Asurudu

By Anand Neelakantans (Author), Santha Sundari (Author)
Rs.450
Rs.450

Asurudu
INR
MANJUL0217
In Stock
450.0
Rs.450


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

జయ పరాజయాల పురాణ గాధ

               రామాయణ కధని ఇంతవరకూ లెక్కలేనన్ని సార్లు చెప్పటం జరిగింది. ఇది భగవంతుడి అవతారం అయిన రాముడి ఆసక్తికరమైన కధ. దుష్ట రాక్షసుడు రావణుడిని అతను సంహరిస్తాడు. ఇది ప్రతి భారతీయుడికీ సుపరిచితమే. చరిత్ర పుటలలో కూడా ఎప్పుడూ కధనం విజేతల పక్షానే ఉంటూ వస్తోంది. పరాజితుల గొంతు మౌనంగా ఉండి ఎవరికీ వినిపించదు. ఒకవేళ రావణుడూ, అతని ప్రజలూ ఈ కధని వేరేవిధంగా చెప్పాలనుకుంటే ఏమవుతుంది ?

                రావణాయణ కధని ఎప్పుడూ ఎవరూ చెప్పలేదు.

               'అసరుడు' పరాజితులైన అసురుల గాధ. 3000 సంవత్సరాలుగా వెలివేయబడ్డ పిడితులు ఎంతో ప్రేమగా కాపాడుకుంటూ వస్తున్న కధ ఇది. ఇంతవరకూ ఈ కధ చెప్పే సాహసం ఏ అసురుడూ చెయ్యలేదు. బహుశా పరాజితులైన వారూ, మరణించిన వారూ కధ చెప్పే సమయం ఆసన్నమైందేమో.

         "కొన్ని వేల సంవత్సరాల వరకూ నన్ను ఒక దుర్మార్గుడిగా, ప్రతినాయకుడిలా చిత్రిస్తూ వచ్చారు. భారతదేశమంతటా నా మరణాన్ని పండగలా జరుపుకుంటారు. ఎందుకు? నా కుమార్తెకోసం దేవతలని ఎదిరించాననా? కులవ్యవస్థమీద ఆధారపడిన దేవతల పరిపాలన నా ప్రజలని కాడిలా అణచివెయ్యకుండా వారిని కాపాడాననా? మీరు విజేత కధ రామాయణం విన్నారు. నా కధ రావణాయణం కూడా వినండి. నా పేరు రావణుడు, నేను అసురుడిని, నాది పరాజితుడి కధ."

              "నేను ఉనికిలేని వాడిని - కళ్ళకి కనిపించను, అశక్తుడిని, లెక్కలోకి రానివాడిని, ఎన్నడూ, ఎవరూ నా గురించి ఎటువంటి గాధలూ రాయరు. నేను రావణుడి చేతిలోనూ, రాముడి చేతిలోనూ బాధలు అనుభవించాను - ఒకరు నాయకుడు, మరొకరు ప్రతినాయకుడు. ఆ పాత్రలని అటూ ఇటూ మార్చుకోవటం కూడా సాధ్యమే. గొప్ప వ్యక్తుల కధలు చెప్పేటప్పుడు, నా గొంతు మరీ బలహీనంగా ఉండి ఎవరికీ వినిపించకపోవచ్చు. అయినా ఒక్క క్షణం నాకోసం వెచ్చించి నా కధ కూడా వినండి. నా పేరు భద్రుడు, అసురుజాతి నాది, నాది ఓటమికీ గురైన వాడి కధ."

              ప్రాచీనకాలం నాటి అసుర సామ్రాజ్యం విచ్చిన్నమై పోయింది. ఎన్నో చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి దేవతల పాదాలకింద నలిగిపోసాగింది. అసహాయ స్థితిలో అసురులు తమ రక్షకుడూ, యువకుడూ అయిన రావణుడిని ఆశ్రయించారు. రావణుడి నియంతృత్వంలో తమకి మెరుగైన భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో భద్రుడిలాంటి సామాన్య జనం ఆ యువనాయకుడిని అనుసరించాలని అనుకున్నారు. దృఢ నిశ్చయంతోనూ, విజయం సాధించాలన్న ఆకాంక్షతోనూ రావణడు విజయ పరంపరలతో తన ప్రజలని ముందుకీ తీసుకువెళ్లాడు. దేవతల రాజ్యాలన్నిటినీ హస్తగతం చేసుకుని, ఒక సువిశాల సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. రావణుడు అద్భుతమైన విజయాలు సాధించినప్పటికీ, అసురులలో పేదవారు తమ పరిస్థితిలో పెద్దమార్పేమీ జరగలేదని గ్రహించారు. సరిగ్గా ఆ సమయంలో రావణుడు ఒక్క దెబ్బతో ప్రపంచ చరిత్రనే మార్చివేశాడు.

జయ పరాజయాల పురాణ గాధ                రామాయణ కధని ఇంతవరకూ లెక్కలేనన్ని సార్లు చెప్పటం జరిగింది. ఇది భగవంతుడి అవతారం అయిన రాముడి ఆసక్తికరమైన కధ. దుష్ట రాక్షసుడు రావణుడిని అతను సంహరిస్తాడు. ఇది ప్రతి భారతీయుడికీ సుపరిచితమే. చరిత్ర పుటలలో కూడా ఎప్పుడూ కధనం విజేతల పక్షానే ఉంటూ వస్తోంది. పరాజితుల గొంతు మౌనంగా ఉండి ఎవరికీ వినిపించదు. ఒకవేళ రావణుడూ, అతని ప్రజలూ ఈ కధని వేరేవిధంగా చెప్పాలనుకుంటే ఏమవుతుంది ?                 రావణాయణ కధని ఎప్పుడూ ఎవరూ చెప్పలేదు.                'అసరుడు' పరాజితులైన అసురుల గాధ. 3000 సంవత్సరాలుగా వెలివేయబడ్డ పిడితులు ఎంతో ప్రేమగా కాపాడుకుంటూ వస్తున్న కధ ఇది. ఇంతవరకూ ఈ కధ చెప్పే సాహసం ఏ అసురుడూ చెయ్యలేదు. బహుశా పరాజితులైన వారూ, మరణించిన వారూ కధ చెప్పే సమయం ఆసన్నమైందేమో.          "కొన్ని వేల సంవత్సరాల వరకూ నన్ను ఒక దుర్మార్గుడిగా, ప్రతినాయకుడిలా చిత్రిస్తూ వచ్చారు. భారతదేశమంతటా నా మరణాన్ని పండగలా జరుపుకుంటారు. ఎందుకు? నా కుమార్తెకోసం దేవతలని ఎదిరించాననా? కులవ్యవస్థమీద ఆధారపడిన దేవతల పరిపాలన నా ప్రజలని కాడిలా అణచివెయ్యకుండా వారిని కాపాడాననా? మీరు విజేత కధ రామాయణం విన్నారు. నా కధ రావణాయణం కూడా వినండి. నా పేరు రావణుడు, నేను అసురుడిని, నాది పరాజితుడి కధ."               "నేను ఉనికిలేని వాడిని - కళ్ళకి కనిపించను, అశక్తుడిని, లెక్కలోకి రానివాడిని, ఎన్నడూ, ఎవరూ నా గురించి ఎటువంటి గాధలూ రాయరు. నేను రావణుడి చేతిలోనూ, రాముడి చేతిలోనూ బాధలు అనుభవించాను - ఒకరు నాయకుడు, మరొకరు ప్రతినాయకుడు. ఆ పాత్రలని అటూ ఇటూ మార్చుకోవటం కూడా సాధ్యమే. గొప్ప వ్యక్తుల కధలు చెప్పేటప్పుడు, నా గొంతు మరీ బలహీనంగా ఉండి ఎవరికీ వినిపించకపోవచ్చు. అయినా ఒక్క క్షణం నాకోసం వెచ్చించి నా కధ కూడా వినండి. నా పేరు భద్రుడు, అసురుజాతి నాది, నాది ఓటమికీ గురైన వాడి కధ."               ప్రాచీనకాలం నాటి అసుర సామ్రాజ్యం విచ్చిన్నమై పోయింది. ఎన్నో చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి దేవతల పాదాలకింద నలిగిపోసాగింది. అసహాయ స్థితిలో అసురులు తమ రక్షకుడూ, యువకుడూ అయిన రావణుడిని ఆశ్రయించారు. రావణుడి నియంతృత్వంలో తమకి మెరుగైన భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో భద్రుడిలాంటి సామాన్య జనం ఆ యువనాయకుడిని అనుసరించాలని అనుకున్నారు. దృఢ నిశ్చయంతోనూ, విజయం సాధించాలన్న ఆకాంక్షతోనూ రావణడు విజయ పరంపరలతో తన ప్రజలని ముందుకీ తీసుకువెళ్లాడు. దేవతల రాజ్యాలన్నిటినీ హస్తగతం చేసుకుని, ఒక సువిశాల సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. రావణుడు అద్భుతమైన విజయాలు సాధించినప్పటికీ, అసురులలో పేదవారు తమ పరిస్థితిలో పెద్దమార్పేమీ జరగలేదని గ్రహించారు. సరిగ్గా ఆ సమయంలో రావణుడు ఒక్క దెబ్బతో ప్రపంచ చరిత్రనే మార్చివేశాడు.

Features

  • : Asurudu
  • : Anand Neelakantans
  • : Manjul Publishing House
  • : MANJUL0217
  • : Paperback
  • : 2014
  • : 464
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Asurudu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam