ఉ॥ నీనునుఁ జెక్కులున్ మఱియు నీ చిఱునవ్వును దంత కాంతులున్
నీ నయగారముల్ కలికి! నీదు మిటారపు గుబ్బ దోయియున్
నీనడయాడు గౌనరయ నీ చికురంబును గెంపు మోవియున్
జానరొ! నాటె నా యెదను శంకలు గల్గినఁ జీరి చూడుమా ॥
ఉ॥ ఎచ్చటి కేగినన్ మఱియు నే పనిచేసిన నీదు రూపమే ||
యిచ్చ దలంచు చుందుఁ, గృపయించుక పూనవదేమో యోర్వగా ।
వచ్చునె యీ మనోవ్యధను వారిజలోచన ! నీ కటాక్షమున్
నచ్చితి నింక తాళఁగలనా లలనా? చలమునఁ బాడియే ॥
ఉ॥ నీ సరసంపు ముచ్చటలు నీ తరళాయత నేత్ర యుగ్మమున్
వీసరవోని మోహమున వేమఱు చిత్తములో స్మరించుచున్
వేసరకెల్ల వేళలను బ్రేయసి! నిన్ గనఁ గోరునా కయో!
యాసలు గొల్పి యేచఁదగునా మగువా వగ హెచ్చెడింగదే
ఉ॥ వలపుల బొమ్మ! నీవుగనుఁబాటయి నంతనే మోదమందుదున్
చలమునఁ గొంతసేపు కను చాటయినన్ బహు తాప మొందుదున్
కలికిరొ! నీ వెఱుంగుదె కకావికలైన మదీయ చిత్తమున్
తెలసిన నింత కస్తిపడం; దిప్పలు పెట్టకె నిన్ను వేడెదన్
......సుజాత; ఫిబ్రవరి 1929
తెలంగాణా వైతాళికుడు
సురవరం ప్రతాపరెడ్డి
ప్రణయినీ ప్రార్ధనము సురవరము ప్రతాపరెడ్డి ఉ॥ నీనునుఁ జెక్కులున్ మఱియు నీ చిఱునవ్వును దంత కాంతులున్ నీ నయగారముల్ కలికి! నీదు మిటారపు గుబ్బ దోయియున్ నీనడయాడు గౌనరయ నీ చికురంబును గెంపు మోవియున్ జానరొ! నాటె నా యెదను శంకలు గల్గినఁ జీరి చూడుమా ॥ ఉ॥ ఎచ్చటి కేగినన్ మఱియు నే పనిచేసిన నీదు రూపమే || యిచ్చ దలంచు చుందుఁ, గృపయించుక పూనవదేమో యోర్వగా । వచ్చునె యీ మనోవ్యధను వారిజలోచన ! నీ కటాక్షమున్ నచ్చితి నింక తాళఁగలనా లలనా? చలమునఁ బాడియే ॥ ఉ॥ నీ సరసంపు ముచ్చటలు నీ తరళాయత నేత్ర యుగ్మమున్ వీసరవోని మోహమున వేమఱు చిత్తములో స్మరించుచున్ వేసరకెల్ల వేళలను బ్రేయసి! నిన్ గనఁ గోరునా కయో! యాసలు గొల్పి యేచఁదగునా మగువా వగ హెచ్చెడింగదే ఉ॥ వలపుల బొమ్మ! నీవుగనుఁబాటయి నంతనే మోదమందుదున్ చలమునఁ గొంతసేపు కను చాటయినన్ బహు తాప మొందుదున్ కలికిరొ! నీ వెఱుంగుదె కకావికలైన మదీయ చిత్తమున్ తెలసిన నింత కస్తిపడం; దిప్పలు పెట్టకె నిన్ను వేడెదన్ ......సుజాత; ఫిబ్రవరి 1929 తెలంగాణా వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.