Yenuganta Tandrikanna Yekulabuttantha Tallinayam

By Gogu Syamala (Author)
Rs.80
Rs.80

Yenuganta Tandrikanna Yekulabuttantha Tallinayam
INR
HYDBOOK101
Out Of Stock
80.0
Rs.80
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                   సూర్యగ్రహణాన్నివర్ణించనీ చావడి దగ్గర చేరిన గ్రామస్తులను గురించి చెప్పనీ, బర్రెమీద సవారీచేసే పల్లెటూరి పిల్లను గురించి చెప్పనీ, దళితులు కొట్టే డప్పు చప్పుడులోని వివిధ దరువులను పరిచయం చేయనీ.... గోగు శ్యామల కథనంలో వుండే మంత్ర శక్తి ఒకే స్థాయిలో వుంటుంది. దానికి పరిమితులు లేవు. ఆమె మనకు ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని చూపిస్తూనే విశాల విశ్వంలోకి నడిపిస్తుంది. ఒక్కసారిగా బాల్యంలోకి పరుగుతీసి అవధులూ ఆకాంక్షలూ ఎరుగని అమాయకపు కళ్ళతో దళిత జీవితాన్ని మన ముందుకు తెస్తుంది. దళితుల రోజువారీ జీవితాన్నివివరంగా కళాత్మకంగా ఎంతో చాతుర్యంతో కళ్ళకు కట్టిస్తుంది.

              ఈ కథలకి నేపద్యం ఒక తెలంగాణా గ్రామంలోని మాదిగ వాడ. అక్కడి వివిధ సందర్భాలనూ, సన్నివేశాలనూ,  జనం అనుభవాలనూ చిత్రిస్తూ వాటిని అవగాహన చేసుకునే ఒక కొత్త చూపును పాఠకులకు ప్రసాదిస్తుంది.

                   పూర్వపు రచనలలో అటువంటి ప్రదేశాలను, ప్రజలను వర్ణించడానికి ఉపయోగించిన భాష గురించి,  వాటి పట్ల ఆ రచనలలో కనబడిన భావుకత, పరిపాలనాదృక్పధం, గాంధీత్వ దృష్టి గురించి చెపుతున్నప్పుడు ఆమె చమత్కారం చాలా నవ్వు తెప్పిస్తుంది. ఈ కథల పరిష్కారాలు ఊరి నుంచి, మాదిగవాడ నుంచి, అటువంటి ఇతర సమూహాల నుంచి మనుషుల్ని బయటికి పంపిచడంలో లేదు. అక్కడి జనజీవితాన్నే భవిష్యత్ ఆశగా చూపించే కథలు ఆమెవి.

                 తన పదునైన రాజకీయ భావాలను గాఢమైన కథన సౌందర్యంతో మేళవించి, దళిత రచనంటే కేవలం పీడన గురించి వ్రాయడమేననే మూసాభిప్రాయాన్ని బద్దలు కొట్టింది గోగు శ్యామల. 

- గోగు శ్యామల 

                   సూర్యగ్రహణాన్నివర్ణించనీ చావడి దగ్గర చేరిన గ్రామస్తులను గురించి చెప్పనీ, బర్రెమీద సవారీచేసే పల్లెటూరి పిల్లను గురించి చెప్పనీ, దళితులు కొట్టే డప్పు చప్పుడులోని వివిధ దరువులను పరిచయం చేయనీ.... గోగు శ్యామల కథనంలో వుండే మంత్ర శక్తి ఒకే స్థాయిలో వుంటుంది. దానికి పరిమితులు లేవు. ఆమె మనకు ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని చూపిస్తూనే విశాల విశ్వంలోకి నడిపిస్తుంది. ఒక్కసారిగా బాల్యంలోకి పరుగుతీసి అవధులూ ఆకాంక్షలూ ఎరుగని అమాయకపు కళ్ళతో దళిత జీవితాన్ని మన ముందుకు తెస్తుంది. దళితుల రోజువారీ జీవితాన్నివివరంగా కళాత్మకంగా ఎంతో చాతుర్యంతో కళ్ళకు కట్టిస్తుంది.               ఈ కథలకి నేపద్యం ఒక తెలంగాణా గ్రామంలోని మాదిగ వాడ. అక్కడి వివిధ సందర్భాలనూ, సన్నివేశాలనూ,  జనం అనుభవాలనూ చిత్రిస్తూ వాటిని అవగాహన చేసుకునే ఒక కొత్త చూపును పాఠకులకు ప్రసాదిస్తుంది.                    పూర్వపు రచనలలో అటువంటి ప్రదేశాలను, ప్రజలను వర్ణించడానికి ఉపయోగించిన భాష గురించి,  వాటి పట్ల ఆ రచనలలో కనబడిన భావుకత, పరిపాలనాదృక్పధం, గాంధీత్వ దృష్టి గురించి చెపుతున్నప్పుడు ఆమె చమత్కారం చాలా నవ్వు తెప్పిస్తుంది. ఈ కథల పరిష్కారాలు ఊరి నుంచి, మాదిగవాడ నుంచి, అటువంటి ఇతర సమూహాల నుంచి మనుషుల్ని బయటికి పంపిచడంలో లేదు. అక్కడి జనజీవితాన్నే భవిష్యత్ ఆశగా చూపించే కథలు ఆమెవి.                  తన పదునైన రాజకీయ భావాలను గాఢమైన కథన సౌందర్యంతో మేళవించి, దళిత రచనంటే కేవలం పీడన గురించి వ్రాయడమేననే మూసాభిప్రాయాన్ని బద్దలు కొట్టింది గోగు శ్యామల.  - గోగు శ్యామల 

Features

  • : Yenuganta Tandrikanna Yekulabuttantha Tallinayam
  • : Gogu Syamala
  • : Hyderabad Book Trust
  • : HYDBOOK101
  • : Paperback
  • : December 2013
  • : 100
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Yenuganta Tandrikanna Yekulabuttantha Tallinayam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam