Palukubadi

By Tirumala Ramachandra (Author)
Rs.100
Rs.100

Palukubadi
INR
ETCBKTEL01
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                  తెలుగు బాషా వికాస సంవత్సరంగా కొలువబడుతున్న 1913లో ముగ్గురు మహామనీషుల శతజయంతి రావడం, తెలుగు భాషోన్నతికి వారు చేసిన మహత్తర కృషిని స్మరించుకునే ప్రత్యేక అవకాశాన్ని భాషాప్రియులకు కలిగించినది. ఆ మహనీయులు తిరుమల రామచంద్ర, పుట్టపర్తి నారాయణా చార్యులు, కాళోజి నారాయణరావు. చివరి ఇద్దరు కవిత్వ ప్రక్రియలో సాటిలేనివారు. పుట్టపర్తివారు 'శివతాండవం' వంటి లయాత్మక పద్యకావ్యం రచించి అఖంఢ ఖ్యాతిని అర్జిస్తే, కాళోజి ప్రజల గోడును తనగోడుగా అనితర సాధ్యమైన ఫణితిలో వచన కవిత్వంగా అందించి ప్రజాకవిగా కీర్తి గడించారు. రామచంద్ర ప్రధానంగా పత్రికా రచయిత గనుక వచనాన్నే కవిత్వమంత భావస్ఫోరకంగా, సర్వాంగ సుందరంగా అందించి వాసికెక్కారు.

                రామచంద్ర గొప్ప పండితుడు, బహుభాషావేత్త. నిర్విరామ పరిశోధకుడు. విమర్శకుడు, సాహిత్యసమీక్షకుడు, అనువాదకుడు, బహుగ్రంథకర్త. వీటన్నిటినీ పత్రికా రచనా వ్యాసంగాన్ని ఆలంబనగా చేసుకునే సాధించగలిగాడు. ఆయన పాత్రికేయ జీవనయానం 1944లో కాన్పూరులో 'డెయిలీ టెలిగ్రాఫ్' ఆంగ్లపత్రికతో ఆరంభమైంది. తర్వాత 'తెలంగాణ పత్రిక', మళ్లీ 'ఆంధ్రపత్రిక', తానే స్థాపించి సంపాదకత్వం వహించిన 'పరిశోధన', 'ఆంధ్రభూమి' దినపత్రిక, 'హిందూస్తాన్ సమాచార్' వార్తా సంస్థలలో అర్ధశతాబ్దికిపైగా దిగ్విజయంగా సాగింది. పలుపత్రికలలో ఆయన విశేష పాఠకాదరణ పొందిన శీర్షికా రచయితగా కూడా నిజ నామంతో, కలంపేర్లతో గొప్ప భాషాసేవ చేశారు. రామచంద్రకు ఎన్నో పురస్కారాలు, బిరుదులు లభించాయి. కాని ఆయన 'పత్రికార్ శోరోమణి' బిరుదును మాత్రమే తమపేరు ముందు వ్రాసుకోడానికి ఇష్టపాడేవారు. భాషా సేవకుడు అనే తనను తాను వర్ణించుకొనేవారు.

             పత్రికారచనలో విషయపరిధి పెరిగిన కొద్ది కొత్తపదజాలం అవసరమవుతుంది. శాస్త్ర, సాంకేతిక పరిభాష అవసరమవుతుంది. మనకు వైద్యం, శరీర నిర్మాణ శాస్త్రం, రసాయనశాస్త్ర, లోహశాస్త్రం, గణితం, ఖగోళ విజ్ఞానంలో సంస్కృత గ్రంధాలలో కావలసినంత పరిభాష అందుబాటులో ఉంది. కాని లోపభూయిష్టమైన విద్యావిధానం వల్ల సంస్కృతం నేర్చుకునే అవకాశం లేదు. కనుక గ్రంధస్థం అయి ఉన్న భాషా సంపద కూడా పూర్వీకులు భూగర్భంలో దాచిన ధన సంపత్తిలాగ వాడుకోలేని దుస్థితి.

            కొత్త శాస్త్రియంశాల ఆవిష్కరణలు జరిగినప్పుడు కొత్త పద సృష్టి అవసరమవుతుంది. ముందుగా ఈ సమస్య పత్రికా రచయితల ముంగిట్లో వాలుతుంది. 175ఏళ్లుగా తెలుగు పత్రికారచనలో ఇది అందరూ ఎదుర్కొన్న సమస్యే శక్తిమేరకు పరిష్కరించుకొంటూ వస్తున్నదే. వీరేశలింగం పంతులు నుంచి ప్రారంభించి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు, నార్ల వెంకటేశ్వరరావు, ఆ తర్వాతమాతరం వరకు అందరి కృషి ఉంది. ఆ కృషిలో రామచంద్ర వంటి పాళీ, ప్రాకృత, సంస్కృత తదితర భాషలు క్షుణ్ణంగా తెలిసినవారి పాత్ర ఆవిస్మరణియమైంది, ఆదర్శవంతమైంది.

         తిరుమల రామచంద్ర శతజయంతి సభ జరిపి స్పూర్తి పొందాలని, ఆయన వదిలివెళ్ళిన అమూల్య భాషా సంపదను ఈతరం భాషా వ్యవహర్తలకు అందుబాటులో తెస్తే అదే ఆయనకు సముచిత నివాళి అవుతుందని భావించాము. ఈ సదస్సు సందర్భంగా రామచంద్ర ఆముద్రిత రచనలలో 'పలుకుబడి' శీర్షికన వెలువడిన గ్రంధస్థం చేసి మా అభిమానాన్ని చాటుకుంటున్నాము. భాషా సేవలో ఇది ఇంకొక ముందడుగు అవుతుందని విశ్వసిస్తున్నాము. ఈ గ్రంధాన్ని భాషా ప్రియులు, ముఖ్యంగా నవతరం పత్రికా రచయితలు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము.

- డా.జి.యస్. వరదాచారి

అద్యక్షులు, వయోధిక పాత్రికేయ సంఘం

 

                  తెలుగు బాషా వికాస సంవత్సరంగా కొలువబడుతున్న 1913లో ముగ్గురు మహామనీషుల శతజయంతి రావడం, తెలుగు భాషోన్నతికి వారు చేసిన మహత్తర కృషిని స్మరించుకునే ప్రత్యేక అవకాశాన్ని భాషాప్రియులకు కలిగించినది. ఆ మహనీయులు తిరుమల రామచంద్ర, పుట్టపర్తి నారాయణా చార్యులు, కాళోజి నారాయణరావు. చివరి ఇద్దరు కవిత్వ ప్రక్రియలో సాటిలేనివారు. పుట్టపర్తివారు 'శివతాండవం' వంటి లయాత్మక పద్యకావ్యం రచించి అఖంఢ ఖ్యాతిని అర్జిస్తే, కాళోజి ప్రజల గోడును తనగోడుగా అనితర సాధ్యమైన ఫణితిలో వచన కవిత్వంగా అందించి ప్రజాకవిగా కీర్తి గడించారు. రామచంద్ర ప్రధానంగా పత్రికా రచయిత గనుక వచనాన్నే కవిత్వమంత భావస్ఫోరకంగా, సర్వాంగ సుందరంగా అందించి వాసికెక్కారు.                 రామచంద్ర గొప్ప పండితుడు, బహుభాషావేత్త. నిర్విరామ పరిశోధకుడు. విమర్శకుడు, సాహిత్యసమీక్షకుడు, అనువాదకుడు, బహుగ్రంథకర్త. వీటన్నిటినీ పత్రికా రచనా వ్యాసంగాన్ని ఆలంబనగా చేసుకునే సాధించగలిగాడు. ఆయన పాత్రికేయ జీవనయానం 1944లో కాన్పూరులో 'డెయిలీ టెలిగ్రాఫ్' ఆంగ్లపత్రికతో ఆరంభమైంది. తర్వాత 'తెలంగాణ పత్రిక', మళ్లీ 'ఆంధ్రపత్రిక', తానే స్థాపించి సంపాదకత్వం వహించిన 'పరిశోధన', 'ఆంధ్రభూమి' దినపత్రిక, 'హిందూస్తాన్ సమాచార్' వార్తా సంస్థలలో అర్ధశతాబ్దికిపైగా దిగ్విజయంగా సాగింది. పలుపత్రికలలో ఆయన విశేష పాఠకాదరణ పొందిన శీర్షికా రచయితగా కూడా నిజ నామంతో, కలంపేర్లతో గొప్ప భాషాసేవ చేశారు. రామచంద్రకు ఎన్నో పురస్కారాలు, బిరుదులు లభించాయి. కాని ఆయన 'పత్రికార్ శోరోమణి' బిరుదును మాత్రమే తమపేరు ముందు వ్రాసుకోడానికి ఇష్టపాడేవారు. భాషా సేవకుడు అనే తనను తాను వర్ణించుకొనేవారు.              పత్రికారచనలో విషయపరిధి పెరిగిన కొద్ది కొత్తపదజాలం అవసరమవుతుంది. శాస్త్ర, సాంకేతిక పరిభాష అవసరమవుతుంది. మనకు వైద్యం, శరీర నిర్మాణ శాస్త్రం, రసాయనశాస్త్ర, లోహశాస్త్రం, గణితం, ఖగోళ విజ్ఞానంలో సంస్కృత గ్రంధాలలో కావలసినంత పరిభాష అందుబాటులో ఉంది. కాని లోపభూయిష్టమైన విద్యావిధానం వల్ల సంస్కృతం నేర్చుకునే అవకాశం లేదు. కనుక గ్రంధస్థం అయి ఉన్న భాషా సంపద కూడా పూర్వీకులు భూగర్భంలో దాచిన ధన సంపత్తిలాగ వాడుకోలేని దుస్థితి.             కొత్త శాస్త్రియంశాల ఆవిష్కరణలు జరిగినప్పుడు కొత్త పద సృష్టి అవసరమవుతుంది. ముందుగా ఈ సమస్య పత్రికా రచయితల ముంగిట్లో వాలుతుంది. 175ఏళ్లుగా తెలుగు పత్రికారచనలో ఇది అందరూ ఎదుర్కొన్న సమస్యే శక్తిమేరకు పరిష్కరించుకొంటూ వస్తున్నదే. వీరేశలింగం పంతులు నుంచి ప్రారంభించి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు, నార్ల వెంకటేశ్వరరావు, ఆ తర్వాతమాతరం వరకు అందరి కృషి ఉంది. ఆ కృషిలో రామచంద్ర వంటి పాళీ, ప్రాకృత, సంస్కృత తదితర భాషలు క్షుణ్ణంగా తెలిసినవారి పాత్ర ఆవిస్మరణియమైంది, ఆదర్శవంతమైంది.          తిరుమల రామచంద్ర శతజయంతి సభ జరిపి స్పూర్తి పొందాలని, ఆయన వదిలివెళ్ళిన అమూల్య భాషా సంపదను ఈతరం భాషా వ్యవహర్తలకు అందుబాటులో తెస్తే అదే ఆయనకు సముచిత నివాళి అవుతుందని భావించాము. ఈ సదస్సు సందర్భంగా రామచంద్ర ఆముద్రిత రచనలలో 'పలుకుబడి' శీర్షికన వెలువడిన గ్రంధస్థం చేసి మా అభిమానాన్ని చాటుకుంటున్నాము. భాషా సేవలో ఇది ఇంకొక ముందడుగు అవుతుందని విశ్వసిస్తున్నాము. ఈ గ్రంధాన్ని భాషా ప్రియులు, ముఖ్యంగా నవతరం పత్రికా రచయితలు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము. - డా.జి.యస్. వరదాచారి అద్యక్షులు, వయోధిక పాత్రికేయ సంఘం  

Features

  • : Palukubadi
  • : Tirumala Ramachandra
  • : Vayodika Patrikeya Sangam
  • : ETCBKTEL01
  • : Paperback
  • : December, 2013
  • : 104
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Palukubadi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam