యక్రమాలను నిర్వహించి, అనాథలైన ఎందరినో అక్కున చేర్చుకుని ఆదరించిన మహనీయుడు ప్రభాకర్. ఆయన జీవితాన్ని గొప్ప విధ్వంసం నుంచి విశ్వశ్రేయస్సు వైపు మళ్ళించిన గురుదేవులు అడవి బాపిరాజు.
అది 1936వ సంవత్సరం. మచిలీపట్టణం ఆంధ్ర జాతీయ కళాశాలకు అడవి బాపిరాజు కులపతి (ప్రిన్సిపాల్ గా ఉన్న రోజులు. ఆయన ఆదర్శమూర్తి, అమృతహృదయుడు, సంగీత, సాహిత్య, చిత్రలేఖనాలు త్రివేణీసంగమంగా రూపొందిన వ్యక్తిత్వం ఆయనది. అప్పటికే ఆయన వ్రాసిన "ఉప్పొంగిపోయింది గోదావరి”, లేపాక్షి బసవయ్య లేచిరావయ్య" లాంటి అనేక గేయాలు తెలుగు వారి నాలుకలమీద రసనాట్యం చేస్తున్నాయి. వారి నవలలు, గీసిన చిత్రాల ద్వారా ఆయన ఎంతో ప్రఖ్యాతి గడించి ఉన్నారు. గాంధేయవాది. స్వతంత్ర సమరంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించి వచ్చారు.........................
మనిషిని మానవుడిగా మలచిన గురుదేవుడు అడవి బాపిరాజు కృషి ఉంటే మనుషులు ఋషులౌతారని వేటూరి వారన్నది నిజం. అడవి బాపిరాజుగారి వంటి గురుదేవులుంటే, ముట్నూరి కృష్ణారావుగారి వంటి మౌనబోధకులుంటే, మహాత్ముడి సాహచర్యం లభిస్తే, ఎలాంటివారైనా విభాకర శుభాకర ప్రభాకరులై ఎదుగుతారు. అలా ఎదిగి ప్రముఖ గాంధేయవాదిగా మారిన సేవాయోధుడు, దివి ఉప్పెన సమయంలో దగ్గరుండి సేవా కార్యక్రమాలను నిర్వహించి, అనాథలైన ఎందరినో అక్కున చేర్చుకుని ఆదరించిన మహనీయుడు ప్రభాకర్. ఆయన జీవితాన్ని గొప్ప విధ్వంసం నుంచి విశ్వశ్రేయస్సు వైపు మళ్ళించిన గురుదేవులు అడవి బాపిరాజు. అది 1936వ సంవత్సరం. మచిలీపట్టణం ఆంధ్ర జాతీయ కళాశాలకు అడవి బాపిరాజు కులపతి (ప్రిన్సిపాల్ గా ఉన్న రోజులు. ఆయన ఆదర్శమూర్తి, అమృతహృదయుడు, సంగీత, సాహిత్య, చిత్రలేఖనాలు త్రివేణీసంగమంగా రూపొందిన వ్యక్తిత్వం ఆయనది. అప్పటికే ఆయన వ్రాసిన "ఉప్పొంగిపోయింది గోదావరి”, లేపాక్షి బసవయ్య లేచిరావయ్య" లాంటి అనేక గేయాలు తెలుగు వారి నాలుకలమీద రసనాట్యం చేస్తున్నాయి. వారి నవలలు, గీసిన చిత్రాల ద్వారా ఆయన ఎంతో ప్రఖ్యాతి గడించి ఉన్నారు. గాంధేయవాది. స్వతంత్ర సమరంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించి వచ్చారు.........................© 2017,www.logili.com All Rights Reserved.