Balala Geya Kathalu

By Aluri Bhairagi (Author)
Rs.100
Rs.100

Balala Geya Kathalu
INR
NAVOPH0650
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                                    స్నేహ ధర్మం

             అనగనగా మరి ఒక ఊళ్ళో ఉన్నారిద్దరూ కుర్రాళ్ళూ దిక్కులేని వారిద్దరునూ ముక్కు పచ్చలారని వాళ్ళు. కొంపా గోడూ లేదేమో, పూట కూటికే గతి లేదు, చిరిగిన మరకల ఉడుపులకూ మసి గుడ్డయినా సరి కాదు. ఏది దొరికితే అది తింటూ ఆకలి తీర్చుకొనే వాళ్ళు, రోడ్డు పక్కనే పైపుంటే దప్పిక ఆర్చుకొనే వాళ్ళు. వాన విసురుగా ముసురోస్తే ఏ పంచో వెదికే వాళ్ళు. వేసవి కాలపు రాత్రిళ్ళూ ఆరుబయట గడిపే వాళ్ళు. వారిని చూసిన వారంతా అన్నదమ్ములను కొన్నారు, కాని వాస్తవంగా వారూ చుట్టా లెట్లాగూ కారు. చుట్టరికంగా దారిద్ర్యం వారిని దగ్గర చేసింది స్నేహం ఉచ్చులుగా పన్నీ కాళ్ళకు బందాలేసింది.

             చలికాలం ఒక రోజుదయం వారాకలిగా లేచారు. ఎక్కడ ఏమి దొరుకుతుందా అని చుట్టూ కలయజూచారు. రోడ్డు వెంబడే పోతుంటే నారింజొక్కటి దొరికింది. పెద్దవాడు పరుగెత్తేడు కాయకేసి చెయ్యురికింది. దానిని తీసుక ఆత్రంగా తోలు ఒలిచి తినబోయాడు కాని అంతలో ఇంకొకడూ ఉన్నాడని గుర్తించాడు. చిన్న వాడనీ దయ తలచే కాయ అతనికే ఇచ్చాడు, అయ్యో తొందరపడ్డానే అని మనసున కడు నొచ్చాడు. చిన్నవాడు సగపాలు గోసీ సగమాతనికే ఇచ్చాడు. ఇద్దరి ఆకలి తీరేట్టు న్యాయంగా సరిపుచ్చాడు. ఇతరులు నీయెడ ఏ విధిగా వర్తించాలనుకుంటావో! నీవు వారి యెడ అట్లాగే వర్తించాలని అనుకోవో! ఇటువంటి కథలు ఈ పుస్తకంలో ఎన్నో కలవు.

                                    స్నేహ ధర్మం              అనగనగా మరి ఒక ఊళ్ళో ఉన్నారిద్దరూ కుర్రాళ్ళూ దిక్కులేని వారిద్దరునూ ముక్కు పచ్చలారని వాళ్ళు. కొంపా గోడూ లేదేమో, పూట కూటికే గతి లేదు, చిరిగిన మరకల ఉడుపులకూ మసి గుడ్డయినా సరి కాదు. ఏది దొరికితే అది తింటూ ఆకలి తీర్చుకొనే వాళ్ళు, రోడ్డు పక్కనే పైపుంటే దప్పిక ఆర్చుకొనే వాళ్ళు. వాన విసురుగా ముసురోస్తే ఏ పంచో వెదికే వాళ్ళు. వేసవి కాలపు రాత్రిళ్ళూ ఆరుబయట గడిపే వాళ్ళు. వారిని చూసిన వారంతా అన్నదమ్ములను కొన్నారు, కాని వాస్తవంగా వారూ చుట్టా లెట్లాగూ కారు. చుట్టరికంగా దారిద్ర్యం వారిని దగ్గర చేసింది స్నేహం ఉచ్చులుగా పన్నీ కాళ్ళకు బందాలేసింది.              చలికాలం ఒక రోజుదయం వారాకలిగా లేచారు. ఎక్కడ ఏమి దొరుకుతుందా అని చుట్టూ కలయజూచారు. రోడ్డు వెంబడే పోతుంటే నారింజొక్కటి దొరికింది. పెద్దవాడు పరుగెత్తేడు కాయకేసి చెయ్యురికింది. దానిని తీసుక ఆత్రంగా తోలు ఒలిచి తినబోయాడు కాని అంతలో ఇంకొకడూ ఉన్నాడని గుర్తించాడు. చిన్న వాడనీ దయ తలచే కాయ అతనికే ఇచ్చాడు, అయ్యో తొందరపడ్డానే అని మనసున కడు నొచ్చాడు. చిన్నవాడు సగపాలు గోసీ సగమాతనికే ఇచ్చాడు. ఇద్దరి ఆకలి తీరేట్టు న్యాయంగా సరిపుచ్చాడు. ఇతరులు నీయెడ ఏ విధిగా వర్తించాలనుకుంటావో! నీవు వారి యెడ అట్లాగే వర్తించాలని అనుకోవో! ఇటువంటి కథలు ఈ పుస్తకంలో ఎన్నో కలవు.

Features

  • : Balala Geya Kathalu
  • : Aluri Bhairagi
  • : Navodaya Book House
  • : NAVOPH0650
  • : Paperback
  • : 2016
  • : 79
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Balala Geya Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam