Saradaaki

By Mangu Rajagoopal (Author)
Rs.150
Rs.150

Saradaaki
INR
EMESCO0599
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

       ఆంధ్రజ్యోతి ఆదివారప్పుత్రిక - సండే బుఫే బ్రేక్ఫాస్ట్ స్ప్రెడ్ జన్ - పసంద్ - తెలుగు సినిమా ఐటెమ్సులా పప్పూ కూరలు పచ్చళ్ళు పొడుములూ పులుసూ చారూ పెరుగూ స్వీటూ హాటూ పండూలతో సర్వజనరంజకంగారుగా ఉంటుంది. కధలూ కాకరకాయలూ, భుజాలు తడుముకోవడానికి గుమ్మడికాయలు, పెసరట్టులూ గళ్ళనుడికట్టులూ ప్రివ్యూలు రివ్యూలు వేదాంతబాధలూ శృంగారగుళికలూ పిల్లల గోళీలూ వైకుంఠపాళీలూ పొళీలూ లేడీస్ చోళీలూ ఇలా కేలడోస్కోపిక్ విందు. అందులో రాజగోపాల్ గారి 'సరదాకి' ఒక హైలైట్. ఇందులో ఇంపైన నవ్వింపులు ఖద్దరు ఉప్మాలో ఉదారంగా వెదజల్లిన జీడిపలుకుల్లా - కంటికింపుగా పంటికి విందుగా దిల్  పసందుగా ఉంటాయి. తాలింపులో అవాల్లా పంచ్ లైన్లు చిటా పటా పేలుతుంటాయి. సుతిమెత్తగా చెంపలు నిమురుతూ చుర్రున గిల్లుతారు. కస్సుమని కరుస్తారు. చెళ్ళున కొడతారు. - మిమ్మల్ని కాదు! చదివెడువాడికీ చదివించెడువాడికీ 'సరదా' గానే ఉంటున్నా చదవబడే - భాయిలకీ, బడా బాబులకీ మాత్రం ఈ సరదా కబుర్లు జరదా కిళ్లీలా గూబలదిరేస్తాయి.

       ఊహకందని మెలికలు! మావోయిస్టులు తుపాకులు పట్టుకుని వీధుల్లో తిరగచ్చునంటూ హోంమంత్రి ప్రకటన! అందరూ అదుర్స్! కానీ వాటిల్లో బుల్లెట్లూ ఉండరాదు. ఉంటె ఎన్కౌంటర్ ద్వారా "మరణించబడుదురు" అని షరాయి కౌంటర్.

       మాయాబజార్ మ్యాజిక్ బాక్సులో చంద్రబాబుకి కాళీ కుర్చీ కనిపిస్తుంది. సిపిఐ నారాయణకి సిపియం రాఘవులు, వైస్ వర్సా - వైయ్యస్ కి రెండు దినపత్రికలు (తత్!) కనిపిస్తాయి.

      సారీ... పూర్వం ముడు నాలుగొందల పేజీల డిటెక్టివ్ నవల్సులో - హంతకుడెవరు అన్న ఒక్క ప్రశ్న కోసం కష్టపడి ఉత్కంఠతో అన్ని పేజీలు  చదివే వాళ్ళం. కొందరు శాడిస్టులు ఒకటో పేజిలోనో ఇరవై ఒకటో పేజిలోనో హంతకుడెవరో వెల్లడిస్తూ పేరుని రాసేసేవాళ్ళు! (THE BUTTLER DID IT)  ప్రాణం ఉసూరుమనేది.

       అలాగ ఇందులో పంచ్ లు అన్నీ ముందే వల్లించి మీ సరదాని చట్టుబండలు చెయ్యడం మహాపాపం. సరదాగా హాయిగా చదువుకోండి. కమ్ముల శేఖర్ గారి కాఫీ సిప్ చేస్తూ - వరూధిని మార్కు సుగంధ వక్కపొడి నవుల్తూ గోల్డ్ ఫ్లేక్ - భై - చార్మినార్ సిగిరెట్టు తలుస్తూ చదవండి. త్రిల్లై పొండి -

                                           మెనీ మెనీ హ్యాపీ 'సరదా' సండేస్!

                                                                                                                            - రమణ 

       ఆంధ్రజ్యోతి ఆదివారప్పుత్రిక - సండే బుఫే బ్రేక్ఫాస్ట్ స్ప్రెడ్ జన్ - పసంద్ - తెలుగు సినిమా ఐటెమ్సులా పప్పూ కూరలు పచ్చళ్ళు పొడుములూ పులుసూ చారూ పెరుగూ స్వీటూ హాటూ పండూలతో సర్వజనరంజకంగారుగా ఉంటుంది. కధలూ కాకరకాయలూ, భుజాలు తడుముకోవడానికి గుమ్మడికాయలు, పెసరట్టులూ గళ్ళనుడికట్టులూ ప్రివ్యూలు రివ్యూలు వేదాంతబాధలూ శృంగారగుళికలూ పిల్లల గోళీలూ వైకుంఠపాళీలూ పొళీలూ లేడీస్ చోళీలూ ఇలా కేలడోస్కోపిక్ విందు. అందులో రాజగోపాల్ గారి 'సరదాకి' ఒక హైలైట్. ఇందులో ఇంపైన నవ్వింపులు ఖద్దరు ఉప్మాలో ఉదారంగా వెదజల్లిన జీడిపలుకుల్లా - కంటికింపుగా పంటికి విందుగా దిల్  పసందుగా ఉంటాయి. తాలింపులో అవాల్లా పంచ్ లైన్లు చిటా పటా పేలుతుంటాయి. సుతిమెత్తగా చెంపలు నిమురుతూ చుర్రున గిల్లుతారు. కస్సుమని కరుస్తారు. చెళ్ళున కొడతారు. - మిమ్మల్ని కాదు! చదివెడువాడికీ చదివించెడువాడికీ 'సరదా' గానే ఉంటున్నా చదవబడే - భాయిలకీ, బడా బాబులకీ మాత్రం ఈ సరదా కబుర్లు జరదా కిళ్లీలా గూబలదిరేస్తాయి.        ఊహకందని మెలికలు! మావోయిస్టులు తుపాకులు పట్టుకుని వీధుల్లో తిరగచ్చునంటూ హోంమంత్రి ప్రకటన! అందరూ అదుర్స్! కానీ వాటిల్లో బుల్లెట్లూ ఉండరాదు. ఉంటె ఎన్కౌంటర్ ద్వారా "మరణించబడుదురు" అని షరాయి కౌంటర్.        మాయాబజార్ మ్యాజిక్ బాక్సులో చంద్రబాబుకి కాళీ కుర్చీ కనిపిస్తుంది. సిపిఐ నారాయణకి సిపియం రాఘవులు, వైస్ వర్సా - వైయ్యస్ కి రెండు దినపత్రికలు (తత్!) కనిపిస్తాయి.       సారీ... పూర్వం ముడు నాలుగొందల పేజీల డిటెక్టివ్ నవల్సులో - హంతకుడెవరు అన్న ఒక్క ప్రశ్న కోసం కష్టపడి ఉత్కంఠతో అన్ని పేజీలు  చదివే వాళ్ళం. కొందరు శాడిస్టులు ఒకటో పేజిలోనో ఇరవై ఒకటో పేజిలోనో హంతకుడెవరో వెల్లడిస్తూ పేరుని రాసేసేవాళ్ళు! (THE BUTTLER DID IT)  ప్రాణం ఉసూరుమనేది.        అలాగ ఇందులో పంచ్ లు అన్నీ ముందే వల్లించి మీ సరదాని చట్టుబండలు చెయ్యడం మహాపాపం. సరదాగా హాయిగా చదువుకోండి. కమ్ముల శేఖర్ గారి కాఫీ సిప్ చేస్తూ - వరూధిని మార్కు సుగంధ వక్కపొడి నవుల్తూ గోల్డ్ ఫ్లేక్ - భై - చార్మినార్ సిగిరెట్టు తలుస్తూ చదవండి. త్రిల్లై పొండి -                                            మెనీ మెనీ హ్యాపీ 'సరదా' సండేస్!                                                                                                                             - రమణ 

Features

  • : Saradaaki
  • : Mangu Rajagoopal
  • : Emesco Publishers
  • : EMESCO0599
  • : Paperback
  • : 2014
  • : 388
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Saradaaki

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam