బీసీ నవలా సాహిత్యంపై విహంగ వీక్షణం
పాలకులు, పై కులాలవాళ్ళు కాదు, శ్రామికులే జీవన ప్రదాతలు. యుద్ధంలో రాజు గెలిచినా పోరాడేది సైన్యమే. అంతఃపుర నిర్వహణ నుండి రాజదర్బారు హంగుల వరకు, పాడిపంటల నుండి పచ్చడి మెతుకుల వరకు మానవ చరిత్ర అంతా కులవృత్తుల చెమట పుణ్యమే. ఆదిమకాలమైనా, ఆధునిక యుగమైనా శ్రమశక్తే సకల కులాలకు భుక్తి మార్గం. ఆ కుల వృత్తుల సమ్మిళిత సృష్టియే ఈ ప్రపంచగతి, గమనం. అయితే ఆకలి, నిద్రను పక్కనబెట్టి మానవ జీవన సౌలభ్యాన్ని అందించే ఈ వృత్తిజీవులు చరిత్రలో కొసవరుసలోనూ కానరారు. అద్భుత కట్టడమైన తాజ్ మహల్ చూసి ప్రపంచం అబ్బురపడినా ఆ నిర్మాణానికి రాళ్లు కొట్టిన వడ్డెరలెవరో, రాళ్ళెత్తిన కూలీలెవరో, వరుస పేర్చిన చేతులెవరివో ఎవరికి తెలియదు. అజంతా, ఎల్లోరాల్లో రాతి గుట్టలను తొలిచి విగ్రహాలుగా మలిచిన శిల్పులు ఎన్ని పురస్కారాలకైనా అర్హులే కానీ ఊరు, పేరు అందకుండా మరుగున పడ్డారు. "కొండలు పగలేసినం/ బండలనూ పిండినం / మా నెత్తురు కంకరగా / ప్రాజెక్టులు గట్టినం / శ్రమ ఎవడిదిరో.. సిరి ఎవడిదిరో..” అన్నాడు చెరబండరాజు. ఇలా శ్రమను, వృత్తి విశిష్టతను పరిగణనలోకి తీసుకోకుండానే కాలం అడుగులపై చరిత్ర లిఖించబడుతూనే ఉంది.
బట్టలు నేసెటోడికి, వాటిని కుట్టేటోడికి, ఉతికేటోడికి చరిత్రలో చోటు ఏమిటి.. వాళ్లకు గుర్తింపు అవసరమా.. మంగలి పని గురించి మాట్లాడేదేముంది.. కుండలు, గంపలు చేసేటోనికి అది బతుకు తెరువు, అంతే.. కల్లు కంపు, గొర్ల వాసన ఎవరికి ఇంపు.. వారంతా సర్వీస్ సెక్టర్. చదువుకు దూరం.. సంపదకు దూరం.. అధికారానికి దూరం.. ఇప్పుడు కులగణనకు దూరం. బీసీల విలువ కట్టేందుకు తూనికరాళ్ళు ముఖం చాటేస్తున్నాయి. హెూటల్లో చాయ్ కాచేవాడిని, టీ కప్పు అందించేవాడిని,................
బీసీ నవలా సాహిత్యంపై విహంగ వీక్షణం పాలకులు, పై కులాలవాళ్ళు కాదు, శ్రామికులే జీవన ప్రదాతలు. యుద్ధంలో రాజు గెలిచినా పోరాడేది సైన్యమే. అంతఃపుర నిర్వహణ నుండి రాజదర్బారు హంగుల వరకు, పాడిపంటల నుండి పచ్చడి మెతుకుల వరకు మానవ చరిత్ర అంతా కులవృత్తుల చెమట పుణ్యమే. ఆదిమకాలమైనా, ఆధునిక యుగమైనా శ్రమశక్తే సకల కులాలకు భుక్తి మార్గం. ఆ కుల వృత్తుల సమ్మిళిత సృష్టియే ఈ ప్రపంచగతి, గమనం. అయితే ఆకలి, నిద్రను పక్కనబెట్టి మానవ జీవన సౌలభ్యాన్ని అందించే ఈ వృత్తిజీవులు చరిత్రలో కొసవరుసలోనూ కానరారు. అద్భుత కట్టడమైన తాజ్ మహల్ చూసి ప్రపంచం అబ్బురపడినా ఆ నిర్మాణానికి రాళ్లు కొట్టిన వడ్డెరలెవరో, రాళ్ళెత్తిన కూలీలెవరో, వరుస పేర్చిన చేతులెవరివో ఎవరికి తెలియదు. అజంతా, ఎల్లోరాల్లో రాతి గుట్టలను తొలిచి విగ్రహాలుగా మలిచిన శిల్పులు ఎన్ని పురస్కారాలకైనా అర్హులే కానీ ఊరు, పేరు అందకుండా మరుగున పడ్డారు. "కొండలు పగలేసినం/ బండలనూ పిండినం / మా నెత్తురు కంకరగా / ప్రాజెక్టులు గట్టినం / శ్రమ ఎవడిదిరో.. సిరి ఎవడిదిరో..” అన్నాడు చెరబండరాజు. ఇలా శ్రమను, వృత్తి విశిష్టతను పరిగణనలోకి తీసుకోకుండానే కాలం అడుగులపై చరిత్ర లిఖించబడుతూనే ఉంది. బట్టలు నేసెటోడికి, వాటిని కుట్టేటోడికి, ఉతికేటోడికి చరిత్రలో చోటు ఏమిటి.. వాళ్లకు గుర్తింపు అవసరమా.. మంగలి పని గురించి మాట్లాడేదేముంది.. కుండలు, గంపలు చేసేటోనికి అది బతుకు తెరువు, అంతే.. కల్లు కంపు, గొర్ల వాసన ఎవరికి ఇంపు.. వారంతా సర్వీస్ సెక్టర్. చదువుకు దూరం.. సంపదకు దూరం.. అధికారానికి దూరం.. ఇప్పుడు కులగణనకు దూరం. బీసీల విలువ కట్టేందుకు తూనికరాళ్ళు ముఖం చాటేస్తున్నాయి. హెూటల్లో చాయ్ కాచేవాడిని, టీ కప్పు అందించేవాడిని,................© 2017,www.logili.com All Rights Reserved.