Bharatheya Saiva Kshetra Yatradarshini

By S P Chari (Author)
Rs.100
Rs.100

Bharatheya Saiva Kshetra Yatradarshini
INR
NVRTNA0190
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

శ్రీ 'యస్పీ చారి' గారు తెలుగు పాఠకులకు సుపరిచితులు కధ, నవల, వ్యాసరచయితగా వీరు తమకంటూ ఓస్థానాన్ని తెలుగు సాహితీ ప్రపంచలో ఏర్పరుచుకున్నారు. వీరు భారతదర్శిని పేరిట పత్రికల్లో ప్రచురించిన వ్యాసపరంపరని 'ఇండియా ట్రావెల్ గైడ్'గా ఋషి సంస్థ ఈ మధ్యనే విడుదల చేసింది. దాని తర్వాత ఈ 'భారతీయ శివాలయాలు' మీ ముందుకొచ్చింది.

యుగయుగాల నుంచి భారతీయ సంస్కృతీ, నాగరికతలకు విశ్వవ్యాప్తంగా ఓ విశిష్ట స్థానం లభిస్తోంది.

హిందూ మత సిద్ధాంతాల్లో దైవభక్తీకీ పెద్దపిట వేయబడింది.

భారతీయులు అనేక మతాల్ని ఆదరిస్తూనే తమదంటూ కాపాడుకుంటూ వస్తున్న దైవారాధనని ఏవరికి యిబ్బందికరం కాకుండా కొనసాగిస్తున్నారు.

త్రిమూర్తుల్లోని బ్రాహ్మదేవుడికి ఆలయ పూజార్హత లేదు. మిగతా రెండు మతాలయాలు శివుడికీ, విష్ణువుకూ చెందినవే దేశమంతటావున్నాయి.

వాటిలో అన్నిటికన్నా అధికంగా వున్నవి శివాలయాలే! ఉత్తర భారతంలోని ప్రాచీన ఆలయాలన్నీ దేశ దురాక్రమణదారుల చేతుల్లో శిధిలమయ్యాయి. ఆ దుశ్చర్యలకు కారకులు ఏకారణాల వల్లనో కర్ణాటక, కేరళ, తమిళనాడులకి చేరలేకపోయారు.

అందుకే అక్కడి అతి ప్రాచీన ఆలయాలన్నీ నేటికీ చెక్కుచెదరకుండా నిలిచి హిందూమత ప్రాబల్యాన్ని వెల్లడిస్తున్నాయి.

భారతీయులచే అత్యదికంగా పూజలందుకునే ఆరాధ్యదైవం పరమశివుడు. శివక్షేత్రాలలో జ్యోతిర్లింగ ప్రదేశాలు శివపూజకు బలమైన క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. అవి 1. సోమనాద్, 2. ద్వారక, 3. ఉజ్జయిని, 4. శ్రీశైలం, 5. ఓంకారేశ్వర్, 6. కేదార్నాథ్, 7. కాశి, 8. త్రయంబకేశ్వర్, 9. రామేశ్వరం, 10. మహాకాళేశ్వర్, 11. గృష్ణేశ్వర్, 12. వైద్యనాద్.

యివి కాకుండా శివ చైతన్యాన్ని ఈ క్రింది దేవాలయాలు తమ స్థాన గుణాలకు ఆపాదించుకున్నాయి.

1. తిరువన్నామలై  - అగ్ని

2. కాంచీపురం      - భూమి

3. తిరువణకావల్   - జలం

4. చిదంబరం       -  ఆకాశం

5. శ్రీకాళహస్తి       - వాయువు

ఇక అత్యుత్తమ యాత్రా స్థలాలుగా కాశి తరువాత నిలిచిపోయిన క్షేత్రాలు, మదురై, తంజావూరు, తిరునల్వేలి, నేపాల్ లోని పశుపతినాధ దేవళం, కైలాస మానసవరాలుగా పేర్కొనబడుతున్నాయి.

పైవి కాకుండా దేశం దశ దిశల్లో అనేక శివ మందిరాలు నిలిచి వున్నాయి. ఆ క్షేత్ర వివరాల్ని మీకీ పుస్తకం వివరంగా అందిస్తుంది.

శైవ క్షేత్ర దర్శనానికి పుస్తకం ఓ మార్గదర్శిగా ఉపయోగపడుతుందని నా నమ్మకం.

- యస్పీ చారి 

 

శ్రీ 'యస్పీ చారి' గారు తెలుగు పాఠకులకు సుపరిచితులు కధ, నవల, వ్యాసరచయితగా వీరు తమకంటూ ఓస్థానాన్ని తెలుగు సాహితీ ప్రపంచలో ఏర్పరుచుకున్నారు. వీరు భారతదర్శిని పేరిట పత్రికల్లో ప్రచురించిన వ్యాసపరంపరని 'ఇండియా ట్రావెల్ గైడ్'గా ఋషి సంస్థ ఈ మధ్యనే విడుదల చేసింది. దాని తర్వాత ఈ 'భారతీయ శివాలయాలు' మీ ముందుకొచ్చింది. యుగయుగాల నుంచి భారతీయ సంస్కృతీ, నాగరికతలకు విశ్వవ్యాప్తంగా ఓ విశిష్ట స్థానం లభిస్తోంది. హిందూ మత సిద్ధాంతాల్లో దైవభక్తీకీ పెద్దపిట వేయబడింది. భారతీయులు అనేక మతాల్ని ఆదరిస్తూనే తమదంటూ కాపాడుకుంటూ వస్తున్న దైవారాధనని ఏవరికి యిబ్బందికరం కాకుండా కొనసాగిస్తున్నారు. త్రిమూర్తుల్లోని బ్రాహ్మదేవుడికి ఆలయ పూజార్హత లేదు. మిగతా రెండు మతాలయాలు శివుడికీ, విష్ణువుకూ చెందినవే దేశమంతటావున్నాయి. వాటిలో అన్నిటికన్నా అధికంగా వున్నవి శివాలయాలే! ఉత్తర భారతంలోని ప్రాచీన ఆలయాలన్నీ దేశ దురాక్రమణదారుల చేతుల్లో శిధిలమయ్యాయి. ఆ దుశ్చర్యలకు కారకులు ఏకారణాల వల్లనో కర్ణాటక, కేరళ, తమిళనాడులకి చేరలేకపోయారు. అందుకే అక్కడి అతి ప్రాచీన ఆలయాలన్నీ నేటికీ చెక్కుచెదరకుండా నిలిచి హిందూమత ప్రాబల్యాన్ని వెల్లడిస్తున్నాయి. భారతీయులచే అత్యదికంగా పూజలందుకునే ఆరాధ్యదైవం పరమశివుడు. శివక్షేత్రాలలో జ్యోతిర్లింగ ప్రదేశాలు శివపూజకు బలమైన క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. అవి 1. సోమనాద్, 2. ద్వారక, 3. ఉజ్జయిని, 4. శ్రీశైలం, 5. ఓంకారేశ్వర్, 6. కేదార్నాథ్, 7. కాశి, 8. త్రయంబకేశ్వర్, 9. రామేశ్వరం, 10. మహాకాళేశ్వర్, 11. గృష్ణేశ్వర్, 12. వైద్యనాద్. యివి కాకుండా శివ చైతన్యాన్ని ఈ క్రింది దేవాలయాలు తమ స్థాన గుణాలకు ఆపాదించుకున్నాయి. 1. తిరువన్నామలై  - అగ్ని 2. కాంచీపురం      - భూమి 3. తిరువణకావల్   - జలం 4. చిదంబరం       -  ఆకాశం 5. శ్రీకాళహస్తి       - వాయువు ఇక అత్యుత్తమ యాత్రా స్థలాలుగా కాశి తరువాత నిలిచిపోయిన క్షేత్రాలు, మదురై, తంజావూరు, తిరునల్వేలి, నేపాల్ లోని పశుపతినాధ దేవళం, కైలాస మానసవరాలుగా పేర్కొనబడుతున్నాయి. పైవి కాకుండా దేశం దశ దిశల్లో అనేక శివ మందిరాలు నిలిచి వున్నాయి. ఆ క్షేత్ర వివరాల్ని మీకీ పుస్తకం వివరంగా అందిస్తుంది. శైవ క్షేత్ర దర్శనానికి పుస్తకం ఓ మార్గదర్శిగా ఉపయోగపడుతుందని నా నమ్మకం. - యస్పీ చారి   

Features

  • : Bharatheya Saiva Kshetra Yatradarshini
  • : S P Chari
  • : Navaratna
  • : NVRTNA0190
  • : Paperback
  • : 272
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bharatheya Saiva Kshetra Yatradarshini

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam