Natya Shikhamani Padmasri Nataraja Ramakrishna

Rs.200
Rs.200

Natya Shikhamani Padmasri Nataraja Ramakrishna
INR
MANIMN4796
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పద్మశ్రీ నటరాజ రామకృష్ణ

పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారు 21 మార్చి, 1923లో ఇండోనేషియాలో గల కలల దీవి 'బాలి'లో ఒక గొప్ప ఆంధ్రుల కుటుంబంలో జన్మించారు. అతని తల్లిదండ్రులు దమయంతి దేవి మరియు రామ్మోహనరావు. తల్లి గొప్ప కళాకారిణి, కవియిత్రి, గాయకురాలు, ఆధ్యాత్మిక చింత మెండు. ఆమె వీణ వాయించేవారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న విదుషీమణి. నాలుగైదు భాషలలో పండితురాలు. ఆమె పుట్టినిల్లు నల్గొండ జిల్లా కొలనుపాక గ్రామం. ఆమెకు ముగ్గురు బిడ్డలు జన్మించిన తరువాత ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమె ప్రసవానంతరం తల్లి కూతుళ్ళు ఇద్దరు మరణించారు. ఆమె చనిపోయిన నాటికీ రామకృష్ణకు మూడు సంవత్సరములు. రామకృష్ణ గారి అన్నయ్య శ్యామసుందర్. అతడు అందగాడు. రామకృష్ణ కంటే పదిసంవత్సరాలు పెద్దవాడు. శ్యామ సుందరుడు కళాశాల విద్యతో పాటు తెలుగు, ఆంగ్ల భాషలే గాక సంస్కృతం, ఉర్దూ, పారశీక భాషలలో కూడ ప్రావీణ్యం సంపాదించాడు. హిందూస్థానీ, కర్ణాటక సంగీతాన్ని బాగా అభ్యసించాడు. చక్కని చిత్రాలు చిత్రించగల చిత్రలేఖకుడు. శిల్ప శాస్త్రంలో ప్రావీణ్యమున్నవాడు. శిల్పాల మీద పరిశోధన రామకృష్ణ నాట్యాభ్యాసానికి మూలం. ప్రతిశిల్పంలోని భావాలను, లయవిన్యాసాలను, కదలికలను శ్యామ సుందరుడు వివరిస్తుంటే రామకృష్ణ ఆసక్తితో ఆలపించేవారు. ఈ శిల్పాలు సజీవులై ప్రతి మనిషిని కదిలించగలవని చెప్తూ ఉండేవారు. రామకృష్ణుడు చేత నృత్యాభ్యాసం చేయించిన వాడు శ్యామసుందరుడు.

నాట్యం పట్ల మక్కువ కలిగించిన తొలి అనుభవం

బాల్యంలో ఒక రోజు సాయంత్రం, చిరు గంటలు మ్రోగుతున్న వేళలో ఒక చిన్న దేవాలయంలో గజ్జెల సవ్వడి వినిపించింది. ఏమిటా అని వెళ్ళి చూసిన శ్రీ రామకృష్ణ గారికి పాలసముద్రం నుండి పుట్టినటువంట లక్ష్మీదేవి లాగా ఒక అందమైన స్త్రీ, జరి అంచుగల తెల్లని చీర, మరియు ఆభరణాలు ధరించి " నాద హరే జగన్నాధ హరే, శ్రీగతివా, రా రా” అంటూ పాడుతూ నృత్యం చేస్తూ కనిపించింది. ఆమె ముఖంలో తేజస్సు, నేత్రాల్లో భక్తిభావం, కదలికల్లో గాన వాహిని ప్రవహించినట్టు అనిపించింది. ఎప్పుడు తలుచుకున్న ఆవిడ వారి కంటి ముందు ఉన్నట్లు అనిపిస్తుంది. ఇదే వారి మొదటి అనుభవం.

తాను నాట్యం నేర్చుకోవాలని భావించిన రామకృష్ణ గారు గజ్జెలు లేకపోవడంతో ఎండిపోయిన తుమ్మకాయలను తుమ్మ చెట్ల నుండి తెంపి వాటిని ముక్కలుగా విరిచి కాళ్లకి కట్టుకుని నాట్యం చేసేవారు............................

పద్మశ్రీ నటరాజ రామకృష్ణ పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారు 21 మార్చి, 1923లో ఇండోనేషియాలో గల కలల దీవి 'బాలి'లో ఒక గొప్ప ఆంధ్రుల కుటుంబంలో జన్మించారు. అతని తల్లిదండ్రులు దమయంతి దేవి మరియు రామ్మోహనరావు. తల్లి గొప్ప కళాకారిణి, కవియిత్రి, గాయకురాలు, ఆధ్యాత్మిక చింత మెండు. ఆమె వీణ వాయించేవారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న విదుషీమణి. నాలుగైదు భాషలలో పండితురాలు. ఆమె పుట్టినిల్లు నల్గొండ జిల్లా కొలనుపాక గ్రామం. ఆమెకు ముగ్గురు బిడ్డలు జన్మించిన తరువాత ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమె ప్రసవానంతరం తల్లి కూతుళ్ళు ఇద్దరు మరణించారు. ఆమె చనిపోయిన నాటికీ రామకృష్ణకు మూడు సంవత్సరములు. రామకృష్ణ గారి అన్నయ్య శ్యామసుందర్. అతడు అందగాడు. రామకృష్ణ కంటే పదిసంవత్సరాలు పెద్దవాడు. శ్యామ సుందరుడు కళాశాల విద్యతో పాటు తెలుగు, ఆంగ్ల భాషలే గాక సంస్కృతం, ఉర్దూ, పారశీక భాషలలో కూడ ప్రావీణ్యం సంపాదించాడు. హిందూస్థానీ, కర్ణాటక సంగీతాన్ని బాగా అభ్యసించాడు. చక్కని చిత్రాలు చిత్రించగల చిత్రలేఖకుడు. శిల్ప శాస్త్రంలో ప్రావీణ్యమున్నవాడు. శిల్పాల మీద పరిశోధన రామకృష్ణ నాట్యాభ్యాసానికి మూలం. ప్రతిశిల్పంలోని భావాలను, లయవిన్యాసాలను, కదలికలను శ్యామ సుందరుడు వివరిస్తుంటే రామకృష్ణ ఆసక్తితో ఆలపించేవారు. ఈ శిల్పాలు సజీవులై ప్రతి మనిషిని కదిలించగలవని చెప్తూ ఉండేవారు. రామకృష్ణుడు చేత నృత్యాభ్యాసం చేయించిన వాడు శ్యామసుందరుడు. నాట్యం పట్ల మక్కువ కలిగించిన తొలి అనుభవం బాల్యంలో ఒక రోజు సాయంత్రం, చిరు గంటలు మ్రోగుతున్న వేళలో ఒక చిన్న దేవాలయంలో గజ్జెల సవ్వడి వినిపించింది. ఏమిటా అని వెళ్ళి చూసిన శ్రీ రామకృష్ణ గారికి పాలసముద్రం నుండి పుట్టినటువంట లక్ష్మీదేవి లాగా ఒక అందమైన స్త్రీ, జరి అంచుగల తెల్లని చీర, మరియు ఆభరణాలు ధరించి " నాద హరే జగన్నాధ హరే, శ్రీగతివా, రా రా” అంటూ పాడుతూ నృత్యం చేస్తూ కనిపించింది. ఆమె ముఖంలో తేజస్సు, నేత్రాల్లో భక్తిభావం, కదలికల్లో గాన వాహిని ప్రవహించినట్టు అనిపించింది. ఎప్పుడు తలుచుకున్న ఆవిడ వారి కంటి ముందు ఉన్నట్లు అనిపిస్తుంది. ఇదే వారి మొదటి అనుభవం. తాను నాట్యం నేర్చుకోవాలని భావించిన రామకృష్ణ గారు గజ్జెలు లేకపోవడంతో ఎండిపోయిన తుమ్మకాయలను తుమ్మ చెట్ల నుండి తెంపి వాటిని ముక్కలుగా విరిచి కాళ్లకి కట్టుకుని నాట్యం చేసేవారు............................

Features

  • : Natya Shikhamani Padmasri Nataraja Ramakrishna
  • : Regulla Mallikarjunrao
  • : Andhra Pradesh Prabutvam, Basha Samsrutika Shaka
  • : MANIMN4796
  • : paparback
  • : 2023
  • : 176
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Natya Shikhamani Padmasri Nataraja Ramakrishna

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam