Mainteen

By Ganga Srinivas (Author)
Rs.100
Rs.100

Mainteen
INR
JPPUBLT126
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

              పురుషులందరు పుణ్య పురుషులు వేరు అన్నట్టుగానే పుస్తకాల్లో మంచి పుస్తకాలు వేరు. ఈ మంచి పుస్తకాలు మనల్ని ఆలోచింపచేస్తాయి. మనుషుల్ని చేస్తాయి. విజేతల్ని చేస్తాయి. బలవంతంగా ఏర్పడిన బంధువుల్లాంటి క్లాసు పుస్తకాలు కానివి. స్వేచ్చగా ఎన్నుకునే స్నేహితుల్లాంటి పుస్తాకాలివి! ఇలాంటి పుస్తకాల్ని కొందరే రాయగలరు. ఆ కొందరిలో గంగ శ్రీనివాస్ ఒకరు.

             ఇటివల వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి పుంఖానుపుంఖంగా పుస్తకాలు వస్తున్నాయి. అయితే అవన్నీ అనువాదాలే! వ్యక్తిత్వం, వికాసం అంతా పాశ్చాత్య దేశాలకే పరిమితం అన్నట్టుగా అక్కడివారు రాసిన పుస్తకాలనే అనువదిస్తూ అందిస్తూ వస్తున్నారంతా. ఆ అనువాదాలకు భిన్నంగా మనదయిన వ్యక్తిత్వాన్నీ, వికాసాన్నీ తన పుస్తకంలో అందించారు గంగ శ్రీనివాస్. కౌమార దశలోని పిల్లలు ఎలా ఉంటారు?? వారితో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి? వారి ఎదుగుదలకి ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలి లాంటి చాలా విషయాలు మెయిన్ టీన్ లో విపులంగా విస్తృతంగా చర్చించారు ఈ రచయిత. శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో, మనిషికీ మనసుకీ చదువు అంత అవసరం. చదవడాన్ని అలవాటు చేసుకోగలిగేవారు, ఈ పుస్తకంలో ప్రారంభించడం మంచిది.

           ఇరవై ఆరు వారాల పాటు ధారావాహికగా నవ్య విక్లిలో ప్రచురితమయిన 'మెయిన్ టీన్' ను పాఠకులు విశేషంగా ఆదరించారు. చదివి తమలోని తప్పొప్పులను సరిదిద్దుకున్నామంటూ అనేకమంది ఉత్తరాలు రాశారు. వ్యక్తిత్వ వికాసాలు కావివి. మంచి కధలని కితాబులిచ్చారు. గంగ శ్రీనివాస్ కధారచయిత. కధనం బాగా తెలిసినవారు. ఆ విద్యను ఈ వ్యాస రచనలో అత్యద్భుతంగా చూపించి 'శభాష్' అనిపించారు. "మెయిన్ టీన్" పుస్తకం వ్యక్తిత్వ వికాసానికి అన్నివిధాలా ఉపయోగపడుతుంది. నాకు అన్నీ తెలుసు అన్న 'విజ్ఞానం'తో ఈ పుస్తకాన్ని చదవొద్దు. నాకేమి తెలియదన్న 'వివేకం'తో ఈ పుస్తకాన్ని చదవండి. అన్నివిధాలా ఉపయోగపడుతుంది.

- గంగ శ్రీనివాస్ 

              పురుషులందరు పుణ్య పురుషులు వేరు అన్నట్టుగానే పుస్తకాల్లో మంచి పుస్తకాలు వేరు. ఈ మంచి పుస్తకాలు మనల్ని ఆలోచింపచేస్తాయి. మనుషుల్ని చేస్తాయి. విజేతల్ని చేస్తాయి. బలవంతంగా ఏర్పడిన బంధువుల్లాంటి క్లాసు పుస్తకాలు కానివి. స్వేచ్చగా ఎన్నుకునే స్నేహితుల్లాంటి పుస్తాకాలివి! ఇలాంటి పుస్తకాల్ని కొందరే రాయగలరు. ఆ కొందరిలో గంగ శ్రీనివాస్ ఒకరు.              ఇటివల వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి పుంఖానుపుంఖంగా పుస్తకాలు వస్తున్నాయి. అయితే అవన్నీ అనువాదాలే! వ్యక్తిత్వం, వికాసం అంతా పాశ్చాత్య దేశాలకే పరిమితం అన్నట్టుగా అక్కడివారు రాసిన పుస్తకాలనే అనువదిస్తూ అందిస్తూ వస్తున్నారంతా. ఆ అనువాదాలకు భిన్నంగా మనదయిన వ్యక్తిత్వాన్నీ, వికాసాన్నీ తన పుస్తకంలో అందించారు గంగ శ్రీనివాస్. కౌమార దశలోని పిల్లలు ఎలా ఉంటారు?? వారితో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి? వారి ఎదుగుదలకి ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలి లాంటి చాలా విషయాలు మెయిన్ టీన్ లో విపులంగా విస్తృతంగా చర్చించారు ఈ రచయిత. శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో, మనిషికీ మనసుకీ చదువు అంత అవసరం. చదవడాన్ని అలవాటు చేసుకోగలిగేవారు, ఈ పుస్తకంలో ప్రారంభించడం మంచిది.            ఇరవై ఆరు వారాల పాటు ధారావాహికగా నవ్య విక్లిలో ప్రచురితమయిన 'మెయిన్ టీన్' ను పాఠకులు విశేషంగా ఆదరించారు. చదివి తమలోని తప్పొప్పులను సరిదిద్దుకున్నామంటూ అనేకమంది ఉత్తరాలు రాశారు. వ్యక్తిత్వ వికాసాలు కావివి. మంచి కధలని కితాబులిచ్చారు. గంగ శ్రీనివాస్ కధారచయిత. కధనం బాగా తెలిసినవారు. ఆ విద్యను ఈ వ్యాస రచనలో అత్యద్భుతంగా చూపించి 'శభాష్' అనిపించారు. "మెయిన్ టీన్" పుస్తకం వ్యక్తిత్వ వికాసానికి అన్నివిధాలా ఉపయోగపడుతుంది. నాకు అన్నీ తెలుసు అన్న 'విజ్ఞానం'తో ఈ పుస్తకాన్ని చదవొద్దు. నాకేమి తెలియదన్న 'వివేకం'తో ఈ పుస్తకాన్ని చదవండి. అన్నివిధాలా ఉపయోగపడుతుంది. - గంగ శ్రీనివాస్ 

Features

  • : Mainteen
  • : Ganga Srinivas
  • : J P Publications
  • : JPPUBLT126
  • : Paperback
  • : January 2014
  • : 214
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mainteen

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam