Giresham Kavithvapu Tutionu Chakirevu

Rs.35
Rs.35

Giresham Kavithvapu Tutionu Chakirevu
INR
VISHALDR99
Out Of Stock
35.0
Rs.35
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            కొల్లూరు ధర్మరాయ కవి రచించిన వ్యంగ్య రచన 'చాకి రేవు' (గిరీశం కవిత్వపు ట్యూషన్) ఇది 1929 లో అచ్చయింది. అప్పటికి భావ కవిత్వం ఉచ్చదశలో ఉంది. గ్రాంధిక వ్యవహారిక భాషా వివాదాలు కొనసాగుతున్నాయి. కధానిక రొమాంటిక్ దారి పట్టుతున్నది. 1910 కి ముందు ఆధునిక తెలుగు సాహిత్య సౌధానికి వేసిన పునాదికి - ఆ తర్వాత దానికి - పొంతన లేని భావకవిత్వ భవనం నిర్మింపబడినది. అందుకే అది త్వరగానే కూలిపోయింది. అప్పటికి వ్యవహారిక భాష కొంత సంఘర్షణ పడిన తర్వాత విజయం సాధించింది. కధానిక అప్పటి రొమాంటిక్ మార్గం వదిలి జాతీయోద్యమ అభ్యుదయ బాటలు పట్టింది. ఈ సంధి దశ మీద ధర్మరాయ కవి రాసిన సెటైర్ లే 'చాకిరేవు'. చాకిరేవులో జరిగే పని మురికి బట్టల్ని ఉతికి అరేయడమే. 'చాకిరేవు' లో కూడా రచయిత చేసిన పని అదే. అందులో గురజాడ అప్పారావు 'గీరీశం భాష' ప్రధాన వాహికగా తీసుకున్నారు రచయిత. అధిక్షేపానికి, వ్యంగ్యానికి - విమర్శకు ఇది సరైన అయిధంగా పనిచేసింది.

 

             గిరీశం, బుచ్చమ్మ, వెంకటేశాలు ఇందులో పాత్రలు. గిరీశం, భుచ్చమ్మ పెళ్ళిచేసుకుని సంసారం చేసుకుంటూ ఉంటారు. వెంకటేశం, వేంకటకవి గ కవిత్వసాధన చేస్తుంటాడు. వీటిలో భావ కవిత్వం మీద పిడిగుద్దులు వంటి వ్యంగ్య బాణాలు విసిరాడు రచయిత. అప్పటి తెలుగు కధానికలలోని అసహజ ధోరణుల మీద అధిక్షేపం, వ్యంగ్య రచన.

            కొల్లూరు ధర్మరాయ కవి రచించిన వ్యంగ్య రచన 'చాకి రేవు' (గిరీశం కవిత్వపు ట్యూషన్) ఇది 1929 లో అచ్చయింది. అప్పటికి భావ కవిత్వం ఉచ్చదశలో ఉంది. గ్రాంధిక వ్యవహారిక భాషా వివాదాలు కొనసాగుతున్నాయి. కధానిక రొమాంటిక్ దారి పట్టుతున్నది. 1910 కి ముందు ఆధునిక తెలుగు సాహిత్య సౌధానికి వేసిన పునాదికి - ఆ తర్వాత దానికి - పొంతన లేని భావకవిత్వ భవనం నిర్మింపబడినది. అందుకే అది త్వరగానే కూలిపోయింది. అప్పటికి వ్యవహారిక భాష కొంత సంఘర్షణ పడిన తర్వాత విజయం సాధించింది. కధానిక అప్పటి రొమాంటిక్ మార్గం వదిలి జాతీయోద్యమ అభ్యుదయ బాటలు పట్టింది. ఈ సంధి దశ మీద ధర్మరాయ కవి రాసిన సెటైర్ లే 'చాకిరేవు'. చాకిరేవులో జరిగే పని మురికి బట్టల్ని ఉతికి అరేయడమే. 'చాకిరేవు' లో కూడా రచయిత చేసిన పని అదే. అందులో గురజాడ అప్పారావు 'గీరీశం భాష' ప్రధాన వాహికగా తీసుకున్నారు రచయిత. అధిక్షేపానికి, వ్యంగ్యానికి - విమర్శకు ఇది సరైన అయిధంగా పనిచేసింది.                గిరీశం, బుచ్చమ్మ, వెంకటేశాలు ఇందులో పాత్రలు. గిరీశం, భుచ్చమ్మ పెళ్ళిచేసుకుని సంసారం చేసుకుంటూ ఉంటారు. వెంకటేశం, వేంకటకవి గ కవిత్వసాధన చేస్తుంటాడు. వీటిలో భావ కవిత్వం మీద పిడిగుద్దులు వంటి వ్యంగ్య బాణాలు విసిరాడు రచయిత. అప్పటి తెలుగు కధానికలలోని అసహజ ధోరణుల మీద అధిక్షేపం, వ్యంగ్య రచన.

Features

  • : Giresham Kavithvapu Tutionu Chakirevu
  • : Kolluru Dharma Raya Kavi
  • : Vishalandra
  • : VISHALDR99
  • : Paperback
  • : 46
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Giresham Kavithvapu Tutionu Chakirevu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam