Adhyatimka Vijaya Sutralu

By A R K Sarma (Author)
Rs.100
Rs.100

Adhyatimka Vijaya Sutralu
INR
RAMKRIMA04
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            ఆధ్యాత్మిక సత్యాలు ఇంతకన్నా సులభంగా చెప్పడం వీలుకాదు - అనంతంగా వివరించే బృహత్ గ్రంథం శ్రీరామాకృష్ణ కధామృతం. గ్రామ్య భాషలో చిరుపల్కులలో పల్కిన శ్రీరామకృష్ణుల అమృత వాక్కులు ఈ కాలానికి అమృతగుళికలు. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న అన్ని రకాల ఆధ్యాత్మిక సాధనలను అనుష్టించి, అనుభూతిని చెంది ఈ కలియుగపు అన్నగత ప్రాణులకు ఉపయుక్తమైనది, సులభమైన ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రభోదించిన మహాపురుషుడు శ్రీరామకృష్ణ పరమహంస.

ఇప్పటికే శ్రీ రామకృష్ణ కధామృతం బహుళ ప్రాచుర్యం సంతరించుకోవడంతో పాటు భక్తుడు శ్రీరామకృష్ణ కధామృతాన్ని కేవలం పుస్తకంలానే గాక మనఃశ్శాంతిని ఇచ్చే దివ్యౌషదంగా గుర్తించగలిగాడు. ఇలాంటి బృహత్ గ్రంధాన్ని ఆధారంగా చేసుకొని రచించిన గ్రంథం 'ఆధ్యాత్మిక విజయసూత్రాలు'

కలియుగంలో భక్తిమార్గమే జనులకు సులభమైన మార్గం. ఆ భక్తియోగ సాధనకు, సాధకుడు అవలంబించవలసిన పద్ధతులను తొమ్మిది విధాలుగా వర్గీకరించి ఒక్కొక్క పద్ధతి ఆధ్యాత్మిక విజయాన్ని సాధించడానికి ఉపయోగపడే సూత్రంగా తెలియజేసారు రచయిత శ్రీ ఎ.ఆర్.కె. శర్మ గణితశాస్త్రంలో సమస్య పరిష్కారానికి సూత్రం ఎలా ఉపయోగపడుతుందో అదే విధంగా ఆధ్యాత్మిక జీవితంలో రాణించడానికి ఈ సూత్రాలు ఉపయోగపడతాయి. ఆధ్యాత్మిక జీవితంలో భక్తియోగం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవడానికి అనువుగా సాధకుడు తీసుకోవల్సిన జాగ్రతలు, సూచనలు తెలియజేయడమేకాక శ్రీరామకృష్ణలు భక్తియోగానికి సంబంధించి ఆయా వ్యక్తులతో మాట్లాడిన విషయాలు ఒక చోట క్రోడీకరించడం వలన సాధకుడు సులభమైన రీతిలో అర్ధం చేసుకొనే అవకాశం ఉంది.

అంతేకాకుండా శ్రీరామకృష్ణలు క్లిష్టతరమైన ఆధ్యాత్మిక విషయాలను భక్తులకు స్పష్టమైనరీతిలో అర్ధం చేసుకొనే విధంగా వివరించిన కధలను శ్రీ శర్మగారు సందర్భానికి తగ్గట్టు ఈ పుస్తకంలో ఉదహరించడమే కాక., ఆ కధలకు, విషయాలకు సంబంధించిన వర్ణ చిత్రణలను సాధకుడు మనస్సులో గట్టి ముద్రను వేస్తాయి.

ఇప్పటికే వీరు ఆగ్లంలో రాసిన Swami Vivekananda's Winning Formulas to become Successful Managers, Winning Friendship-Swami Vivekananda's ways బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. ఈ ఆధ్యాత్మిక విజయ సూత్రాలు పుస్తకం చదివి, ఆచరించిన ప్రతీ ఆధ్యాత్మిక సాధకుడూ  ఆధ్యాత్మిక లబ్ధిని పొందగలరని ఆశిస్తున్నాము. 

- ఎ.ఆర్.కె. శర్మ 

            ఆధ్యాత్మిక సత్యాలు ఇంతకన్నా సులభంగా చెప్పడం వీలుకాదు - అనంతంగా వివరించే బృహత్ గ్రంథం శ్రీరామాకృష్ణ కధామృతం. గ్రామ్య భాషలో చిరుపల్కులలో పల్కిన శ్రీరామకృష్ణుల అమృత వాక్కులు ఈ కాలానికి అమృతగుళికలు. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న అన్ని రకాల ఆధ్యాత్మిక సాధనలను అనుష్టించి, అనుభూతిని చెంది ఈ కలియుగపు అన్నగత ప్రాణులకు ఉపయుక్తమైనది, సులభమైన ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రభోదించిన మహాపురుషుడు శ్రీరామకృష్ణ పరమహంస. ఇప్పటికే శ్రీ రామకృష్ణ కధామృతం బహుళ ప్రాచుర్యం సంతరించుకోవడంతో పాటు భక్తుడు శ్రీరామకృష్ణ కధామృతాన్ని కేవలం పుస్తకంలానే గాక మనఃశ్శాంతిని ఇచ్చే దివ్యౌషదంగా గుర్తించగలిగాడు. ఇలాంటి బృహత్ గ్రంధాన్ని ఆధారంగా చేసుకొని రచించిన గ్రంథం 'ఆధ్యాత్మిక విజయసూత్రాలు' కలియుగంలో భక్తిమార్గమే జనులకు సులభమైన మార్గం. ఆ భక్తియోగ సాధనకు, సాధకుడు అవలంబించవలసిన పద్ధతులను తొమ్మిది విధాలుగా వర్గీకరించి ఒక్కొక్క పద్ధతి ఆధ్యాత్మిక విజయాన్ని సాధించడానికి ఉపయోగపడే సూత్రంగా తెలియజేసారు రచయిత శ్రీ ఎ.ఆర్.కె. శర్మ గణితశాస్త్రంలో సమస్య పరిష్కారానికి సూత్రం ఎలా ఉపయోగపడుతుందో అదే విధంగా ఆధ్యాత్మిక జీవితంలో రాణించడానికి ఈ సూత్రాలు ఉపయోగపడతాయి. ఆధ్యాత్మిక జీవితంలో భక్తియోగం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవడానికి అనువుగా సాధకుడు తీసుకోవల్సిన జాగ్రతలు, సూచనలు తెలియజేయడమేకాక శ్రీరామకృష్ణలు భక్తియోగానికి సంబంధించి ఆయా వ్యక్తులతో మాట్లాడిన విషయాలు ఒక చోట క్రోడీకరించడం వలన సాధకుడు సులభమైన రీతిలో అర్ధం చేసుకొనే అవకాశం ఉంది. అంతేకాకుండా శ్రీరామకృష్ణలు క్లిష్టతరమైన ఆధ్యాత్మిక విషయాలను భక్తులకు స్పష్టమైనరీతిలో అర్ధం చేసుకొనే విధంగా వివరించిన కధలను శ్రీ శర్మగారు సందర్భానికి తగ్గట్టు ఈ పుస్తకంలో ఉదహరించడమే కాక., ఆ కధలకు, విషయాలకు సంబంధించిన వర్ణ చిత్రణలను సాధకుడు మనస్సులో గట్టి ముద్రను వేస్తాయి. ఇప్పటికే వీరు ఆగ్లంలో రాసిన Swami Vivekananda's Winning Formulas to become Successful Managers, Winning Friendship-Swami Vivekananda's ways బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. ఈ ఆధ్యాత్మిక విజయ సూత్రాలు పుస్తకం చదివి, ఆచరించిన ప్రతీ ఆధ్యాత్మిక సాధకుడూ  ఆధ్యాత్మిక లబ్ధిని పొందగలరని ఆశిస్తున్నాము.  - ఎ.ఆర్.కె. శర్మ 

Features

  • : Adhyatimka Vijaya Sutralu
  • : A R K Sarma
  • : Sri Sarada Book House
  • : RAMKRIMA04
  • : Paperback
  • : January, 2011
  • : 176
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Adhyatimka Vijaya Sutralu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam