Katesina Anrutham

By Kakani Chakrapani (Author)
Rs.150
Rs.150

Katesina Anrutham
INR
EMESCO0924
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             ఆధునిక తెలుగుకథా, నవలాసాహిత్యంలో తనదైన శైలితో ప్రత్యేకతను సంతరించుకున్న రచయిత డా కాకాని చక్రపాణి. మానవ జీవన సంఘర్షణలను, ఆక్రోశాలను, ఆత్మీయతానుబంధాలను హృద్యమైన శైలిలో రూపుదిద్దగల శిల్పి ఆయన. డా చక్రపాణి పాత్రలు నేలవిడిచి సాము చెయ్యవు. అవి మనకు ఎంతో సుపరిచితాలనిపిస్తాయి. అవిశ్రాంతంగా సాగుతున్న ఆయన సాహిత్య వ్యవసాయంలో ఇప్పటివరకు పన్నెండు నవలలు, ఎన్నో కథలు, లెక్కకు మించిన అనువాదాలు, వ్యాసాలు పండించారు.

            హైదరాబాద్ లో ఆంద్రసారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో సుమారు 30 సంవత్సరాలు పనిచేసి పదవీవిరమణ చేశారు. ఆంగ్ల బోధనా ఆయన వృత్తి, తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి ఆయన వ్యావృత్తి. మనిషి మదృభాషి. తను విభేదించే విషయంలో సైతం ఎదుటివారిని నొప్పించని తత్త్వం ఆయనది. స్నేహితులతో కబుర్లంటే ఇష్టపడతారు. 'తెలుగు నవలా సాహిత్యంపై సోమర్ సెట్ మామ్ ప్రభావం' అన్న అంశంపై పరిశోధన చేసి పిహెచ్ డి పట్టం పొందారు.

            ఆ పరిశోధనలో భాగంగానే మామ్ రాసిన 'ఆఫ్ హ్యూమన్ బాండేజ్' నవలను అనువదించారు. ఇటీవలే ద్రావిడ విశ్వవిద్యాలయం కోసం రాజశేఖర చరిత్ర, మైదానం, చివరకు మిగిలేది, అల్పజీవి నవలలను 'ఫోర్ క్లాసిక్స్ ఆఫ్ ఆఫ్ తెలుగు ఫిక్షన్' పేరిట ఆంగ్లంలోకి అనువదించారు. అందుకోని ఆశల్లేవు గానీ జీవితానికి ఎంతో కొంత సార్థక్యం పొందాలని ఆయన కోరిక.

             ఆధునిక తెలుగుకథా, నవలాసాహిత్యంలో తనదైన శైలితో ప్రత్యేకతను సంతరించుకున్న రచయిత డా కాకాని చక్రపాణి. మానవ జీవన సంఘర్షణలను, ఆక్రోశాలను, ఆత్మీయతానుబంధాలను హృద్యమైన శైలిలో రూపుదిద్దగల శిల్పి ఆయన. డా చక్రపాణి పాత్రలు నేలవిడిచి సాము చెయ్యవు. అవి మనకు ఎంతో సుపరిచితాలనిపిస్తాయి. అవిశ్రాంతంగా సాగుతున్న ఆయన సాహిత్య వ్యవసాయంలో ఇప్పటివరకు పన్నెండు నవలలు, ఎన్నో కథలు, లెక్కకు మించిన అనువాదాలు, వ్యాసాలు పండించారు.             హైదరాబాద్ లో ఆంద్రసారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో సుమారు 30 సంవత్సరాలు పనిచేసి పదవీవిరమణ చేశారు. ఆంగ్ల బోధనా ఆయన వృత్తి, తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి ఆయన వ్యావృత్తి. మనిషి మదృభాషి. తను విభేదించే విషయంలో సైతం ఎదుటివారిని నొప్పించని తత్త్వం ఆయనది. స్నేహితులతో కబుర్లంటే ఇష్టపడతారు. 'తెలుగు నవలా సాహిత్యంపై సోమర్ సెట్ మామ్ ప్రభావం' అన్న అంశంపై పరిశోధన చేసి పిహెచ్ డి పట్టం పొందారు.             ఆ పరిశోధనలో భాగంగానే మామ్ రాసిన 'ఆఫ్ హ్యూమన్ బాండేజ్' నవలను అనువదించారు. ఇటీవలే ద్రావిడ విశ్వవిద్యాలయం కోసం రాజశేఖర చరిత్ర, మైదానం, చివరకు మిగిలేది, అల్పజీవి నవలలను 'ఫోర్ క్లాసిక్స్ ఆఫ్ ఆఫ్ తెలుగు ఫిక్షన్' పేరిట ఆంగ్లంలోకి అనువదించారు. అందుకోని ఆశల్లేవు గానీ జీవితానికి ఎంతో కొంత సార్థక్యం పొందాలని ఆయన కోరిక.

Features

  • : Katesina Anrutham
  • : Kakani Chakrapani
  • : Emesco Publishers
  • : EMESCO0924
  • : Paperback
  • : 2017
  • : 328
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Katesina Anrutham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam