Neetirangula Chitram

Rs.150
Rs.150

Neetirangula Chitram
INR
NAVOPH0476
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

నిర్వికల్పసంగీతం(1986), ఒంటరిచేలమధ్య ఒక్కత్తే మన అమ్మ(1995), పునర్యానం (2004), కోకిల ప్రవేశించేకాలం (2009) తరువాత వాడ్రేవు చినవీరభద్రుడు వెలువరిస్తున్న కవితా సంపుటి ఈ 'నీటిరంగుల చిత్రం'.

గత ఐదేళ్ళుగా రాస్తూ వచ్చిన ఈ కవితల్లో కవి తనకు జీవితసత్యం, సౌందర్యం, జీవితానందం సిద్ధించే మెలకువ కోసం నిరంతర జాగరూకతతో అన్వేషిస్తూండడం కనిపిస్తుంది.

అటువంటి జాగృతక్షణాల్లో తన జీవితం తనకు పూర్తిగా కరతలామకమైందనే ఎరుక ఈ కవిత్వంలోని ప్రధాన సూత్రం. అటువంటి వేళల్లో తాను తన జీవితసారాంశంలోకి నేరుగా చొచ్చుకుపోయినట్లుగా కలిగిన ప్రగాఢానుభూతిని అక్షరీకరించే ప్రయత్నం, ప్రయోగం ఈ కవిత్వం.

కవిత్వం మాటల్నే ఆశ్రయించుకుని ఉన్నప్పటికీ అది మాటల్లో మాత్రమే లేదనీ, విద్యుచ్ఛక్తి రాగితీగ లోపలనుంచి కాకుండా రాగితీగ వెంబడి ప్రసరించినట్లే కవిత్వం కూడా మాటల్లోంచి కాకుండా మాటలచుట్టూ ప్రసరిస్తుందనే గ్రహింపు ఈ కవిత్వం పొడుగునా కనిపిస్తుంది.

తన కవిత్వ పరిణామం గురించీ, తన మీద ప్రభావం చూపించిన కవుల గురించీ తన అన్వేషణ గురించీ చినవీరభద్రుడు యువ భావుకుడూ, సాహిత్య జిజ్ఞాసి ఆదిత్య కొర్రపాటితో చేసిన సంభాషణ ఈ సంపుటికి అదనపు ఆకర్షణ.

నిర్వికల్పసంగీతం(1986), ఒంటరిచేలమధ్య ఒక్కత్తే మన అమ్మ(1995), పునర్యానం (2004), కోకిల ప్రవేశించేకాలం (2009) తరువాత వాడ్రేవు చినవీరభద్రుడు వెలువరిస్తున్న కవితా సంపుటి ఈ 'నీటిరంగుల చిత్రం'. గత ఐదేళ్ళుగా రాస్తూ వచ్చిన ఈ కవితల్లో కవి తనకు జీవితసత్యం, సౌందర్యం, జీవితానందం సిద్ధించే మెలకువ కోసం నిరంతర జాగరూకతతో అన్వేషిస్తూండడం కనిపిస్తుంది. అటువంటి జాగృతక్షణాల్లో తన జీవితం తనకు పూర్తిగా కరతలామకమైందనే ఎరుక ఈ కవిత్వంలోని ప్రధాన సూత్రం. అటువంటి వేళల్లో తాను తన జీవితసారాంశంలోకి నేరుగా చొచ్చుకుపోయినట్లుగా కలిగిన ప్రగాఢానుభూతిని అక్షరీకరించే ప్రయత్నం, ప్రయోగం ఈ కవిత్వం. కవిత్వం మాటల్నే ఆశ్రయించుకుని ఉన్నప్పటికీ అది మాటల్లో మాత్రమే లేదనీ, విద్యుచ్ఛక్తి రాగితీగ లోపలనుంచి కాకుండా రాగితీగ వెంబడి ప్రసరించినట్లే కవిత్వం కూడా మాటల్లోంచి కాకుండా మాటలచుట్టూ ప్రసరిస్తుందనే గ్రహింపు ఈ కవిత్వం పొడుగునా కనిపిస్తుంది. తన కవిత్వ పరిణామం గురించీ, తన మీద ప్రభావం చూపించిన కవుల గురించీ తన అన్వేషణ గురించీ చినవీరభద్రుడు యువ భావుకుడూ, సాహిత్య జిజ్ఞాసి ఆదిత్య కొర్రపాటితో చేసిన సంభాషణ ఈ సంపుటికి అదనపు ఆకర్షణ.

Features

  • : Neetirangula Chitram
  • : Vadrevu China Veerabhadrudu
  • : Navodaya Publications
  • : NAVOPH0476
  • : Paperback
  • : 2014
  • : 150
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Neetirangula Chitram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam