Sarath Purnima

Rs.100
Rs.100

Sarath Purnima
INR
NAVOPH0415
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            అంతరాల దొంతర్ల వల్ల మనసుకు కలిగే నెప్పిని పెద్దలు దాచి పెట్టినా. పిల్లలకు సాధ్యం కాదు. అంతరాలూ, వాటి పర్యవసానాలూ కళ్లుమూసుకున్నా కనిపించే చేదు నిజాలు. కలవారూ లేని వారు అన్న అంతరానికి తోడు, ఇప్పుడు పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరం రంగమ్మీదకు వచ్చింది. దాని వేళ్లు లోతయినవీ, విస్తృతమైనవీను. ఆర్థిక సమస్య, హార్దిక సమస్యగా మారిన వైనాన్ని హృద్యంగా చెప్పిన కథ ‘నేను పోనే!’. పేదరికంతో పాటు, పల్లె-బస్తీ అంతరం స్వాతంత్య్రానికి ముందు కూడా ఉందని చెబుతుందీ కథ. వేద పండితుడు, కవి, పత్రికా రచయిత -తెలుగులో పేరడీ ప్రక్రియకు ఆద్యుడు- జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి ఈ కథ రాశారు. 


              జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి లేదా జరుక్‌శాస్త్రి ప్రత్యక్షరం చమత్కారానికి విలాసం. కానీ ‘సాహిత్యం కోసం అంతగా ప్రాణం పెట్టిన మనిషి ఇంకొకరు లే’రం టారు సమకాలికులు. ‘జలసూత్రం’ ఇంటి పేరేమిటి? అంటే నీటిసూత్రం- హెచ్‌టువో- కనిపెట్టింది మా వాళ్లే అని చమత్కరించేవారాయన. ఆయన వెక్కిరించని తెలుగు సాహితీ దిగ్గజం లేదు. విశ్వనాథ, దేవులపల్లి, శ్రీశ్రీలతో సహా ఆయన ‘కణకణ మండే’ పేరడీల పోటు తప్పిం చుకున్న ధన్యులు తక్కువే. విశ్వనాథ వారిని ‘పాషాణ పాక ప్రభు’ అని ముద్దుగా ఎద్దేవా చేసిన ఉద్దండుడు. భావకవులనీ, అభ్యుదయ కవులనీ కూడా వెక్కిరించి, నవ్వించారు. అయినా ఆయన సర్వసాహితీ జనబంధువే. ‘రుక్కయ్యా! వాణికి లిప్‌స్టిక్కయ్యా!’ అని ముచ్చటపడ్డాడు శ్రీశ్రీ. కొంచమే అయినప్పటికీ ‘శరత్ పూర్ణిమ’ ‘ఒక్ఖ దణ్ణం’ వంటి గొప్ప కథలూ, చుర్రుమనే పద్యాలు కూడా పలికినా జరుక్ చెప్పిన పేరడీలే ఖ్యాతి గాంచాయి. 

కరణంగారింట్లో వంట మనిషి సీతమ్మ. ఆమె కొడుకు నాగభూషి. ‘బోసినవ్వులునవ్వే రోజుల్లో’నే తండ్రిని పొగొట్టుకున్నవాడు. పిల్లవాడిని చంకనేసుకుని పుట్టింటికి వెళ్లి భంగపడిన సీతమ్మకు కరణంగారి భార్య వంట పని ఇచ్చింది. పిల్లవాడికీ ఇక్కడే అన్నం పెట్టమని ఔదార్యం ప్రదర్శించింది. గ్రామంలోనే ఉండి చదువుకున్నాడు నాగభూషి. ఇప్పుడు కాస్త పెద్దచదువుకి బస్తీ వెళుతున్నాడు.

                అంతరాల గురించి సిద్ధాంతాలూ, రాద్ధాంతాల ఆధారంగా ఒక కల్పన లేకున్నా, సహజంగా ఉండే బెరుకు సీతమ్మకూ ఉంది. కొడుకు బస్తీ బడిలో నెగ్గుకు రాగలడా? ‘వస్తా’నన్నాడు నాగభూషి. దాచుకున్న డబ్బులన్నీ పోసి పుస్తకాలు కొనిపెట్టగలిగింది. పౌంటేన్ పెన్నూ కావాల న్నాడు. ‘పండక్కి’ అని వాయిదా వేయబోయినా, కొడుకు ముచ్చట చూసి సరేనందామె. తల్లి అంతరంగాన్ని గ్రహించి నట్టు పండక్కి కొనుక్కుంటాలెమ్మన్నాడు నాగభూషి. ఉదయం,సాయంత్రం కొన్ని మైళ్లు వెళ్లి రావలసిన కొడుకు మధ్యాహ్నం ఓ ముద్ద తినడానికి కరణంగారి భార్య నడిగి పాత సత్తు టిఫిన్ కారియర్ తెచ్చింది సీతమ్మ. కొక్కెంలేని ఆ కారియరే, చిన్నారి నాగభూషికి అంతరాలు నిండిన ఈ లోకం తీరును అనుభవానికి తెచ్చింది. అన్నం గిన్నెల్లోనే ఉన్నా కడుపు నిండిపోయేటట్టు చేసింది. ఇదంతా స్కూలు తెరిచిన రోజే. 

                 పాత దుస్తులు, పాత కారియర్ చూసి ‘సత్తెప్పాలా’ (సత్తు తెపాలా) అని ఓ కలవారి పిల్లాడు ఆలస్యం లేకుండా పేరెట్టేశాడు. పాత కారియర్ కాబట్టి అందులోఉన్నది చద్ది కూడని కూడా పిల్లలు అనుకుంటారు. అన్నం తినే చోటు ఏదైనా ఉంటే అక్కడే దాన్ని భద్రపరుచుకుందామని అను కుంటాడు వాడు. చద్దన్నం తినే చోటు సొరాజ్యం వచ్చాక వస్తుందులే అంటారు పెద్దింటి గడుగ్గాయిలు. అమ్మ ఇచ్చిందన్న ప్రేమతో కాబోలు, ఏ క్లాసుకి వెళ్లినా దాన్ని కూడా పట్టుకుని వెళుతూ ఉంటాడు నాగభూషి. గంట కొట్టిన తరువాత అన్నం తిందామనుకున్నా, పాఠాలు ఒక్క సారి పునశ్చరణ చేసుకుని తిందామని అనుకుంటాడు. ఆ పాఠాలన్నీ అలవోకగా స్మరించుకున్నాడు. అది అతడి తెలివి తేటలకి నిదర్శనం. అప్పుడు చేతులు కడుక్కుని అన్నం తిందామని అనుకుంటే ఎక్కడా కుళాయి కనిపించదు. చివరికి ఒకచోట చూసినా అందులో నుంచి నీళ్లు రావు. ఓ వైపు దాహం, ఇంకోవైపు చెప్పుల్లేని కాళ్లు చురుక్కుమంటు న్నాయి. ఓ అరుగుమీద కూర్చుండిపోతాడు. భోజనం లేదు. అలాగే నిద్రపోతాడు. బట్టలు ఇంకా మురికయ్యాయి. మళ్లీ గంట మోగితే లేచాడు నాగభూషి. అంతా ఆటలకి వెళుతున్నారు. తనకి తీవ్రమైన నిస్త్రాణ. ఆటలకి వస్తావా అని ఓ కుర్రాడు అడిగితే, సత్తెప్పాలా ఎందుకు అంటూ ఆ బిరుదిచ్చిన కుర్రాడే మళ్లీ హేళన చేస్తాడు. 

                కరణంగారింట్లో తల్లి కూడా బస్తీలో కొడుకు పడే ఇబ్బందులు ఊహించుకుని పనులలో తడబడుతూ ఉంటుంది. చీకటి పడుతుండగా నాగభూషి గొంతు వినిపిం చింది. ఆ గొంతు నిండా దుఃఖం. అమ్మని కౌగిలించుకుని ‘ఇంక నేను పోనే అమ్మా!’ అని నిశ్చయంగా చెప్పేస్తాడు. కథ ముగుస్తుంది. కానీ, అంతరాల దొంతర్ల మీద, అంతరాంతరాల్లో ఓ ఆలోచన పొటమరిస్తుంది. అదే గొప్ప రచనల లక్షణమంటారు పెద్దలు. 


                నవోదయ సంస్థ జరుక్ శాస్త్రి కథాసంకలనం - శరత్పూర్ణిమ 

                                                                                        - కొలచన రుక్మాంగదరావు
            అంతరాల దొంతర్ల వల్ల మనసుకు కలిగే నెప్పిని పెద్దలు దాచి పెట్టినా. పిల్లలకు సాధ్యం కాదు. అంతరాలూ, వాటి పర్యవసానాలూ కళ్లుమూసుకున్నా కనిపించే చేదు నిజాలు. కలవారూ లేని వారు అన్న అంతరానికి తోడు, ఇప్పుడు పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరం రంగమ్మీదకు వచ్చింది. దాని వేళ్లు లోతయినవీ, విస్తృతమైనవీను. ఆర్థిక సమస్య, హార్దిక సమస్యగా మారిన వైనాన్ని హృద్యంగా చెప్పిన కథ ‘నేను పోనే!’. పేదరికంతో పాటు, పల్లె-బస్తీ అంతరం స్వాతంత్య్రానికి ముందు కూడా ఉందని చెబుతుందీ కథ. వేద పండితుడు, కవి, పత్రికా రచయిత -తెలుగులో పేరడీ ప్రక్రియకు ఆద్యుడు- జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి ఈ కథ రాశారు.               జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి లేదా జరుక్‌శాస్త్రి ప్రత్యక్షరం చమత్కారానికి విలాసం. కానీ ‘సాహిత్యం కోసం అంతగా ప్రాణం పెట్టిన మనిషి ఇంకొకరు లే’రం టారు సమకాలికులు. ‘జలసూత్రం’ ఇంటి పేరేమిటి? అంటే నీటిసూత్రం- హెచ్‌టువో- కనిపెట్టింది మా వాళ్లే అని చమత్కరించేవారాయన. ఆయన వెక్కిరించని తెలుగు సాహితీ దిగ్గజం లేదు. విశ్వనాథ, దేవులపల్లి, శ్రీశ్రీలతో సహా ఆయన ‘కణకణ మండే’ పేరడీల పోటు తప్పిం చుకున్న ధన్యులు తక్కువే. విశ్వనాథ వారిని ‘పాషాణ పాక ప్రభు’ అని ముద్దుగా ఎద్దేవా చేసిన ఉద్దండుడు. భావకవులనీ, అభ్యుదయ కవులనీ కూడా వెక్కిరించి, నవ్వించారు. అయినా ఆయన సర్వసాహితీ జనబంధువే. ‘రుక్కయ్యా! వాణికి లిప్‌స్టిక్కయ్యా!’ అని ముచ్చటపడ్డాడు శ్రీశ్రీ. కొంచమే అయినప్పటికీ ‘శరత్ పూర్ణిమ’ ‘ఒక్ఖ దణ్ణం’ వంటి గొప్ప కథలూ, చుర్రుమనే పద్యాలు కూడా పలికినా జరుక్ చెప్పిన పేరడీలే ఖ్యాతి గాంచాయి. కరణంగారింట్లో వంట మనిషి సీతమ్మ. ఆమె కొడుకు నాగభూషి. ‘బోసినవ్వులునవ్వే రోజుల్లో’నే తండ్రిని పొగొట్టుకున్నవాడు. పిల్లవాడిని చంకనేసుకుని పుట్టింటికి వెళ్లి భంగపడిన సీతమ్మకు కరణంగారి భార్య వంట పని ఇచ్చింది. పిల్లవాడికీ ఇక్కడే అన్నం పెట్టమని ఔదార్యం ప్రదర్శించింది. గ్రామంలోనే ఉండి చదువుకున్నాడు నాగభూషి. ఇప్పుడు కాస్త పెద్దచదువుకి బస్తీ వెళుతున్నాడు.                అంతరాల గురించి సిద్ధాంతాలూ, రాద్ధాంతాల ఆధారంగా ఒక కల్పన లేకున్నా, సహజంగా ఉండే బెరుకు సీతమ్మకూ ఉంది. కొడుకు బస్తీ బడిలో నెగ్గుకు రాగలడా? ‘వస్తా’నన్నాడు నాగభూషి. దాచుకున్న డబ్బులన్నీ పోసి పుస్తకాలు కొనిపెట్టగలిగింది. పౌంటేన్ పెన్నూ కావాల న్నాడు. ‘పండక్కి’ అని వాయిదా వేయబోయినా, కొడుకు ముచ్చట చూసి సరేనందామె. తల్లి అంతరంగాన్ని గ్రహించి నట్టు పండక్కి కొనుక్కుంటాలెమ్మన్నాడు నాగభూషి. ఉదయం,సాయంత్రం కొన్ని మైళ్లు వెళ్లి రావలసిన కొడుకు మధ్యాహ్నం ఓ ముద్ద తినడానికి కరణంగారి భార్య నడిగి పాత సత్తు టిఫిన్ కారియర్ తెచ్చింది సీతమ్మ. కొక్కెంలేని ఆ కారియరే, చిన్నారి నాగభూషికి అంతరాలు నిండిన ఈ లోకం తీరును అనుభవానికి తెచ్చింది. అన్నం గిన్నెల్లోనే ఉన్నా కడుపు నిండిపోయేటట్టు చేసింది. ఇదంతా స్కూలు తెరిచిన రోజే.                  పాత దుస్తులు, పాత కారియర్ చూసి ‘సత్తెప్పాలా’ (సత్తు తెపాలా) అని ఓ కలవారి పిల్లాడు ఆలస్యం లేకుండా పేరెట్టేశాడు. పాత కారియర్ కాబట్టి అందులోఉన్నది చద్ది కూడని కూడా పిల్లలు అనుకుంటారు. అన్నం తినే చోటు ఏదైనా ఉంటే అక్కడే దాన్ని భద్రపరుచుకుందామని అను కుంటాడు వాడు. చద్దన్నం తినే చోటు సొరాజ్యం వచ్చాక వస్తుందులే అంటారు పెద్దింటి గడుగ్గాయిలు. అమ్మ ఇచ్చిందన్న ప్రేమతో కాబోలు, ఏ క్లాసుకి వెళ్లినా దాన్ని కూడా పట్టుకుని వెళుతూ ఉంటాడు నాగభూషి. గంట కొట్టిన తరువాత అన్నం తిందామనుకున్నా, పాఠాలు ఒక్క సారి పునశ్చరణ చేసుకుని తిందామని అనుకుంటాడు. ఆ పాఠాలన్నీ అలవోకగా స్మరించుకున్నాడు. అది అతడి తెలివి తేటలకి నిదర్శనం. అప్పుడు చేతులు కడుక్కుని అన్నం తిందామని అనుకుంటే ఎక్కడా కుళాయి కనిపించదు. చివరికి ఒకచోట చూసినా అందులో నుంచి నీళ్లు రావు. ఓ వైపు దాహం, ఇంకోవైపు చెప్పుల్లేని కాళ్లు చురుక్కుమంటు న్నాయి. ఓ అరుగుమీద కూర్చుండిపోతాడు. భోజనం లేదు. అలాగే నిద్రపోతాడు. బట్టలు ఇంకా మురికయ్యాయి. మళ్లీ గంట మోగితే లేచాడు నాగభూషి. అంతా ఆటలకి వెళుతున్నారు. తనకి తీవ్రమైన నిస్త్రాణ. ఆటలకి వస్తావా అని ఓ కుర్రాడు అడిగితే, సత్తెప్పాలా ఎందుకు అంటూ ఆ బిరుదిచ్చిన కుర్రాడే మళ్లీ హేళన చేస్తాడు.                 కరణంగారింట్లో తల్లి కూడా బస్తీలో కొడుకు పడే ఇబ్బందులు ఊహించుకుని పనులలో తడబడుతూ ఉంటుంది. చీకటి పడుతుండగా నాగభూషి గొంతు వినిపిం చింది. ఆ గొంతు నిండా దుఃఖం. అమ్మని కౌగిలించుకుని ‘ఇంక నేను పోనే అమ్మా!’ అని నిశ్చయంగా చెప్పేస్తాడు. కథ ముగుస్తుంది. కానీ, అంతరాల దొంతర్ల మీద, అంతరాంతరాల్లో ఓ ఆలోచన పొటమరిస్తుంది. అదే గొప్ప రచనల లక్షణమంటారు పెద్దలు.                 నవోదయ సంస్థ జరుక్ శాస్త్రి కథాసంకలనం - శరత్పూర్ణిమ                                                                                         - కొలచన రుక్మాంగదరావు

Features

  • : Sarath Purnima
  • : Jalasutram Rukmininadha Sastry
  • : Navodaya
  • : NAVOPH0415
  • : Paperback
  • : 190
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sarath Purnima

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam