Ranigari Kathalu

By Saleem (Author)
Rs.100
Rs.100

Ranigari Kathalu
INR
NAVOPH0454
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

       నవల అయినా, కథ అయినా కొత్తరకం కథా వస్తువుని తీసుకుని అద్భుతంగా రాసి మెప్పించగల మంచి రచయిత సలీం. ఇప్పుడు, మతాంతర వివాహం చేసుకున్న హిందూ - ముస్లిం ఉవతీఉవకుల జంట, తమ పెళ్లి అయినప్పటినుంచి తమ పిల్లకి పెళ్లి చేసేవరకు మత విశ్వాసాలతో ముడిపడిన కుటుంబాలతోనూ, రాజకీయాలతో నిండిన సమాజంలోనూ ఎటువంటి కష్టాలూ, సుఖాలూ అనుభవించారో 'రాణీగారి కథలు'గా రమణీయంగా రచించాడు సలీం. 

       కథానాయకుడు సైఫ్, కథానాయిక రాణి పాఠకుల మనస్సుల్ని దోచుకునేట్లుగా ఉత్తమ పురుషలో కథలు రాసాడు. పెళ్ళిళ్ళు 'ఘనంగా' చేయడంలో పోటీలు పడుతున్న ఈ రోజుల్లో 'ఆకాశమంత పందిరి' వేసి, 'నక్షత్రాలు అక్షింతలుగా' కురిసేలాగ అందంగా పెళ్లి ఎలా చెయ్యవచ్చునో ఆఖరికథ చదివితే తెలుస్తుంది. మతసామరస్యం ఎలా సాధించవచ్చునో సంసారం పక్షంగా, సరళంగా, ఆహ్లాదకరంగా గీతావిష్కరణ చేస్తూ, 'మనసుకు లేదు మడి' అని బోధించాడు. మతానికి అతీతమైన మంచితనానికీ, ప్రేమకీ, మానవత్వానికీ ప్రతీకలు ఈ కథలు. ఈ కథలు మనసుని ఘాడంగా హత్తుకుంటాయి.

                                                                                           - అబ్బూరి ఛాయాదేవి

       పేర్ల చివర 'యస్' తగిలించుకొనో, మాటల్లో సెక్యులరిజంని నిత్యం స్మరిస్తూనో కనిపిస్తున్న రాజకీయాలు కుళ్ళిపోయాయి గాని మనుష్యులు, సమాజం ఆరోగ్యంగానే ఉన్నాయని తెలియజేసే 'రాణీగారి కథలు' చెప్పిన శ్రీ సలీం గారిని అభినందిస్తున్నాను. మంచిని మెచ్చుకోని నిర్లిప్తత మనకుండరాదని నమ్ముతూ... 

                                                                                            - కవనశర్మ 

       నవల అయినా, కథ అయినా కొత్తరకం కథా వస్తువుని తీసుకుని అద్భుతంగా రాసి మెప్పించగల మంచి రచయిత సలీం. ఇప్పుడు, మతాంతర వివాహం చేసుకున్న హిందూ - ముస్లిం ఉవతీఉవకుల జంట, తమ పెళ్లి అయినప్పటినుంచి తమ పిల్లకి పెళ్లి చేసేవరకు మత విశ్వాసాలతో ముడిపడిన కుటుంబాలతోనూ, రాజకీయాలతో నిండిన సమాజంలోనూ ఎటువంటి కష్టాలూ, సుఖాలూ అనుభవించారో 'రాణీగారి కథలు'గా రమణీయంగా రచించాడు సలీం.         కథానాయకుడు సైఫ్, కథానాయిక రాణి పాఠకుల మనస్సుల్ని దోచుకునేట్లుగా ఉత్తమ పురుషలో కథలు రాసాడు. పెళ్ళిళ్ళు 'ఘనంగా' చేయడంలో పోటీలు పడుతున్న ఈ రోజుల్లో 'ఆకాశమంత పందిరి' వేసి, 'నక్షత్రాలు అక్షింతలుగా' కురిసేలాగ అందంగా పెళ్లి ఎలా చెయ్యవచ్చునో ఆఖరికథ చదివితే తెలుస్తుంది. మతసామరస్యం ఎలా సాధించవచ్చునో సంసారం పక్షంగా, సరళంగా, ఆహ్లాదకరంగా గీతావిష్కరణ చేస్తూ, 'మనసుకు లేదు మడి' అని బోధించాడు. మతానికి అతీతమైన మంచితనానికీ, ప్రేమకీ, మానవత్వానికీ ప్రతీకలు ఈ కథలు. ఈ కథలు మనసుని ఘాడంగా హత్తుకుంటాయి.                                                                                            - అబ్బూరి ఛాయాదేవి        పేర్ల చివర 'యస్' తగిలించుకొనో, మాటల్లో సెక్యులరిజంని నిత్యం స్మరిస్తూనో కనిపిస్తున్న రాజకీయాలు కుళ్ళిపోయాయి గాని మనుష్యులు, సమాజం ఆరోగ్యంగానే ఉన్నాయని తెలియజేసే 'రాణీగారి కథలు' చెప్పిన శ్రీ సలీం గారిని అభినందిస్తున్నాను. మంచిని మెచ్చుకోని నిర్లిప్తత మనకుండరాదని నమ్ముతూ...                                                                                              - కవనశర్మ 

Features

  • : Ranigari Kathalu
  • : Saleem
  • : Sri Vijayalakshmi Publications
  • : NAVOPH0454
  • : Paperback
  • : 160
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Ranigari Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam