Vikarna

Rs.164
Rs.164

Vikarna
INR
MANIMN4578
In Stock
164.0
Rs.164


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

వికర్ణ

అది మాఘమాసం. శుక్లపక్షం. భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేయి కళ్లతో నిరీక్షిస్తున్న కాలం. ఆ మహావీరుడు అంపశయ్యమీద అరమోడ్పు కన్నులతో పరుండిఉన్నాడు. హృదయాన్ని శివైక్యం చేసేందుకు సిద్ధపడుతున్నాడు. దేహమంతా నెత్తుటి చారికలే. ఒడలంతా శరాఘాతాల జాడలే. బాణాల పాన్పు భీష్మాచార్యుని శరీరాన్ని గుచ్చెత్తి నిలిపింది. ఆ యాతన చెప్పలేనిది. ఆ బాధ వివరించజాలనిది. అయినా పితామహులవారిలో ఆ నరకయాతనల ఛాయలేవీ గోచరమవ్వడం లేదు. మీదుమిక్కిలిగా, ఆయన వదనం ప్రశాంతంగా కానవస్తోంది. శరత్పూర్ణిమలా చల్లగా, తేజోమయంగా ప్రకాశిస్తోంది.

అతడు అనేక యుద్ధాలలో ఆరితేరిన మహామూర్తి. ఈ ప్రపంచంతో తనకేమీ సంబంధం లేనట్టుగా నిశ్చలుడై ఉన్నాడు. నిష్కామకర్మయోగియై పరలోకప్రయాణం కోసం ఎదురుచూస్తున్నాడు.

సరిగ్గా ఇదే సమయంలో తాతగారి దర్శనం చేసుకోవాలనుకున్నారు పాండుసుతులు. వెన్నంటికాచే కృష్ణ పరమాత్మునితో ఈ మాటే చెప్పారు. గుండెల్లో గూడుకట్టుకున్న కొన్ని భావాలనూ పంచుకున్నారు.

"నందనందనా. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయింది. మాకు దన్నుగా నిలిచావు. విజయలక్ష్మిని ప్రాప్తింపజేశావు. అరివీరభయంకరమైన కురుసేనావాహినిని తుత్తునియలు చేసేలా అర్జునునికి సాయపడ్డావు. సారథివయ్యావు. ఇంత జరిగినా ఎందుకనో విజయగర్వమేమీ మదిలో మెదలడం లేదు. అయినవారిని చంపుకున్న తర్వాత రాజ్యం ఉండినా మండినా ఒక్కటి కాదా." ధర్మరాజు నిర్లిప్తంగా అనేసరికి, నల్లనయ్య మనసు కించిత్ వ్యాకులతకు లోనయింది. దాన్ని పైకి కనిపించనివ్వకుండా జాగ్రత్తపడ్డాడు.

నైరాశ్యానికి గెలిచిన సందర్భంలోనూ పాండవాగ్రజుడు గురవుతుండటం గోవిందునికి ఎంత మాత్రమూ నచ్చలేదు. చక్రవర్తిగా సువిశాల భారతావనికి సుపరిపాలన అందివ్వవలసిన ధర్మజుడు బేలగా మారడం మింగుడుపడలేదు. అందుకే అందుకున్నాడు.................

వికర్ణ అది మాఘమాసం. శుక్లపక్షం. భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేయి కళ్లతో నిరీక్షిస్తున్న కాలం. ఆ మహావీరుడు అంపశయ్యమీద అరమోడ్పు కన్నులతో పరుండిఉన్నాడు. హృదయాన్ని శివైక్యం చేసేందుకు సిద్ధపడుతున్నాడు. దేహమంతా నెత్తుటి చారికలే. ఒడలంతా శరాఘాతాల జాడలే. బాణాల పాన్పు భీష్మాచార్యుని శరీరాన్ని గుచ్చెత్తి నిలిపింది. ఆ యాతన చెప్పలేనిది. ఆ బాధ వివరించజాలనిది. అయినా పితామహులవారిలో ఆ నరకయాతనల ఛాయలేవీ గోచరమవ్వడం లేదు. మీదుమిక్కిలిగా, ఆయన వదనం ప్రశాంతంగా కానవస్తోంది. శరత్పూర్ణిమలా చల్లగా, తేజోమయంగా ప్రకాశిస్తోంది. అతడు అనేక యుద్ధాలలో ఆరితేరిన మహామూర్తి. ఈ ప్రపంచంతో తనకేమీ సంబంధం లేనట్టుగా నిశ్చలుడై ఉన్నాడు. నిష్కామకర్మయోగియై పరలోకప్రయాణం కోసం ఎదురుచూస్తున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో తాతగారి దర్శనం చేసుకోవాలనుకున్నారు పాండుసుతులు. వెన్నంటికాచే కృష్ణ పరమాత్మునితో ఈ మాటే చెప్పారు. గుండెల్లో గూడుకట్టుకున్న కొన్ని భావాలనూ పంచుకున్నారు. "నందనందనా. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయింది. మాకు దన్నుగా నిలిచావు. విజయలక్ష్మిని ప్రాప్తింపజేశావు. అరివీరభయంకరమైన కురుసేనావాహినిని తుత్తునియలు చేసేలా అర్జునునికి సాయపడ్డావు. సారథివయ్యావు. ఇంత జరిగినా ఎందుకనో విజయగర్వమేమీ మదిలో మెదలడం లేదు. అయినవారిని చంపుకున్న తర్వాత రాజ్యం ఉండినా మండినా ఒక్కటి కాదా." ధర్మరాజు నిర్లిప్తంగా అనేసరికి, నల్లనయ్య మనసు కించిత్ వ్యాకులతకు లోనయింది. దాన్ని పైకి కనిపించనివ్వకుండా జాగ్రత్తపడ్డాడు. నైరాశ్యానికి గెలిచిన సందర్భంలోనూ పాండవాగ్రజుడు గురవుతుండటం గోవిందునికి ఎంత మాత్రమూ నచ్చలేదు. చక్రవర్తిగా సువిశాల భారతావనికి సుపరిపాలన అందివ్వవలసిన ధర్మజుడు బేలగా మారడం మింగుడుపడలేదు. అందుకే అందుకున్నాడు.................

Features

  • : Vikarna
  • : Dr Chintakindi Srinivasarao
  • : Reem Publications pvt ltd
  • : MANIMN4578
  • : paparback
  • : 2016 first edition
  • : 160
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vikarna

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam