Vivrutha

By Kakumani Srinivasarao (Author)
Rs.150
Rs.150

Vivrutha
INR
MANIMN4895
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

కథ చెప్పడం రాదా? - కథ 2009

కథ చెప్పటం మనిషికిష్టమయిన అభిలాషల్లో ఒకటి. కథ అనే సంస్కృత ధాతువుకు 'చెప్పటం' అని అర్థం. అయితే తర్వాత 'రాయటం' మొదలైంది. పాతతరంలో "కథ కంటికోసం కాదు, కర్ణము కోసం" అని చెప్పిన (తల్లావఝుల శివశంకరశాస్త్రి, 1939, భారతి) మౌఖిక కథావాదులున్నారు. అనంతరం కథ కొత్త ప్రయోగాల బాట పట్టి విస్తృతంగా రాయబడుతూ ఉంది. రాసినంతకాలం ఇతర సాహిత్య ప్రక్రియల్లో కాలం వెళ్ళబుచ్చిన రచయితలు కూడా ఒకటో రెండో కథలు రాయకుండా ఉండలేకపోయారు. కథను చెప్పటంలో ఉండే మానవ ప్రోత్సాహం అలాంటిది. మనిషికి తన భావాల్ని పంచుకోటానికి చెప్పుకోవటమొక్కటే మార్గం. ఈ చెప్పటం కళాత్మకంగా సాగితే అది కథ అవుతుంది. ఇక్కడ కళ అంటే ఆస్వాదనీయత. ఈ స్వాదుత్వంతో పాటు కథ క్లుప్తత, సరళత, జీవన సంఘర్షణ, జీవన తాత్వికత, సత్యాన్వేషణ వంటి ఎన్ని లక్షణాలనైనా కలిగి ఉండొచ్చు. కాని దానికుండాల్సిన మొదటి లక్షణం చెప్పబడినట్లు సాగటం. అయితే కళలకు నియతి లిఖించటం వ్యర్థ ప్రయత్నం అవుతుంది. నియతిని ఉల్లంఘించి ఉత్తమ కళాసృష్టిని కళాకారుడు చేయగలడు. కానీ కొన్ని మౌలికాంశాలు విస్మరించరానివి.

ప్రత్యక్ష, పరోక్ష, అదృశ్య, ప్రతీకాత్మక, నైరూప్య పద్ధతులెన్నిటితోనైనా కొనసాగవచ్చేమో కాని కథ పాఠకుడితో చెబుతున్నట్లు సాగాలి. ఒక్కోసారి కథలో చెప్పకుండా దాచిన అంశంతోనే రచయిత సౌందర్యాన్ని సాధించే సందర్భం కూడా ఉండవచ్చు. అది రచయిత ప్రతిభకు పరీక్ష

మామూలు దైనందిన భాషణంలో ఉండే స్థాలిత్యాలు కథ చెప్పటంలో లేకుండా చూసుకోవటంలో ఇటీవలి రచయితలు జాగ్రత్త వహించటం లేదు.............

కథ చెప్పడం రాదా? - కథ 2009 కథ చెప్పటం మనిషికిష్టమయిన అభిలాషల్లో ఒకటి. కథ అనే సంస్కృత ధాతువుకు 'చెప్పటం' అని అర్థం. అయితే తర్వాత 'రాయటం' మొదలైంది. పాతతరంలో "కథ కంటికోసం కాదు, కర్ణము కోసం" అని చెప్పిన (తల్లావఝుల శివశంకరశాస్త్రి, 1939, భారతి) మౌఖిక కథావాదులున్నారు. అనంతరం కథ కొత్త ప్రయోగాల బాట పట్టి విస్తృతంగా రాయబడుతూ ఉంది. రాసినంతకాలం ఇతర సాహిత్య ప్రక్రియల్లో కాలం వెళ్ళబుచ్చిన రచయితలు కూడా ఒకటో రెండో కథలు రాయకుండా ఉండలేకపోయారు. కథను చెప్పటంలో ఉండే మానవ ప్రోత్సాహం అలాంటిది. మనిషికి తన భావాల్ని పంచుకోటానికి చెప్పుకోవటమొక్కటే మార్గం. ఈ చెప్పటం కళాత్మకంగా సాగితే అది కథ అవుతుంది. ఇక్కడ కళ అంటే ఆస్వాదనీయత. ఈ స్వాదుత్వంతో పాటు కథ క్లుప్తత, సరళత, జీవన సంఘర్షణ, జీవన తాత్వికత, సత్యాన్వేషణ వంటి ఎన్ని లక్షణాలనైనా కలిగి ఉండొచ్చు. కాని దానికుండాల్సిన మొదటి లక్షణం చెప్పబడినట్లు సాగటం. అయితే కళలకు నియతి లిఖించటం వ్యర్థ ప్రయత్నం అవుతుంది. నియతిని ఉల్లంఘించి ఉత్తమ కళాసృష్టిని కళాకారుడు చేయగలడు. కానీ కొన్ని మౌలికాంశాలు విస్మరించరానివి. ప్రత్యక్ష, పరోక్ష, అదృశ్య, ప్రతీకాత్మక, నైరూప్య పద్ధతులెన్నిటితోనైనా కొనసాగవచ్చేమో కాని కథ పాఠకుడితో చెబుతున్నట్లు సాగాలి. ఒక్కోసారి కథలో చెప్పకుండా దాచిన అంశంతోనే రచయిత సౌందర్యాన్ని సాధించే సందర్భం కూడా ఉండవచ్చు. అది రచయిత ప్రతిభకు పరీక్ష మామూలు దైనందిన భాషణంలో ఉండే స్థాలిత్యాలు కథ చెప్పటంలో లేకుండా చూసుకోవటంలో ఇటీవలి రచయితలు జాగ్రత్త వహించటం లేదు.............

Features

  • : Vivrutha
  • : Kakumani Srinivasarao
  • : Vishalandra Publishing Housing
  • : MANIMN4895
  • : paparback
  • : Oct, 2023
  • : 152
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vivrutha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam