Viswa Vijetha

Rs.350
Rs.350

Viswa Vijetha
INR
MANIMN3588
Out Of Stock
350.0
Rs.350
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

మొదటి అధ్యాయం

1898వ సంవత్సరం. కలకత్తా ఉత్తర ప్రాంతం. హారిసన్ రోడ్. మూడంతస్తుల భవనంలో ఒక మారుమూల గది. మంచం మీద రెండేళ్ళ బాలుడు టైఫాయిడ్ జ్వరంతో పడుకుని ఉన్నాడు. అతడి వళ్ళు కాలిపోతోంది. గుమ్మం దగ్గర నిలబడి ఇద్దరు వ్యక్తులు అతని వైపే ఆందోళనగా చూస్తూ ఉన్నారు. అందులో ఒకరు ఆ కుర్రవాడి తండ్రి గారి

మోహన్ డే. పక్కనే ఉన్న వ్యక్తి ఆ బాలుడిని ట్రీట్ చేస్తున్న డాక్టర్ బోస్. మోహన్ డే స్నేహితుడు.

"అబ్బాయి బలహీనంగా ఉన్నాడు. చికెన్ సూప్ ఇస్తే మంచిది. లేదంటే ప్రాణాలకే ప్రమాదం" అన్నాడు డాక్టర్ బోస్.

"మేం వైష్ణవులం. ప్రాణం పోయినా ఒప్పుకోను."

బోస్ బ్రతిమిలాడుతున్నట్టూ “నీకంత అభ్యంతరమైతే మా ఇంట్లో చేయించి తీసుకువస్తాను మోహన్. దయచేసి ఒప్పుకో. ఇది జీవన్మరణ సమస్య" అన్నాడు.

"తప్పనిసరి అయితే ఇక నీ ఇష్టం" అయిష్టంగా జవాబిచ్చాడు తండ్రి. ఇంటిలో చికెన్ సూప్ తయారు చేయించి తెప్పించాడు డాక్టర్ బోస్. బాలుడిని రెండు చేతులు | మీద పైకి లేపి స్వయంగా తాగించబోగా మరుక్షణం వాంతి అయిపోయింది. అది చూసిన తండ్రి విశ్రాంతంగా ఊపిరి తీసుకున్నాడు. ఆ పై మరో రెండు రోజులు గడిచాయి. ఏ సూపు అవసరం లేకుండానే ఆ బాలుడు ఆరోగ్య వంతుడయ్యాడు.

"నీ కొడుకు అంత పెద్ద విషజ్వరంతో బాధపడుతూ ఉంటే, అతడి ఆరోగ్యం గురించి అంత ధీమాగా ఎలా ఉన్నావ్? ఏమిటి నీ ధైర్యం?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు | బోస్.

పుట్టగానే మా అబ్బాయి జాతకచక్రం వేసిన జ్యోతిష్యుడు ఏం చెప్పాడో తెలుసా? నా కొడుకు సముద్రాలు దాటుతాడని, వందకి పైగా గుళ్ళు కడతాదని, | కృష్ణతత్వాన్ని వాడవాడలా చాటిన ప్రవక్తగా చరిత్రలో నిలిచిపోతాడని చెప్పాడు. దాన్ని మనసా వాచా పూర్తిగా విశ్వసించిన నేను, భగవత్సంకల్పం వల పుట్టిన నా కొడుకు ఏ జ్వరము ఏమీ చేయదని మనస్ఫూర్తిగా నమ్మాను" అన్నాడు..............

మొదటి అధ్యాయం 1898వ సంవత్సరం. కలకత్తా ఉత్తర ప్రాంతం. హారిసన్ రోడ్. మూడంతస్తుల భవనంలో ఒక మారుమూల గది. మంచం మీద రెండేళ్ళ బాలుడు టైఫాయిడ్ జ్వరంతో పడుకుని ఉన్నాడు. అతడి వళ్ళు కాలిపోతోంది. గుమ్మం దగ్గర నిలబడి ఇద్దరు వ్యక్తులు అతని వైపే ఆందోళనగా చూస్తూ ఉన్నారు. అందులో ఒకరు ఆ కుర్రవాడి తండ్రి గారి మోహన్ డే. పక్కనే ఉన్న వ్యక్తి ఆ బాలుడిని ట్రీట్ చేస్తున్న డాక్టర్ బోస్. మోహన్ డే స్నేహితుడు. "అబ్బాయి బలహీనంగా ఉన్నాడు. చికెన్ సూప్ ఇస్తే మంచిది. లేదంటే ప్రాణాలకే ప్రమాదం" అన్నాడు డాక్టర్ బోస్. "మేం వైష్ణవులం. ప్రాణం పోయినా ఒప్పుకోను." బోస్ బ్రతిమిలాడుతున్నట్టూ “నీకంత అభ్యంతరమైతే మా ఇంట్లో చేయించి తీసుకువస్తాను మోహన్. దయచేసి ఒప్పుకో. ఇది జీవన్మరణ సమస్య" అన్నాడు. "తప్పనిసరి అయితే ఇక నీ ఇష్టం" అయిష్టంగా జవాబిచ్చాడు తండ్రి. ఇంటిలో చికెన్ సూప్ తయారు చేయించి తెప్పించాడు డాక్టర్ బోస్. బాలుడిని రెండు చేతులు | మీద పైకి లేపి స్వయంగా తాగించబోగా మరుక్షణం వాంతి అయిపోయింది. అది చూసిన తండ్రి విశ్రాంతంగా ఊపిరి తీసుకున్నాడు. ఆ పై మరో రెండు రోజులు గడిచాయి. ఏ సూపు అవసరం లేకుండానే ఆ బాలుడు ఆరోగ్య వంతుడయ్యాడు. "నీ కొడుకు అంత పెద్ద విషజ్వరంతో బాధపడుతూ ఉంటే, అతడి ఆరోగ్యం గురించి అంత ధీమాగా ఎలా ఉన్నావ్? ఏమిటి నీ ధైర్యం?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు | బోస్. పుట్టగానే మా అబ్బాయి జాతకచక్రం వేసిన జ్యోతిష్యుడు ఏం చెప్పాడో తెలుసా? నా కొడుకు సముద్రాలు దాటుతాడని, వందకి పైగా గుళ్ళు కడతాదని, | కృష్ణతత్వాన్ని వాడవాడలా చాటిన ప్రవక్తగా చరిత్రలో నిలిచిపోతాడని చెప్పాడు. దాన్ని మనసా వాచా పూర్తిగా విశ్వసించిన నేను, భగవత్సంకల్పం వల పుట్టిన నా కొడుకు ఏ జ్వరము ఏమీ చేయదని మనస్ఫూర్తిగా నమ్మాను" అన్నాడు..............

Features

  • : Viswa Vijetha
  • : Yandamuri Veerendranath
  • : Srila Prabhupada Foundation
  • : MANIMN3588
  • : Paperback
  • : July, 2022
  • : 440
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Viswa Vijetha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam