గంధపుచెక్క తాను అరిగిపోతూ సువాసనలను వెదజల్లుతుంది! కొవ్వొత్తి తాను కరిగిపోతూ వెలుగులను విరజిమ్ముతుంది!! ప్రభాకర్ జీ సామాజిక సేవలోనే నిరంతరం అరిగిపోతూ, కరిగిపోతూ జీవితాన్ని సఫలం చేసుకున్న చరితార్థుడు!!!
కస్తూర్బా, మహాత్మాగాంధీలను మాతాపితల్లా భావించి మనసారా వారిని సేవించుకున్న ధన్యజీవి ప్రభాకర్ జీ. సేవాగ్రామ్ ఆశ్రమంలో అందరికీ తలలో నాలుకలా మెలుగుతూ, అయినవారే అసహ్యించుకొని ఇంటి నుంచి తరిమివేసిన కుష్టు రోగులను చేరదీసి, వారి పుండ్లను కడిగి మందులు రాసి సేవలు చేసిన పుణ్య పురుషుడాయన. మనసా వాచా కర్మణా గాంధీజీ సిద్ధాంతాలను ఆచరించడమే కాక, వస్త్రధారణలో సైతం గాంధీజీనీ అనుకరించి, ఎక్కడ ఉన్నా ఏ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా, నిద్రించే ముందు వార్దాలోని సేవాగ్రామ్ లో తానూ నిద్రించే ప్రదేశంలోనే పడుకుంటున్నట్లు మానసికంగా సంకల్పించుకుంటూ పడుకున్న యోగి పుంగవుడు ప్రభాకర్ జీ. ఆ మహానుభావుడి గురించి మరెన్నో విషయాలు ఈ పుస్తకం చదివి తెలుసుకోగలరు.
గంధపుచెక్క తాను అరిగిపోతూ సువాసనలను వెదజల్లుతుంది! కొవ్వొత్తి తాను కరిగిపోతూ వెలుగులను విరజిమ్ముతుంది!! ప్రభాకర్ జీ సామాజిక సేవలోనే నిరంతరం అరిగిపోతూ, కరిగిపోతూ జీవితాన్ని సఫలం చేసుకున్న చరితార్థుడు!!! కస్తూర్బా, మహాత్మాగాంధీలను మాతాపితల్లా భావించి మనసారా వారిని సేవించుకున్న ధన్యజీవి ప్రభాకర్ జీ. సేవాగ్రామ్ ఆశ్రమంలో అందరికీ తలలో నాలుకలా మెలుగుతూ, అయినవారే అసహ్యించుకొని ఇంటి నుంచి తరిమివేసిన కుష్టు రోగులను చేరదీసి, వారి పుండ్లను కడిగి మందులు రాసి సేవలు చేసిన పుణ్య పురుషుడాయన. మనసా వాచా కర్మణా గాంధీజీ సిద్ధాంతాలను ఆచరించడమే కాక, వస్త్రధారణలో సైతం గాంధీజీనీ అనుకరించి, ఎక్కడ ఉన్నా ఏ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా, నిద్రించే ముందు వార్దాలోని సేవాగ్రామ్ లో తానూ నిద్రించే ప్రదేశంలోనే పడుకుంటున్నట్లు మానసికంగా సంకల్పించుకుంటూ పడుకున్న యోగి పుంగవుడు ప్రభాకర్ జీ. ఆ మహానుభావుడి గురించి మరెన్నో విషయాలు ఈ పుస్తకం చదివి తెలుసుకోగలరు.© 2017,www.logili.com All Rights Reserved.