KVR Natakam, Natikalu

By Kvr (Author)
Rs.150
Rs.150

KVR Natakam, Natikalu
INR
MANIMN4475
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఛాయాదృశ్య

(స్టేజి నడిమి గాన తెల్ల తెర దిగిన తర్వాతనే, ముందుతెర తొలగించాలి. వెనుకనున్న ప్రథమాంకంలోని సెట్టుకూ, ఈ తెల్ల తెరకూ మధ్య గల జాగాలో, ముందుగనే అవసరమైన రేఖలను సున్నం పొడితోనో, చాక్తోనో గీసుకొని, అవసరానికి అనుగుణంగా పాత్రలను ఆయా చోట్ల నిలపాలి. వెనకనున్న స్పాట్ లైటును మూసేందుకు, వివిధాకృతులతో అట్టముక్కలను ముందుగా కత్తిరించి పెట్టుకోవాలి. వెనక వేరే మైక్ గూడ ఏర్పాటు చేయాలి.

తెల్లతెరకు ఇరువైపుల గల మూలలలో, కటిక బీదలు కొందరు, మొదట పండుకొనివుండి, క్రమంగా లేస్తూ చేతులు చాస్తూ కనిపిస్తారు. రేగిన తలలు, దీనవదనాలు. అర్ధనగ్న శరీరాలు. భూదేవికి స్వాగత గీతాలాపన మొదలౌతుంది. వాళ్ళవంతు అభినయం మాత్రమే. గానం మరొకరి వంతు.)

అమ్మా....

అమ్మా....

ఆవాహన

అభయ హస్త మందిమ్మా

అమృత కలశ మందిమ్మా!... అమ్మా.. అమ్మా! అన్నపూర్ణ రమ్మా

ప్రాణత్రాణవు కమ్మా!... అమ్మా... అమ్మా!

(ఈ విషాదపూర్ణ స్వరం తారాస్థాయి నందుకొనేసరికి, తెల్ల తెర వెనకనున్న స్పాటును అట్టతో పూర్తిగా మూసివేసి, ఆ చీకటిలో భూదేవిని స్టేజి మధ్యభాగాన తెరముందు నిలిపేటట్లు చెయ్యాలి. సున్నపుగీతలు గీసి మామిడాకులు కనిపించే పాత్ర ఒక చేత ఉంది. మరో చేతిలో అభయహస్తముద్ర పట్టింది. శిరస్సున పండుటాకుల ఆకారంలో ఉన్న కిరీటానికి ఎగువ ఫలాకృతి గల పసిమిముద్ద, నొసట తళుకు బొట్టు, ఆకుపచ్చని ఉడుపులు, ధగధగలాడే నగలు. మామిడిపిందెల నెక్లెస్. మోకాళ్ళ వరకు వేలాడే భారీ పూలమాల, కాలుసేతులకు సన్నటి జరితీగల అల్లిక. పాదాలకు పిందెలూ, మొగ్గలూ, నడుమున బలిష్టమైన పూలతీగల

గంభీరంగా భూదేవి తెల్లతెర ముందు నిల్చొన్న తర్వాత, స్టేజి ముందు భాగాన గల స్పాటు వెలుగుతుంది. వెనుక నుండి ఏ ఛాయా కనిపించదు. అంటే మొదట ఉండిన మనుష్యులు నిష్క్రమిస్తారు. స్పాటు నుండి పలు రంగులు భూదేవి మీద ఫోకస్ చేస్తూ, నేపథ్యగీతం పాడించాలి.)...........

ఛాయాదృశ్య (స్టేజి నడిమి గాన తెల్ల తెర దిగిన తర్వాతనే, ముందుతెర తొలగించాలి. వెనుకనున్న ప్రథమాంకంలోని సెట్టుకూ, ఈ తెల్ల తెరకూ మధ్య గల జాగాలో, ముందుగనే అవసరమైన రేఖలను సున్నం పొడితోనో, చాక్తోనో గీసుకొని, అవసరానికి అనుగుణంగా పాత్రలను ఆయా చోట్ల నిలపాలి. వెనకనున్న స్పాట్ లైటును మూసేందుకు, వివిధాకృతులతో అట్టముక్కలను ముందుగా కత్తిరించి పెట్టుకోవాలి. వెనక వేరే మైక్ గూడ ఏర్పాటు చేయాలి. తెల్లతెరకు ఇరువైపుల గల మూలలలో, కటిక బీదలు కొందరు, మొదట పండుకొనివుండి, క్రమంగా లేస్తూ చేతులు చాస్తూ కనిపిస్తారు. రేగిన తలలు, దీనవదనాలు. అర్ధనగ్న శరీరాలు. భూదేవికి స్వాగత గీతాలాపన మొదలౌతుంది. వాళ్ళవంతు అభినయం మాత్రమే. గానం మరొకరి వంతు.) అమ్మా.... అమ్మా.... ఆవాహన అభయ హస్త మందిమ్మా అమృత కలశ మందిమ్మా!... అమ్మా.. అమ్మా! అన్నపూర్ణ రమ్మా ప్రాణత్రాణవు కమ్మా!... అమ్మా... అమ్మా! (ఈ విషాదపూర్ణ స్వరం తారాస్థాయి నందుకొనేసరికి, తెల్ల తెర వెనకనున్న స్పాటును అట్టతో పూర్తిగా మూసివేసి, ఆ చీకటిలో భూదేవిని స్టేజి మధ్యభాగాన తెరముందు నిలిపేటట్లు చెయ్యాలి. సున్నపుగీతలు గీసి మామిడాకులు కనిపించే పాత్ర ఒక చేత ఉంది. మరో చేతిలో అభయహస్తముద్ర పట్టింది. శిరస్సున పండుటాకుల ఆకారంలో ఉన్న కిరీటానికి ఎగువ ఫలాకృతి గల పసిమిముద్ద, నొసట తళుకు బొట్టు, ఆకుపచ్చని ఉడుపులు, ధగధగలాడే నగలు. మామిడిపిందెల నెక్లెస్. మోకాళ్ళ వరకు వేలాడే భారీ పూలమాల, కాలుసేతులకు సన్నటి జరితీగల అల్లిక. పాదాలకు పిందెలూ, మొగ్గలూ, నడుమున బలిష్టమైన పూలతీగల గంభీరంగా భూదేవి తెల్లతెర ముందు నిల్చొన్న తర్వాత, స్టేజి ముందు భాగాన గల స్పాటు వెలుగుతుంది. వెనుక నుండి ఏ ఛాయా కనిపించదు. అంటే మొదట ఉండిన మనుష్యులు నిష్క్రమిస్తారు. స్పాటు నుండి పలు రంగులు భూదేవి మీద ఫోకస్ చేస్తూ, నేపథ్యగీతం పాడించాలి.)...........

Features

  • : KVR Natakam, Natikalu
  • : Kvr
  • : KVR Sharadamba Smaraka Kamiti
  • : MANIMN4475
  • : paparback
  • : MARCH, 2021
  • : 168
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:KVR Natakam, Natikalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam