Magic Of Mahatma

By Dr B V Pattabhi Ram (Author)
Rs.60
Rs.60

Magic Of Mahatma
INR
EMESCO0361
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            మేజిక్ అంటే ఒక అద్భుతం, ఆశ్చర్యం కలిగించే ప్రక్రియ. గాంధీజీ జీవిత చరిత్ర ఆద్యంతం ఆశ్చర్యపరిచే, అబ్బురపరిచే సంఘటనలెన్నో ఉన్నాయి. ఒక సాధారణ వ్యక్తి అసాధారణ వ్యక్తిగా మారటం మామూలు విషయం కాదు. ఒక మామూలు వ్యక్తి మహాత్ముడుగా గుర్తింపు పొందాడంటే అది మేజిక్ కన్నా మహిమాన్విత శక్తి అనిపించకమానదు. అందుకే ఈ పుస్తకానికి "మేజిక్ ఆఫ్ మహాత్మా" అనే పేరుని ఎమెస్కో సిఈఓ శ్రీ విజయకుమార్ సూచించారు. వారికి ధన్యవాదాలు.

               గాంధీజీ గురించి ఎందరో మేధావులు, ఎన్నో కోణాలలో తమదైన విశ్లేషణతో ఎంతో శక్తివంతమైన రచనలు చేశారు. వారిలో ప్యారేలాల్, టి జి టెండూల్కర్, లూయి ఫిషర్, నారాయణ దేశాయి, గాంధీజీ మనవడు రాజ్ మోహన్ గాంధీ ముఖ్యులు. ఇకపోతే గాంధీజీ తన మధ్యవయసులో రాసుకున్న ఆత్మకథ, దాదాపు 36 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమైంది. తనకు గుర్తున్న మేరకు చాలా అనుభవాలను ఇందులో కూర్చాడు.  

                    గాంధీజీ ఆత్మకథ 'సత్యశోధన'. ఇది ఆయన అంతరంగ సత్యశోధనతో పాటు బాహ్యప్రపంచ సత్యశోధన కూడా. అందుకే ఆత్మకథల్లో సాధారణమైన దాపరికాలేవీ ఇందులో కనిపించవు. ఈ పుస్తకంలో ఒక అతి సాధారణ మానవుడు అందరు సాధారణ మానవుల్లాగానే అసత్యం, పిరికితనం, మోహం, అహం వంటి అనేక దుర్లక్షణాలను ప్రదర్శిస్తాడు. తన అంతరంగాన్ని శోధించుకుని వాటిని తొలగించుకుంటాడు. తాను తొలగించుకోవడమే కాదు అసంఖ్యాక ప్రజానీకాన్ని ప్రభావితం చేస్తాడు. తొలిచూపులో ఈ మనిషితో ఏమవుతుంది? అనుకున్న వారికే తిరుగులేని నాయకుడవుతాడు. ఆయన మాటే మంత్రమయింది కోట్లాది ప్రజలకు.                         

            మేజిక్ అంటే ఒక అద్భుతం, ఆశ్చర్యం కలిగించే ప్రక్రియ. గాంధీజీ జీవిత చరిత్ర ఆద్యంతం ఆశ్చర్యపరిచే, అబ్బురపరిచే సంఘటనలెన్నో ఉన్నాయి. ఒక సాధారణ వ్యక్తి అసాధారణ వ్యక్తిగా మారటం మామూలు విషయం కాదు. ఒక మామూలు వ్యక్తి మహాత్ముడుగా గుర్తింపు పొందాడంటే అది మేజిక్ కన్నా మహిమాన్విత శక్తి అనిపించకమానదు. అందుకే ఈ పుస్తకానికి "మేజిక్ ఆఫ్ మహాత్మా" అనే పేరుని ఎమెస్కో సిఈఓ శ్రీ విజయకుమార్ సూచించారు. వారికి ధన్యవాదాలు.                గాంధీజీ గురించి ఎందరో మేధావులు, ఎన్నో కోణాలలో తమదైన విశ్లేషణతో ఎంతో శక్తివంతమైన రచనలు చేశారు. వారిలో ప్యారేలాల్, టి జి టెండూల్కర్, లూయి ఫిషర్, నారాయణ దేశాయి, గాంధీజీ మనవడు రాజ్ మోహన్ గాంధీ ముఖ్యులు. ఇకపోతే గాంధీజీ తన మధ్యవయసులో రాసుకున్న ఆత్మకథ, దాదాపు 36 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమైంది. తనకు గుర్తున్న మేరకు చాలా అనుభవాలను ఇందులో కూర్చాడు.                       గాంధీజీ ఆత్మకథ 'సత్యశోధన'. ఇది ఆయన అంతరంగ సత్యశోధనతో పాటు బాహ్యప్రపంచ సత్యశోధన కూడా. అందుకే ఆత్మకథల్లో సాధారణమైన దాపరికాలేవీ ఇందులో కనిపించవు. ఈ పుస్తకంలో ఒక అతి సాధారణ మానవుడు అందరు సాధారణ మానవుల్లాగానే అసత్యం, పిరికితనం, మోహం, అహం వంటి అనేక దుర్లక్షణాలను ప్రదర్శిస్తాడు. తన అంతరంగాన్ని శోధించుకుని వాటిని తొలగించుకుంటాడు. తాను తొలగించుకోవడమే కాదు అసంఖ్యాక ప్రజానీకాన్ని ప్రభావితం చేస్తాడు. తొలిచూపులో ఈ మనిషితో ఏమవుతుంది? అనుకున్న వారికే తిరుగులేని నాయకుడవుతాడు. ఆయన మాటే మంత్రమయింది కోట్లాది ప్రజలకు.                         

Features

  • : Magic Of Mahatma
  • : Dr B V Pattabhi Ram
  • : Emesco Publishers
  • : EMESCO0361
  • : Paperback
  • : 2016
  • : 136
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Magic Of Mahatma

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam