Sutta Pitaka Samyuktanikaya 1st part Sagaadhavagga

By Bikshu Darmarakshita (Author)
Rs.600
Rs.600

Sutta Pitaka Samyuktanikaya 1st part Sagaadhavagga
INR
MANIMN3679
In Stock
600.0
Rs.600


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స!

సంయుక్తనికాయ

సగాథ' వర్గం
1 దేవతా సంయుక్తం

1. రెల్లు వర్గం

1. వరదను దాటటం

1. నేనిలా విన్నాను - ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో అనాథపిండికుని జేతవన ఆరామంలో ఉంటున్నాడు. అప్పుడు రాత్రి చాలా గడిచాక, ఒకానొక దేవత సుందరమైన తన దేహకాంతితో జేతవనాన్నంతా ప్రకాశింపజేస్తూ, భగవానుని సమీపించాడు. సమీపించి భగవానునకు నమస్కరించి ఒక ప్రక్కగా నిలబడ్డాడు. ఒకప్రక్కగా నిలబడిన ఆ దేవత భగవానునితో - "మారిస (= అయ్యా), మీరు వరదను ఎలా దాటారు?” అన్నాడు - "ఆయుష్మాన్! ఎక్కడా ఆగకుండ, పరిశ్రమించకుండా నేను వరదను దాటాను." "మారిస! మీరు ఆగకుండ, పరిశ్రమించకుండా వరదను ఎలా దాటారు?" "ఆయుష్మాన్! నేను ఆగినప్పుడు మునిగిపోయాను. ప్రయత్నించినప్పుడు కొట్టుకు పోయాను. ఈ విధంగా నేను ఆగకుండా, ప్రయత్నించకుండా (= అంటే మధ్యమమార్గం ద్వారా) ప్రవాహాన్ని దాటాను. "

(దేవత)

“ఆగకుండా, ప్రయత్నించకుండా లౌకిక ఆసక్తిని తరించి,
పరినివృతుడైన బ్రాహ్మణు (అర్హతు) ని ఎట్టకేలకు చూస్తున్నాను. " |

దేవత ఇలా చెప్పగా శాస్త్ర దానిని ఆమోదించాడు. అంతట దేవత, శాస్త్ర నన్ను ఆమోదించాడు' అనుకొంటూ, భగవానునకు నమస్కరించి, ప్రదక్షిణం చేసి, అక్కడే, అప్పుడే అంతర్ధానమయ్యాడు. ...........

నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స!సంయుక్తనికాయ సగాథ' వర్గం1 దేవతా సంయుక్తం 1. రెల్లు వర్గం 1. వరదను దాటటం 1. నేనిలా విన్నాను - ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో అనాథపిండికుని జేతవన ఆరామంలో ఉంటున్నాడు. అప్పుడు రాత్రి చాలా గడిచాక, ఒకానొక దేవత సుందరమైన తన దేహకాంతితో జేతవనాన్నంతా ప్రకాశింపజేస్తూ, భగవానుని సమీపించాడు. సమీపించి భగవానునకు నమస్కరించి ఒక ప్రక్కగా నిలబడ్డాడు. ఒకప్రక్కగా నిలబడిన ఆ దేవత భగవానునితో - "మారిస (= అయ్యా), మీరు వరదను ఎలా దాటారు?” అన్నాడు - "ఆయుష్మాన్! ఎక్కడా ఆగకుండ, పరిశ్రమించకుండా నేను వరదను దాటాను." "మారిస! మీరు ఆగకుండ, పరిశ్రమించకుండా వరదను ఎలా దాటారు?" "ఆయుష్మాన్! నేను ఆగినప్పుడు మునిగిపోయాను. ప్రయత్నించినప్పుడు కొట్టుకు పోయాను. ఈ విధంగా నేను ఆగకుండా, ప్రయత్నించకుండా (= అంటే మధ్యమమార్గం ద్వారా) ప్రవాహాన్ని దాటాను. " (దేవత)“ఆగకుండా, ప్రయత్నించకుండా లౌకిక ఆసక్తిని తరించి, పరినివృతుడైన బ్రాహ్మణు (అర్హతు) ని ఎట్టకేలకు చూస్తున్నాను. " | దేవత ఇలా చెప్పగా శాస్త్ర దానిని ఆమోదించాడు. అంతట దేవత, శాస్త్ర నన్ను ఆమోదించాడు' అనుకొంటూ, భగవానునకు నమస్కరించి, ప్రదక్షిణం చేసి, అక్కడే, అప్పుడే అంతర్ధానమయ్యాడు. ...........

Features

  • : Sutta Pitaka Samyuktanikaya 1st part Sagaadhavagga
  • : Bikshu Darmarakshita
  • : Mahabhodi Buddha vihara Hyd
  • : MANIMN3679
  • : Hard binding
  • : Oct, 2021
  • : 507
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sutta Pitaka Samyuktanikaya 1st part Sagaadhavagga

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam