Click Win

By Shakhamuri Srinivas (Author)
Rs.45
Rs.45

Click Win
INR
MANIMN5039
In Stock
45.0
Rs.45


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

అది నల్లమల అరణ్యాన్ని ఆనుకుని ఉన్న చింతపల్లి గ్రామం. ఆనుకుని ఉండడంకాదు, అరణ్యంలోనే ఆ ఊరు ఉందని చెప్పవచ్చు. ఒకప్పుడు ఊరి చుట్టూ, ఊరిలోనూ చెట్లే చెట్లు! జనాభా పెరిగే కొద్దీ చెట్ల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం ఆ అరణ్యాన్ని 'రక్షిత అడవి'గా ప్రభుత్వం ప్రకటించడంతో అడవి నరికివేత ఆగిపోయింది.

చింతపల్లిలో రెండువేల జనాభా, ఐదారు వందల ఇళ్లు ఉంటాయి. ఊరు చిన్నదైనా దాదాపుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి.

అక్కడ దొరకని వస్తువులను ప్రజలు దగ్గరలోని రంగనగరం వెళ్లి తెచ్చుకుంటారు. రంగనగరం చిన్న పట్టణం. ఊరి శివారులో, అడవికి వెళ్లే మార్గం దగ్గర రెండు పురాతన బంగళాలు ఉన్నాయి.

అవి ఇప్పటి కట్టడాల లాంటివి కావు. బ్రిటిష్ వారు భారత దేశాన్ని పాలించే సమయంలో అటవీ అధికారుల కోసం కట్టించినవి. కట్టుబడి సున్నం, దీర్ఘ ఘనపు రాళ్లతో కట్టిన గోడలు, టేకు చెక్కలు, పెంకులతో కప్పు ఉంటాయి. ఇప్పుడవి వాడుకలో లేవు. కానీ వాటి రూపం చెక్కు చెదరలేదు.

వాటి చుట్టూ చెట్లు, తీగలు అల్లుకుని ఉండడంతో, పగలు కూడా అక్కడ చీకటిగా ఉంటుంది. సాధారణంగా అటువైపు అడుగు వెయ్యాలంటే పెద్దవాళ్లకే గుండె దడదడలాడుతుంది.

ఇక పిల్లల సంగతి చెప్పేదేముంది! కొందరైతే అటువైపు వెళ్లేటప్పుడు, బంగళాలు తమ కంటపడకుండా చేతులు అడ్డుపెట్టుకుని వెళతారు కూడా! ఇక రాత్రిళ్లు అటువైపు వెళ్లేందుకు ఎవరూ సాహసం చేయరు.

అందరూ కలిసి వాటికి 'దెయ్యాల బంగళాలు' అనే పేరు పెట్టారు. రంగగరం నుంచి వచ్చే అటవీ అధికారులు కూడా వాటిని ఆ పేరుతోనే పిలుస్తుంటారు. అయితే దెయ్యాల బంగళాలు అంటే భయం లేని వాళ్లు కూడా...............

అది నల్లమల అరణ్యాన్ని ఆనుకుని ఉన్న చింతపల్లి గ్రామం. ఆనుకుని ఉండడంకాదు, అరణ్యంలోనే ఆ ఊరు ఉందని చెప్పవచ్చు. ఒకప్పుడు ఊరి చుట్టూ, ఊరిలోనూ చెట్లే చెట్లు! జనాభా పెరిగే కొద్దీ చెట్ల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం ఆ అరణ్యాన్ని 'రక్షిత అడవి'గా ప్రభుత్వం ప్రకటించడంతో అడవి నరికివేత ఆగిపోయింది. చింతపల్లిలో రెండువేల జనాభా, ఐదారు వందల ఇళ్లు ఉంటాయి. ఊరు చిన్నదైనా దాదాపుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ దొరకని వస్తువులను ప్రజలు దగ్గరలోని రంగనగరం వెళ్లి తెచ్చుకుంటారు. రంగనగరం చిన్న పట్టణం. ఊరి శివారులో, అడవికి వెళ్లే మార్గం దగ్గర రెండు పురాతన బంగళాలు ఉన్నాయి. అవి ఇప్పటి కట్టడాల లాంటివి కావు. బ్రిటిష్ వారు భారత దేశాన్ని పాలించే సమయంలో అటవీ అధికారుల కోసం కట్టించినవి. కట్టుబడి సున్నం, దీర్ఘ ఘనపు రాళ్లతో కట్టిన గోడలు, టేకు చెక్కలు, పెంకులతో కప్పు ఉంటాయి. ఇప్పుడవి వాడుకలో లేవు. కానీ వాటి రూపం చెక్కు చెదరలేదు. వాటి చుట్టూ చెట్లు, తీగలు అల్లుకుని ఉండడంతో, పగలు కూడా అక్కడ చీకటిగా ఉంటుంది. సాధారణంగా అటువైపు అడుగు వెయ్యాలంటే పెద్దవాళ్లకే గుండె దడదడలాడుతుంది. ఇక పిల్లల సంగతి చెప్పేదేముంది! కొందరైతే అటువైపు వెళ్లేటప్పుడు, బంగళాలు తమ కంటపడకుండా చేతులు అడ్డుపెట్టుకుని వెళతారు కూడా! ఇక రాత్రిళ్లు అటువైపు వెళ్లేందుకు ఎవరూ సాహసం చేయరు. అందరూ కలిసి వాటికి 'దెయ్యాల బంగళాలు' అనే పేరు పెట్టారు. రంగగరం నుంచి వచ్చే అటవీ అధికారులు కూడా వాటిని ఆ పేరుతోనే పిలుస్తుంటారు. అయితే దెయ్యాల బంగళాలు అంటే భయం లేని వాళ్లు కూడా...............

Features

  • : Click Win
  • : Shakhamuri Srinivas
  • : Manchi Pustakam Publications
  • : MANIMN5039
  • : paparback
  • : Oct, 2021
  • : 64
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Click Win

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam