Myna

By Sila Veerraju (Author)
Rs.175
Rs.175

Myna
INR
EMESCO0665
In Stock
175.0
Rs.175


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

      ఈ నవలకు వస్తువు, ఒక మలుపుకూ, మరో మలుపుకూ మధ్యగల జీవితం. ఇతివృత్తాన్ని ఎన్నుకోవడం అనేది రచయిత దృష్టిని బట్టి ఉంటుంది. నది ఒడ్డునకూర్చున్న మనిషికి పూర్తిగా నది అంతా కనిపించదు. ఏ కొండ పక్కనో చటుక్కున మలుపు తిరిగిన చోట కనబడటం ప్రారంభించి, మనిషి ముందు నుండి వెళ్లి, ఏ చెట్ల గుబురుల పక్కకో మళ్ళి, మాయమైపోతుంది. కొండ మీద నిలబడి చూస్తే మరికాస్తా ఎక్కువ కనిపిస్తుంది. విమానం మీద నుండి మరీనీ. దృష్టిని బట్టి మారుతుంది. ఏ ఫోటోను తీసుకున్నా మూడూ నదిని చూపించేవే. రచయిత దేన్నైనా ఎన్నుకోవచ్చు. అయితే ఆ ఫోటోలు ఏవో రెండు మలుపుల మధ్యగల నదిని చుపించేవిగా ఉంటే చూడటానికి బాగుంటాయి.

       సాహిత్యపు పరిభాషలో వీటినే 'ట్విస్ట్'లు అంటారు. చక్కటి రెండు ట్విస్ట్ ల మధ్యగల జీవితం నవలకు పరిపూర్ణతను, అందాన్ని కలిగిస్తుంది. అందుకే ఈ నవలలో ప్రధాన పాత్రను దాటుకుని వెళ్లి, అందమైన ఒక ట్విస్ట్ తో కథను ప్రారంభించాల్సి వచ్చింది.

       ఈ నవలలో ఒక జీవితాన్ని యధాతథంగా చూపించడానికి ప్రయత్నించారు రచయిత. ఇది ఫోటో ధోరణిలో వేసిన చిత్రం. ఈ జీవిత చిత్రణలో ఆ వ్యక్తీ బాధలూ, సుఖాలూ, ఆశలూ, జీవిత సంగ్రామంలో నిలదొక్కుకునే ప్రయత్నాలూ, పరిణామాలూ - అన్నీ ఇందులో ఉన్నాయి.

       ఈ కథ ఎక్కడో జరగడం లేదు. మీ ముందే జరుగుతుంది. మీరు ప్రేక్షకులు. ఇందులోని ప్రతి కదలికను చిత్రంగా గీశాను. ఈ చిత్రాలన్నింటిని వరుసగా పేర్చి గబగబా ఒక వేగంతో చూసుకుంటూ వెళ్తే మీ ముందు ఒక సినిమా కదులుతుంది. తెలుగు సాహిత్యానికి కొత్తదైన ఒక తెలుగు జీవితం ఈ నవలలో ఉంది.  ఈ నవల కొత్తదనం కావాలనుకున్న వారి గురించి.

                                                                                                                       - శిలా వీర్రాజు   

      ఈ నవలకు వస్తువు, ఒక మలుపుకూ, మరో మలుపుకూ మధ్యగల జీవితం. ఇతివృత్తాన్ని ఎన్నుకోవడం అనేది రచయిత దృష్టిని బట్టి ఉంటుంది. నది ఒడ్డునకూర్చున్న మనిషికి పూర్తిగా నది అంతా కనిపించదు. ఏ కొండ పక్కనో చటుక్కున మలుపు తిరిగిన చోట కనబడటం ప్రారంభించి, మనిషి ముందు నుండి వెళ్లి, ఏ చెట్ల గుబురుల పక్కకో మళ్ళి, మాయమైపోతుంది. కొండ మీద నిలబడి చూస్తే మరికాస్తా ఎక్కువ కనిపిస్తుంది. విమానం మీద నుండి మరీనీ. దృష్టిని బట్టి మారుతుంది. ఏ ఫోటోను తీసుకున్నా మూడూ నదిని చూపించేవే. రచయిత దేన్నైనా ఎన్నుకోవచ్చు. అయితే ఆ ఫోటోలు ఏవో రెండు మలుపుల మధ్యగల నదిని చుపించేవిగా ఉంటే చూడటానికి బాగుంటాయి.        సాహిత్యపు పరిభాషలో వీటినే 'ట్విస్ట్'లు అంటారు. చక్కటి రెండు ట్విస్ట్ ల మధ్యగల జీవితం నవలకు పరిపూర్ణతను, అందాన్ని కలిగిస్తుంది. అందుకే ఈ నవలలో ప్రధాన పాత్రను దాటుకుని వెళ్లి, అందమైన ఒక ట్విస్ట్ తో కథను ప్రారంభించాల్సి వచ్చింది.        ఈ నవలలో ఒక జీవితాన్ని యధాతథంగా చూపించడానికి ప్రయత్నించారు రచయిత. ఇది ఫోటో ధోరణిలో వేసిన చిత్రం. ఈ జీవిత చిత్రణలో ఆ వ్యక్తీ బాధలూ, సుఖాలూ, ఆశలూ, జీవిత సంగ్రామంలో నిలదొక్కుకునే ప్రయత్నాలూ, పరిణామాలూ - అన్నీ ఇందులో ఉన్నాయి.        ఈ కథ ఎక్కడో జరగడం లేదు. మీ ముందే జరుగుతుంది. మీరు ప్రేక్షకులు. ఇందులోని ప్రతి కదలికను చిత్రంగా గీశాను. ఈ చిత్రాలన్నింటిని వరుసగా పేర్చి గబగబా ఒక వేగంతో చూసుకుంటూ వెళ్తే మీ ముందు ఒక సినిమా కదులుతుంది. తెలుగు సాహిత్యానికి కొత్తదైన ఒక తెలుగు జీవితం ఈ నవలలో ఉంది.  ఈ నవల కొత్తదనం కావాలనుకున్న వారి గురించి.                                                                                                                        - శిలా వీర్రాజు   

Features

  • : Myna
  • : Sila Veerraju
  • : Emesco Publishers
  • : EMESCO0665
  • : Paperback
  • : re print oct 2020
  • : 240
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Myna

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam