Kaala Rekhalu

Rs.300
Rs.300

Kaala Rekhalu
INR
MANIMN4551
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

సంస్కరణల స్నానం

స్వరాజ్య భావనకు ఆకృతినిచ్చే క్రమంలో వేయవలసిన తొలి అడుగు రాజకీయ ఐక్యతవైపే. సుదూర చరిత్రలో కనిపించే ఇలాంటి రాజకీయ ఐక్యతను భారతీయుల మధ్య మళ్లీ నిర్మించినది సాంస్కృతిక ఏకత్వమే. ఆ రెండు రంగుల సమ్మేళనమే 19 శతాబ్దం మీద గాఢంగా కనిపిస్తుంది. మత, సామాజిక సంస్కరణోద్యమాలకు వేదిక ఈ శతాబ్దం. ఈ ఉద్యమాలకీ, అవి ఆవిష్కరించిన రాజకీయ ఏకత్వ చింతనకూ ఈ శతాబ్దమే ఆయువుపట్టు. అదే భారత పునరుజ్జీవనోద్యమం. ఇది అనేక సంస్కరణోద్యమాల సంగమం. ఒక చరిత్రాత్మక సమరానికి భారతీయులు కదలవలసిన పరిస్థితులు ముంచుకొస్తున్న సందర్భంలో వచ్చిన మార్పు. జాతీయ పోరాటానికి భారతీయులకు సాధికారతను కల్పించినదిగా పునరుజ్జీవనోద్యమానికి చరిత్రలో స్థానమిస్తారు. జాతీయవాదం ఈ పునరుజ్జీవనోద్యమిచ్చిన ఆయుధమని చెప్పాలి.

ఇంగ్లిష్ చదువు, దేశంలోని వాతావరణం కొత్త సాంస్కృతికోద్యమానికి శ్రీకారం చుట్టాయి. వాటి తొలివెలుగులను బెంగాల్ దర్శించింది కాబట్టి, దీనికి బెంగాల్ పునరుజ్జీవనోద్యమం అన్న పేరూ ఉంది. బెంగాల్లో పడిన మేధోపరమైన ముందడుగునే బంకించంద్ర చటర్జీ, బిపిన్ చంద్రపాల్ పునరుజ్జీవనోద్యమంగా అభివర్ణించారు. భారతావనికీ వర్తిస్తుంది. కానీ ఈ పరిణామాన్ని ఐరోపా పునరుజ్జీవనోద్యమంతో పోల్చడం సరికాదు. ఈ పునరుజ్జీవనోద్యమం చారిత్రకమూలాల అన్వేషణలో, భాషాసాహిత్యాల ఆధునీకరణలో, సాంఘిక సంస్కరణలలో కొత్తదృష్టిని తెచ్చింది. పాశ్చాత్య పునరుజ్జీవనోద్యమం లక్ష్యం 14,15 శతాబ్దాల కళాశైలులకు పునర్ వైభవం..............

సంస్కరణల స్నానం స్వరాజ్య భావనకు ఆకృతినిచ్చే క్రమంలో వేయవలసిన తొలి అడుగు రాజకీయ ఐక్యతవైపే. సుదూర చరిత్రలో కనిపించే ఇలాంటి రాజకీయ ఐక్యతను భారతీయుల మధ్య మళ్లీ నిర్మించినది సాంస్కృతిక ఏకత్వమే. ఆ రెండు రంగుల సమ్మేళనమే 19 శతాబ్దం మీద గాఢంగా కనిపిస్తుంది. మత, సామాజిక సంస్కరణోద్యమాలకు వేదిక ఈ శతాబ్దం. ఈ ఉద్యమాలకీ, అవి ఆవిష్కరించిన రాజకీయ ఏకత్వ చింతనకూ ఈ శతాబ్దమే ఆయువుపట్టు. అదే భారత పునరుజ్జీవనోద్యమం. ఇది అనేక సంస్కరణోద్యమాల సంగమం. ఒక చరిత్రాత్మక సమరానికి భారతీయులు కదలవలసిన పరిస్థితులు ముంచుకొస్తున్న సందర్భంలో వచ్చిన మార్పు. జాతీయ పోరాటానికి భారతీయులకు సాధికారతను కల్పించినదిగా పునరుజ్జీవనోద్యమానికి చరిత్రలో స్థానమిస్తారు. జాతీయవాదం ఈ పునరుజ్జీవనోద్యమిచ్చిన ఆయుధమని చెప్పాలి. ఇంగ్లిష్ చదువు, దేశంలోని వాతావరణం కొత్త సాంస్కృతికోద్యమానికి శ్రీకారం చుట్టాయి. వాటి తొలివెలుగులను బెంగాల్ దర్శించింది కాబట్టి, దీనికి బెంగాల్ పునరుజ్జీవనోద్యమం అన్న పేరూ ఉంది. బెంగాల్లో పడిన మేధోపరమైన ముందడుగునే బంకించంద్ర చటర్జీ, బిపిన్ చంద్రపాల్ పునరుజ్జీవనోద్యమంగా అభివర్ణించారు. భారతావనికీ వర్తిస్తుంది. కానీ ఈ పరిణామాన్ని ఐరోపా పునరుజ్జీవనోద్యమంతో పోల్చడం సరికాదు. ఈ పునరుజ్జీవనోద్యమం చారిత్రకమూలాల అన్వేషణలో, భాషాసాహిత్యాల ఆధునీకరణలో, సాంఘిక సంస్కరణలలో కొత్తదృష్టిని తెచ్చింది. పాశ్చాత్య పునరుజ్జీవనోద్యమం లక్ష్యం 14,15 శతాబ్దాల కళాశైలులకు పునర్ వైభవం..............

Features

  • : Kaala Rekhalu
  • : Dr Goparaju Narayanarao
  • : Sri Raghvendra Publications
  • : MANIMN4551
  • : paparback
  • : March, 2023
  • : 256
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kaala Rekhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam