Gandham YagnavalkyaSarma Kathalu

Rs.175
Rs.175

Gandham YagnavalkyaSarma Kathalu
INR
EMESCO0666
In Stock
175.0
Rs.175


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

        కథ లైఫ్ నుండే రావాలని ఈ రచయిత అభిప్రాయం. ఇదే మాట 'కథ - ముగింపు'లో 'సత్య' పాత్రతో చెప్పించారు. కథకు ముగింపు దొరికితే.... సరైన సమస్యకు పరిష్కారం దొరికినట్లేమో అని అదే కథలో సుభద్ర పాత్ర ద్వారా స్పష్టం చేశారు. సమాజం పట్ల పూర్తి అవగాహన , గ్రామీణ వాతావరణంలోని స్వచ్ఛత, నిజాయితీ గుండె నిండా నింపుకున్న స్వేచ్చాపిపాసి ఈ రచయిత. మట్టివాసనకు... పంటపొలాలనుండి వచ్చే పైరగాలికి పరవశించిన ప్రకృతి ప్రియుడు. అందుకే ఈ కథల్లో గ్రామీణ నేపధ్యం ఉన్నవన్నీ సజీవ కళతో, శాశ్వత విలువలతో ప్రకాశిస్తూ పాఠకుల్ని ఇట్టే ఆకర్షిస్తాయి.   

       ఈ కథా సంపుటిలో మహోన్నత త్యాగమూర్తుల, ఉత్తమ సంస్కార వంతులైన ఆదర్శమహిళామణులు కొందరు సమాజానికి దిశానిర్దేశం చేస్తూ... పాఠకుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తారు. అలా౦టి కథలు మహిళల పట్ల ఆరాధన భావాన్ని కలిగిస్తాయి. 'నాతిచరామి' కథలో అహల్య గొప్పదా? సర్వమంగళ గొప్పదా? పాఠకుల ఒపీనియన్ పోల్ పెట్టాల్సిందే. ఈ కథ ఏదో చెప్పలేనంత ఆనందోద్వేగాన్ని కలిగించే మాట నిజం. ఈ కథల్లో మానవత్వానికి ప్రతీకగా ప్రకాశించే మరొక మంచి కథ 'గాయం'. ఇక్కడ గాయపడింది అమ్మమనసు. అలాగే 'దొంగలు' కథలో డెబ్బయి ఐదేళ్ళ జయమ్మత్తయ్య 'ఒక ఆదర్శ మహిళ, సనాతన ఆధునాతన భావాలవారధి నీతినియమాల మాలిక. అనుభవాలఖని, దయ, ధర్మం, కరుణల త్రివేణి. ఆకలి తీర్చుకోవడానికి మిగిలిన అన్నంగిన్నెను తీసుకెళ్ళే పిల్లవాడు దొంగ కాదని ఈ సమాజాన్ని పీడించే అసలు దొంగలు దర్జాగా విమానాల్లో, రైళ్ళలో, కార్లలో ఎ.సి. కూపీలల్లో తిరుగుతున్నారని ఆమె చేసిన గొప్ప ప్రసంగం పాఠకులు మెచ్చుకోక తప్పదు.

       పాఠకులు ఏకబిగిన ఏంతో ఆసక్తిగా చదివే కథ 'లాలస', లాలస ఏదో ఒక సందర్భంలో గుర్తుకు రాక తప్పదు సుమా! ఈ కథ చదివిన పాఠకులు.... ప్రతి యువతి లాలసలా వివేకవంతంగా, ప్రాక్టికల్ గా, స్థిరంగా ఆలోచించగలిగితే ఎన్నో సమస్యలు వాటంతటవే సులభంగా పరిష్కారమవుతాయనుకోక తప్పదేమో!!   ఈ సంపుటిలో ఏ కథను చదవకపోయినా, మనం కొంత మిస్ అయినట్టే!

       ఈ కథలు సమాజంలోని అస్తవ్యస్త పరిస్థితులపై సంధించిన రణన్నినాదాలు! మామూలు మాటల్లో మహామంత్రాన్ని ఉపదేశి౦చే అక్షర తూరీణాలు! జీవిత సత్యాలను మనసులోకి ప్రవహింపజేసే సందేశ చంద్రికలు!

       ఆసాంతం చదివి ఆలోచించండి!  ఆనందించండి!  ఆ అనుభూతిని గుండెనిండా ని౦పుకోండని పాఠకుల్ని కోరుతున్నాను.

                                                                                                                                    - మడకా సత్యనారాయణ

        కథ లైఫ్ నుండే రావాలని ఈ రచయిత అభిప్రాయం. ఇదే మాట 'కథ - ముగింపు'లో 'సత్య' పాత్రతో చెప్పించారు. కథకు ముగింపు దొరికితే.... సరైన సమస్యకు పరిష్కారం దొరికినట్లేమో అని అదే కథలో సుభద్ర పాత్ర ద్వారా స్పష్టం చేశారు. సమాజం పట్ల పూర్తి అవగాహన , గ్రామీణ వాతావరణంలోని స్వచ్ఛత, నిజాయితీ గుండె నిండా నింపుకున్న స్వేచ్చాపిపాసి ఈ రచయిత. మట్టివాసనకు... పంటపొలాలనుండి వచ్చే పైరగాలికి పరవశించిన ప్రకృతి ప్రియుడు. అందుకే ఈ కథల్లో గ్రామీణ నేపధ్యం ఉన్నవన్నీ సజీవ కళతో, శాశ్వత విలువలతో ప్రకాశిస్తూ పాఠకుల్ని ఇట్టే ఆకర్షిస్తాయి.           ఈ కథా సంపుటిలో మహోన్నత త్యాగమూర్తుల, ఉత్తమ సంస్కార వంతులైన ఆదర్శమహిళామణులు కొందరు సమాజానికి దిశానిర్దేశం చేస్తూ... పాఠకుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తారు. అలా౦టి కథలు మహిళల పట్ల ఆరాధన భావాన్ని కలిగిస్తాయి. 'నాతిచరామి' కథలో అహల్య గొప్పదా? సర్వమంగళ గొప్పదా? పాఠకుల ఒపీనియన్ పోల్ పెట్టాల్సిందే. ఈ కథ ఏదో చెప్పలేనంత ఆనందోద్వేగాన్ని కలిగించే మాట నిజం. ఈ కథల్లో మానవత్వానికి ప్రతీకగా ప్రకాశించే మరొక మంచి కథ 'గాయం'. ఇక్కడ గాయపడింది అమ్మమనసు. అలాగే 'దొంగలు' కథలో డెబ్బయి ఐదేళ్ళ జయమ్మత్తయ్య 'ఒక ఆదర్శ మహిళ, సనాతన ఆధునాతన భావాలవారధి నీతినియమాల మాలిక. అనుభవాలఖని, దయ, ధర్మం, కరుణల త్రివేణి. ఆకలి తీర్చుకోవడానికి మిగిలిన అన్నంగిన్నెను తీసుకెళ్ళే పిల్లవాడు దొంగ కాదని ఈ సమాజాన్ని పీడించే అసలు దొంగలు దర్జాగా విమానాల్లో, రైళ్ళలో, కార్లలో ఎ.సి. కూపీలల్లో తిరుగుతున్నారని ఆమె చేసిన గొప్ప ప్రసంగం పాఠకులు మెచ్చుకోక తప్పదు.        పాఠకులు ఏకబిగిన ఏంతో ఆసక్తిగా చదివే కథ 'లాలస', లాలస ఏదో ఒక సందర్భంలో గుర్తుకు రాక తప్పదు సుమా! ఈ కథ చదివిన పాఠకులు.... ప్రతి యువతి లాలసలా వివేకవంతంగా, ప్రాక్టికల్ గా, స్థిరంగా ఆలోచించగలిగితే ఎన్నో సమస్యలు వాటంతటవే సులభంగా పరిష్కారమవుతాయనుకోక తప్పదేమో!!   ఈ సంపుటిలో ఏ కథను చదవకపోయినా, మనం కొంత మిస్ అయినట్టే!        ఈ కథలు సమాజంలోని అస్తవ్యస్త పరిస్థితులపై సంధించిన రణన్నినాదాలు! మామూలు మాటల్లో మహామంత్రాన్ని ఉపదేశి౦చే అక్షర తూరీణాలు! జీవిత సత్యాలను మనసులోకి ప్రవహింపజేసే సందేశ చంద్రికలు!        ఆసాంతం చదివి ఆలోచించండి!  ఆనందించండి!  ఆ అనుభూతిని గుండెనిండా ని౦పుకోండని పాఠకుల్ని కోరుతున్నాను.                                                                                                                                     - మడకా సత్యనారాయణ

Features

  • : Gandham YagnavalkyaSarma Kathalu
  • : Gandham Yagnavalkya Sarma
  • : Spoorthi publishing House
  • : EMESCO0666
  • : Paperback
  • : 2014
  • : 230
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gandham YagnavalkyaSarma Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam