Bhagavatha Sapthahamu

Rs.400
Rs.400

Bhagavatha Sapthahamu
INR
MANIMN4511
In Stock
400.0
Rs.400


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఓమ్, శ్రీ గణేశాయ నమః

శ్రీమద్భాగవత సప్తాహము
  1. ఉపోద్ఘాతము

తుండము నేకదంతమును దోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్,
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలనెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్.

సదాశివ సమారంభాం శంకరాచార్యమధ్యమామ్ |
అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరామ్ ||
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ |
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ||

శ్రీమద్భాగవతాన్ని భగవాన్ వేదవ్యాసమహర్షి ప్రణీతం చేసినారనేది లోకవిదితము. వేదవ్యాస మహర్షి అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. కృష్ణ అనే పేరు అందరికీ పరిచితమే. భారతంలో ఆ పేరున్నవాళ్లు చాలమందే ఉన్నారు. అర్జునునకు కృష్ణుడని పేరు. శ్రీకృష్ణ భగవానుడు సరే సరి. ద్రౌపదికి కృష్ణ అని పేరు. వేదవ్యాసుడు కూడ కృష్ణుడే. కృష్ణుడనగా నల్లనివాడు అని యర్థము. ఆయన సరస్వతీనది యొక్క ద్వీపంలో, అంటే లంకలో నివసించేవాడు. కాబట్టే ఆయనకు ద్వైపాయనుడు అనే పేరు వచ్చింది. ఇప్పటికీ లంక, లంకల మొదలైన ఇంటి పేర్లు మనకు వినబడుతూ ఉంటాయి. ఆ మహర్షి రచించిన పద్దెని మిది పురాణాలలో శ్రీమద్భాగవతము ప్రముఖమైనది, లోకంలో బాగా ప్రచారం గలది. ఈ పురాణాన్ని అధ్యయనం చేసే ముందు దాని స్వరూపాన్ని సూచనగా తెలుసుకుందాము.

భాగవతంలో బోధ ప్రధానంగా నాలుగు రకాలుగా ఉంటుంది..................

ఓమ్, శ్రీ గణేశాయ నమః శ్రీమద్భాగవత సప్తాహము ఉపోద్ఘాతము తుండము నేకదంతమును దోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్, కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలనెల్ల నొజ్జయై యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్. సదాశివ సమారంభాం శంకరాచార్యమధ్యమామ్ | అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరామ్ || నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ | దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ || శ్రీమద్భాగవతాన్ని భగవాన్ వేదవ్యాసమహర్షి ప్రణీతం చేసినారనేది లోకవిదితము. వేదవ్యాస మహర్షి అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. కృష్ణ అనే పేరు అందరికీ పరిచితమే. భారతంలో ఆ పేరున్నవాళ్లు చాలమందే ఉన్నారు. అర్జునునకు కృష్ణుడని పేరు. శ్రీకృష్ణ భగవానుడు సరే సరి. ద్రౌపదికి కృష్ణ అని పేరు. వేదవ్యాసుడు కూడ కృష్ణుడే. కృష్ణుడనగా నల్లనివాడు అని యర్థము. ఆయన సరస్వతీనది యొక్క ద్వీపంలో, అంటే లంకలో నివసించేవాడు. కాబట్టే ఆయనకు ద్వైపాయనుడు అనే పేరు వచ్చింది. ఇప్పటికీ లంక, లంకల మొదలైన ఇంటి పేర్లు మనకు వినబడుతూ ఉంటాయి. ఆ మహర్షి రచించిన పద్దెని మిది పురాణాలలో శ్రీమద్భాగవతము ప్రముఖమైనది, లోకంలో బాగా ప్రచారం గలది. ఈ పురాణాన్ని అధ్యయనం చేసే ముందు దాని స్వరూపాన్ని సూచనగా తెలుసుకుందాము. భాగవతంలో బోధ ప్రధానంగా నాలుగు రకాలుగా ఉంటుంది..................

Features

  • : Bhagavatha Sapthahamu
  • : Swamy Tatvavidhananda Saraswathi
  • : Emasco Books pvt.L.td.
  • : MANIMN4511
  • : paparback
  • : June, 2023
  • : 630
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bhagavatha Sapthahamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam