Valmiki Ramayanam

Rs.250
Rs.250

Valmiki Ramayanam
INR
ETCBKT0156
Out Of Stock
250.0
Rs.250
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

           ప్రాచీన మహర్షులు అమూల్యంగా ప్రసాదించిన పెన్నిధులు మూడు. అవే భారత, భాగవత, రామాయణములు. భారత జాతి చెక్కుచెదరకుండా నిలబడుటకు ప్రధాన కారణం ఈ మూడు గ్రంధములే అన్నచో అతిశయోక్తి కాజాలదు.

        ప్రాచీన భారతీయ సంస్కృతికి మూలాధారమైన ఆదికావ్యం శ్రీ వాల్మీకి కృతమైన "శ్రీ మద్రామాయణం". భారతీయులందరికు ఇది పరమపవిత్ర కావ్యరత్నం "రామో విగ్రహ వాన్ ధర్మః" అని ఆదికవి చేత ప్రస్తుతింపబడిన శ్రీ రామచంద్రుని పవిత్రచరిత్రమిది.

          'పలికించెడు వాడు రామభద్రుండట' అని ఆదికవి నుండి నేటికీ ఎందరెందరో ఈ మహత్తర కావ్యాన్ని పద్యంగానో, గద్యంగానో, నాటకంగానో, పాటగానో వ్రాసి కృతార్థులౌతూనే వున్నారు. సామాన్యులు కూడ ఏదైనా వ్రాయడానికి ముందు 'శ్రీ రామ' అని శ్రీ కారం వ్రాయకుండా ఒక్క అక్షరం కూడ లిఖించరు. నేటికీ మన తెలుగునాట చంటిబిడ్డల స్నానానికి ముగింపుగా తల్లి పలికేది శ్రీరామరక్షె"! మంచిరోజులకు గుర్తింపుగా ప్రజలు పలికే మాట రామరాజ్యమే'!

        రామాయణం, భారతం, భాగవతం మన సంస్కృతిని తెలియచెప్పే గొప్పగ్రంధాలు. ఇవి మన పూర్వీకులనుండి మనకు అనుశ్రుతంగా లభించిన ఆస్తులు. భక్తి కోసమైనా, మనశ్శాంతికోసమైనా చదవలసిన గ్రంధాలివి.

       సంస్కృత భాషనుండి గాని, పద్యములనుండి గాని, రామాయణాన్ని సూటిగా చదువుకోలేని వారికి ఈ సరళ, సుందర వచన రామాయణం కడిమి చెట్టులా సాయపడగలదు. చదువరులు ఈ వాల్మీకి రామాయణాన్ని పటించి జగత్ప్రభువైన శ్రీరామచంద్రుని అనుగ్రహానికి పాత్రులు కావాలని మా కోరిక.

- కొంపెల్ల వెంకటరామశాస్త్రి

 

           ప్రాచీన మహర్షులు అమూల్యంగా ప్రసాదించిన పెన్నిధులు మూడు. అవే భారత, భాగవత, రామాయణములు. భారత జాతి చెక్కుచెదరకుండా నిలబడుటకు ప్రధాన కారణం ఈ మూడు గ్రంధములే అన్నచో అతిశయోక్తి కాజాలదు.         ప్రాచీన భారతీయ సంస్కృతికి మూలాధారమైన ఆదికావ్యం శ్రీ వాల్మీకి కృతమైన "శ్రీ మద్రామాయణం". భారతీయులందరికు ఇది పరమపవిత్ర కావ్యరత్నం "రామో విగ్రహ వాన్ ధర్మః" అని ఆదికవి చేత ప్రస్తుతింపబడిన శ్రీ రామచంద్రుని పవిత్రచరిత్రమిది.           'పలికించెడు వాడు రామభద్రుండట' అని ఆదికవి నుండి నేటికీ ఎందరెందరో ఈ మహత్తర కావ్యాన్ని పద్యంగానో, గద్యంగానో, నాటకంగానో, పాటగానో వ్రాసి కృతార్థులౌతూనే వున్నారు. సామాన్యులు కూడ ఏదైనా వ్రాయడానికి ముందు 'శ్రీ రామ' అని శ్రీ కారం వ్రాయకుండా ఒక్క అక్షరం కూడ లిఖించరు. నేటికీ మన తెలుగునాట చంటిబిడ్డల స్నానానికి ముగింపుగా తల్లి పలికేది శ్రీరామరక్షె"! మంచిరోజులకు గుర్తింపుగా ప్రజలు పలికే మాట రామరాజ్యమే'!         రామాయణం, భారతం, భాగవతం మన సంస్కృతిని తెలియచెప్పే గొప్పగ్రంధాలు. ఇవి మన పూర్వీకులనుండి మనకు అనుశ్రుతంగా లభించిన ఆస్తులు. భక్తి కోసమైనా, మనశ్శాంతికోసమైనా చదవలసిన గ్రంధాలివి.        సంస్కృత భాషనుండి గాని, పద్యములనుండి గాని, రామాయణాన్ని సూటిగా చదువుకోలేని వారికి ఈ సరళ, సుందర వచన రామాయణం కడిమి చెట్టులా సాయపడగలదు. చదువరులు ఈ వాల్మీకి రామాయణాన్ని పటించి జగత్ప్రభువైన శ్రీరామచంద్రుని అనుగ్రహానికి పాత్రులు కావాలని మా కోరిక. - కొంపెల్ల వెంకటరామశాస్త్రి  

Features

  • : Valmiki Ramayanam
  • : Kompella Venkata Rama Sastri
  • : Rohini
  • : ETCBKT0156
  • : Hardbound
  • : Reprint 2014
  • : 644
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Valmiki Ramayanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam