Bharatiya Sahitya Nirmathalu G. N. Reddy

Rs.50
Rs.50

Bharatiya Sahitya Nirmathalu G. N. Reddy
INR
MANIMN2527
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                  ఆచార్య జి.ఎన్.రెడ్డి (1927-89) జాతీయ, అంతర్జాతీయ విద్యావేత్తగా సుప్రసిద్ధుడు, నిరంతర పరిశోధకుడు, ఆదర్శపర్యవేక్షకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయనశాఖాధిపతి నుండి వైస్ ఛాన్సలర్ దాకా అన్ని పదవుల్లోను బౌద్ధిక నాయకత్వం అందించిన సుపరిపాలకుడు. తెలుగు నిఘంటువుతో తెలుగు మీడియం విద్యార్థుల, ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు, తెలుగు పర్యాయపద నిఘంటువులతో ఆంధ్రుల అభిమానం సంపాదించుకొన్న నిఘంటుకారుడు. పర్యాయపదనిఘంటువు (Thesarus) ఆధునిక భారతీయ భాషల్లోనే మొట్టమొదటిది. జి.ఎన్. రెడ్డికి తెలుగు సాహిత్య సముద్దారకుడైన సి.పి. బ్రౌన్ అంటే ఎనలేని అభిమానం. ఆయనవి ఐదు గ్రంథాలు ప్రధాన సంపాదకుడుగా ప్రచురించారు. అమెరికాలో తెలుగు విద్యార్థుల కోసం రచించిన రెండు రీడర్లు తర్వాతితరానికి మార్గదర్శకమయ్యాయి. ఆయన ఆంధ్రాంగ్ల పీఠికలు, ప్రసంగాలు, ఆణిముత్యాలుగా, అనుసరణీయాలుగా తెలుగు పాఠకుల్ని ప్రభావితం చేశాయి. 

                దాదాపు పుష్కరం పైగా (1976-1989) జి.ఎన్. రెడ్డి అంతేవాసిగా, సహచరుడుగా, ఆత్మీయుడిగా మెలగిన ఆచార్య నరసింహారెడ్డి ఈ గ్రంథ రచయిత. ఈయన విశ్రాంత తెలుగు ఆచార్యులు. అవిశ్రాంత పరిశోధకరచయిత, కవి, కథకుడు, నవలాకారుడు, పదప్రయోగ సూచికాకర్త, నిఘంటుకారుడు. తెలుగు ప్రాచీన సాహిత్యం , వ్యాకరణం, భాషమీద ఆధిపత్యం, పాతికపైగా గ్రంథాలు, వందదాకా వ్యాసాలు, పదిదాకా అవార్డులు, పాతిక పిహెచ్.డి.ల పర్యవేక్షణ, ఉత్తమ గ్రంథరచనకు రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డులు, పరిశోధనచతురానన, నిశ్శబ్దపరిశోధకుడుగా విమర్శకులమన్ననలు, సప్తతివర్షప్రాయం ఈయన సొంతం.

                  ఆచార్య జి.ఎన్.రెడ్డి (1927-89) జాతీయ, అంతర్జాతీయ విద్యావేత్తగా సుప్రసిద్ధుడు, నిరంతర పరిశోధకుడు, ఆదర్శపర్యవేక్షకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయనశాఖాధిపతి నుండి వైస్ ఛాన్సలర్ దాకా అన్ని పదవుల్లోను బౌద్ధిక నాయకత్వం అందించిన సుపరిపాలకుడు. తెలుగు నిఘంటువుతో తెలుగు మీడియం విద్యార్థుల, ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు, తెలుగు పర్యాయపద నిఘంటువులతో ఆంధ్రుల అభిమానం సంపాదించుకొన్న నిఘంటుకారుడు. పర్యాయపదనిఘంటువు (Thesarus) ఆధునిక భారతీయ భాషల్లోనే మొట్టమొదటిది. జి.ఎన్. రెడ్డికి తెలుగు సాహిత్య సముద్దారకుడైన సి.పి. బ్రౌన్ అంటే ఎనలేని అభిమానం. ఆయనవి ఐదు గ్రంథాలు ప్రధాన సంపాదకుడుగా ప్రచురించారు. అమెరికాలో తెలుగు విద్యార్థుల కోసం రచించిన రెండు రీడర్లు తర్వాతితరానికి మార్గదర్శకమయ్యాయి. ఆయన ఆంధ్రాంగ్ల పీఠికలు, ప్రసంగాలు, ఆణిముత్యాలుగా, అనుసరణీయాలుగా తెలుగు పాఠకుల్ని ప్రభావితం చేశాయి.                  దాదాపు పుష్కరం పైగా (1976-1989) జి.ఎన్. రెడ్డి అంతేవాసిగా, సహచరుడుగా, ఆత్మీయుడిగా మెలగిన ఆచార్య నరసింహారెడ్డి ఈ గ్రంథ రచయిత. ఈయన విశ్రాంత తెలుగు ఆచార్యులు. అవిశ్రాంత పరిశోధకరచయిత, కవి, కథకుడు, నవలాకారుడు, పదప్రయోగ సూచికాకర్త, నిఘంటుకారుడు. తెలుగు ప్రాచీన సాహిత్యం , వ్యాకరణం, భాషమీద ఆధిపత్యం, పాతికపైగా గ్రంథాలు, వందదాకా వ్యాసాలు, పదిదాకా అవార్డులు, పాతిక పిహెచ్.డి.ల పర్యవేక్షణ, ఉత్తమ గ్రంథరచనకు రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డులు, పరిశోధనచతురానన, నిశ్శబ్దపరిశోధకుడుగా విమర్శకులమన్ననలు, సప్తతివర్షప్రాయం ఈయన సొంతం.

Features

  • : Bharatiya Sahitya Nirmathalu G. N. Reddy
  • : Papireddy Narasimhareddy
  • : Sahitya Akademy
  • : MANIMN2527
  • : Paperback
  • : 2021
  • : 124
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bharatiya Sahitya Nirmathalu G. N. Reddy

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam