Viplava Veerudu Alluri Sitaramaraju

By M V R Sastri (Author)
Rs.300
Rs.300

Viplava Veerudu Alluri Sitaramaraju
INR
30812TEL07
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

                 బ్రిటిష్ మహా సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గండరగండడు గాజుకళ్ళ పెద్దలు గుర్తించని అసలు సిసలు జాతీయవీరుడు. అల్లూరి సీతారామరాజు చారిత్రాత్మక పోరాట గాధ చరిత్రకెక్కిన కొత్త కోణంలో ప్రామాణికంగా, నిష్కర్షగా ఎం.వి.ఆర్. శాస్త్రి విలక్షణ నిజనిర్ధారణ విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు.

               స్వరాజ్య కాంక్షతో అనుక్షణం రగిలిపోతూ, జాతీయ విమోచన మహాయుద్ధంలో భాగంగానే తన పోరాటాన్ని పరిగణిస్తూ, దేశవ్యాప్తంగా ఎందరో విప్లవకారులతో సంబంధాలు పెట్టుకుని బంధుమిత్రాదులతో, అభిమానులతో సంపర్కం కొనసాగించిన అల్లూరి ఒక్కరికి ఒక్క ఉత్తరమూ రాయలేదంటే నమ్మలేము. కాని - పెరిచర్ల సూర్యనారాయణ రాజుకు రాయబడి, మధ్య దారిలో పోలిసుల చేతిలో పడ్డ ఉత్తరాన్ని, బ్రిటీషు అధికారులకు రాసిన కవ్వింపు సందేశాలను మినహాయిస్తే... తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ రామరాజు రాసిన రాతలు శ్రమిచి గాలిస్తే దొరకవా? మోగల్లు, రాజమండ్రి, కాకినాడ, తుని, విశాఖపట్నం, కృష్ణదేవిపేట, కొయ్యూరు వంటి రాజు తిరుగాడిన ప్రాంతాల్లో చారిత్రక జాడలు కనుగొనేందుకు విస్తృతస్థాయిలో గట్టి కృషి అనదగ్గది ఇంతవరకు జరిగిందా?

               విల్లమ్ములను ప్రయోగించటయే తెలిసిన అనాగరిక గిరిజనులను తుపాకీ యోధులుగా రాజు ఎలా మలచగలిగాడు? పొలిసు స్టేషన్ల నుంచో, ఇంకోవిధంగానో సంపాదించిన తుపాకులను, రైఫిళ్లను నేర్పుగా ఉపయోగించటం కొండ దళానికి ఎవరు నేర్పారు? రాజు పోరాటం పట్ల సానుభూతి కలిగిన స్థానిక పోలీసులే వారికి ఈ రకమైన శిక్షణ ఇచ్చారా? - అని సి.వి. రాజగోపాలరావు తన గ్రంధంలో లేవనెత్తిన కీలక ప్రశ్నలకు ఎవరు పట్టించుకున్నారు? ఈ దిశగా ఎంతమంది దృష్టి పెట్టారు?

              అన్నిటికి మించి, స్వాతంత్ర్య సంగ్రామంలో సీతారామరాజు జాతీయ ప్రాముఖ్యాన్ని సరిగా గుర్తించి, ఆ కోణం నుంచి అతడి చరిత్రాత్మక పోరాటాన్ని మదింపు చేసే ప్రయత్నం ఎవరూ చేసినట్టు లేదు. కొట్టోచ్చినట్టు కనిపించే ఈ లోటును నాకు చేతనైనంతలో కొంత వరకైనా పూరించాలన్న కోరికే ఈ గ్రంధ రచనకు ప్రేరణ. నాకున్న అతి తక్కువ సమయంలో, లెక్కలేనన్ని పరిమితుల్ల్లో వీలైన మేరకు విషయ సేకరణ చేసి, తోచిన మేరకు వాస్తవాలను విశ్లేషించి, జాతీయ దృకోణం నుంచి సీతారామరాజు ప్రాముఖ్యాన్ని ప్రభావాన్ని దర్శించే ప్రయత్నం చేశాను. 

- ఎం.వి.ఆర్. శాస్త్రి

                 బ్రిటిష్ మహా సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గండరగండడు గాజుకళ్ళ పెద్దలు గుర్తించని అసలు సిసలు జాతీయవీరుడు. అల్లూరి సీతారామరాజు చారిత్రాత్మక పోరాట గాధ చరిత్రకెక్కిన కొత్త కోణంలో ప్రామాణికంగా, నిష్కర్షగా ఎం.వి.ఆర్. శాస్త్రి విలక్షణ నిజనిర్ధారణ విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు.                స్వరాజ్య కాంక్షతో అనుక్షణం రగిలిపోతూ, జాతీయ విమోచన మహాయుద్ధంలో భాగంగానే తన పోరాటాన్ని పరిగణిస్తూ, దేశవ్యాప్తంగా ఎందరో విప్లవకారులతో సంబంధాలు పెట్టుకుని బంధుమిత్రాదులతో, అభిమానులతో సంపర్కం కొనసాగించిన అల్లూరి ఒక్కరికి ఒక్క ఉత్తరమూ రాయలేదంటే నమ్మలేము. కాని - పెరిచర్ల సూర్యనారాయణ రాజుకు రాయబడి, మధ్య దారిలో పోలిసుల చేతిలో పడ్డ ఉత్తరాన్ని, బ్రిటీషు అధికారులకు రాసిన కవ్వింపు సందేశాలను మినహాయిస్తే... తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ రామరాజు రాసిన రాతలు శ్రమిచి గాలిస్తే దొరకవా? మోగల్లు, రాజమండ్రి, కాకినాడ, తుని, విశాఖపట్నం, కృష్ణదేవిపేట, కొయ్యూరు వంటి రాజు తిరుగాడిన ప్రాంతాల్లో చారిత్రక జాడలు కనుగొనేందుకు విస్తృతస్థాయిలో గట్టి కృషి అనదగ్గది ఇంతవరకు జరిగిందా?                విల్లమ్ములను ప్రయోగించటయే తెలిసిన అనాగరిక గిరిజనులను తుపాకీ యోధులుగా రాజు ఎలా మలచగలిగాడు? పొలిసు స్టేషన్ల నుంచో, ఇంకోవిధంగానో సంపాదించిన తుపాకులను, రైఫిళ్లను నేర్పుగా ఉపయోగించటం కొండ దళానికి ఎవరు నేర్పారు? రాజు పోరాటం పట్ల సానుభూతి కలిగిన స్థానిక పోలీసులే వారికి ఈ రకమైన శిక్షణ ఇచ్చారా? - అని సి.వి. రాజగోపాలరావు తన గ్రంధంలో లేవనెత్తిన కీలక ప్రశ్నలకు ఎవరు పట్టించుకున్నారు? ఈ దిశగా ఎంతమంది దృష్టి పెట్టారు?               అన్నిటికి మించి, స్వాతంత్ర్య సంగ్రామంలో సీతారామరాజు జాతీయ ప్రాముఖ్యాన్ని సరిగా గుర్తించి, ఆ కోణం నుంచి అతడి చరిత్రాత్మక పోరాటాన్ని మదింపు చేసే ప్రయత్నం ఎవరూ చేసినట్టు లేదు. కొట్టోచ్చినట్టు కనిపించే ఈ లోటును నాకు చేతనైనంతలో కొంత వరకైనా పూరించాలన్న కోరికే ఈ గ్రంధ రచనకు ప్రేరణ. నాకున్న అతి తక్కువ సమయంలో, లెక్కలేనన్ని పరిమితుల్ల్లో వీలైన మేరకు విషయ సేకరణ చేసి, తోచిన మేరకు వాస్తవాలను విశ్లేషించి, జాతీయ దృకోణం నుంచి సీతారామరాజు ప్రాముఖ్యాన్ని ప్రభావాన్ని దర్శించే ప్రయత్నం చేశాను.  - ఎం.వి.ఆర్. శాస్త్రి

Features

  • : Viplava Veerudu Alluri Sitaramaraju
  • : M V R Sastri
  • : Durga Publications
  • : 30812TEL07
  • : Paperback
  • : 248
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Viplava Veerudu Alluri Sitaramaraju

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam