Gunturu Kadhalu

Rs.350
Rs.350

Gunturu Kadhalu
INR
VISHALAN17
In Stock
350.0
Rs.350


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

            అచ్చ తెలుగు నుడికారం రుచి చూపించిన మహాకవి తిక్కన పురిటిగడ్డ గుంటూరు బౌద్ధధర్మం తొలి అడుగులు వేసింది ఈ అమరావతి సీమలోనే. కొండవీటి వైభవచరిత్ర యిక్కడిదే.

         సాహిత్య సాంస్కృతిక కళాదీపాలు వెలిగించిన మహామహులేందరో యిక్కడ నడయడారు. నడయాడుతున్నారు. అన్ని రంగాలతో పాటు సాహిత్య రంగంలోనూ గుంటూరుసీమ తెలుగునాట అగ్రగామిగా నిలిచింది. సాహిత్య ప్రక్రియలో మరీ ముఖ్యంగా కధాప్రక్రియలో గుంటూరుసీమది ప్రత్యేకించి చెప్పుకోదగిన విలక్షణ స్థానం. తొలి కధాకాంతులను అందుకోవటంతో పాటు కధావిమర్శ, అనువాద కధలను తెలుగువారికి మొదటిసారిగా పరిచయం చేసింది గుంటూరుసీమ వాసి అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు. ఇంతమంది కధకులు ఒక్క జిల్లాలోనే ఉండటం సాధ్యమా అని ఆశ్చర్యపోయే రీతిలో దాదాపు నాలుగువందల మంది కధకులు, అందునా తెలుగు కధను విద్యుత్తేజంతో వికసింపజేసిన పలువురు ప్రసిద్ధులు ఈ సీమవారే కావటం ప్రపంచం సాహిత్య చరిత్రలోనే ఒక విశిష్ట విషయం.

           కధానిక చరిత్రను ఉద్యమస్థాయిలో నిర్మించిన గుంటూరు కధకు ఇప్పుడు వందేళ్ళు. కధనే కాదు సకల సాహిత్యప్రక్రియలనూ ప్రభావితం చేసి సాహిత్యాన్ని ప్రజాపక్షం చేసిన అభ్యుదయ రచయితల సంఘం సరిగ్గా 70 ఏళ్ల క్రితం ఆవిర్భవించిందీ గుంటూరుసీమలోనే. ఈ సందర్భంగా అరసం - గుంటూరు జిల్లా శాఖ మూడు తరాల కధారచయితల 70 కధల సంకలనాన్ని పాఠకలోకానికి ప్రేమతో సమర్పిస్తోంది.

           గుంటూరుసీమ ఆత్మతోపాటు తెలుగుజాతి హృదయాన్ని ఆవిష్కరించే ఈ కధాసంకలనానిది ఇరవయ్యొకటో శతాబ్ది కధాసంకలనాల చరిత్రలోనే ఓ సుస్థిర స్థానం.

- పెనుగొండ లక్ష్మినారాయణ

            అచ్చ తెలుగు నుడికారం రుచి చూపించిన మహాకవి తిక్కన పురిటిగడ్డ గుంటూరు బౌద్ధధర్మం తొలి అడుగులు వేసింది ఈ అమరావతి సీమలోనే. కొండవీటి వైభవచరిత్ర యిక్కడిదే.          సాహిత్య సాంస్కృతిక కళాదీపాలు వెలిగించిన మహామహులేందరో యిక్కడ నడయడారు. నడయాడుతున్నారు. అన్ని రంగాలతో పాటు సాహిత్య రంగంలోనూ గుంటూరుసీమ తెలుగునాట అగ్రగామిగా నిలిచింది. సాహిత్య ప్రక్రియలో మరీ ముఖ్యంగా కధాప్రక్రియలో గుంటూరుసీమది ప్రత్యేకించి చెప్పుకోదగిన విలక్షణ స్థానం. తొలి కధాకాంతులను అందుకోవటంతో పాటు కధావిమర్శ, అనువాద కధలను తెలుగువారికి మొదటిసారిగా పరిచయం చేసింది గుంటూరుసీమ వాసి అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు. ఇంతమంది కధకులు ఒక్క జిల్లాలోనే ఉండటం సాధ్యమా అని ఆశ్చర్యపోయే రీతిలో దాదాపు నాలుగువందల మంది కధకులు, అందునా తెలుగు కధను విద్యుత్తేజంతో వికసింపజేసిన పలువురు ప్రసిద్ధులు ఈ సీమవారే కావటం ప్రపంచం సాహిత్య చరిత్రలోనే ఒక విశిష్ట విషయం.            కధానిక చరిత్రను ఉద్యమస్థాయిలో నిర్మించిన గుంటూరు కధకు ఇప్పుడు వందేళ్ళు. కధనే కాదు సకల సాహిత్యప్రక్రియలనూ ప్రభావితం చేసి సాహిత్యాన్ని ప్రజాపక్షం చేసిన అభ్యుదయ రచయితల సంఘం సరిగ్గా 70 ఏళ్ల క్రితం ఆవిర్భవించిందీ గుంటూరుసీమలోనే. ఈ సందర్భంగా అరసం - గుంటూరు జిల్లా శాఖ మూడు తరాల కధారచయితల 70 కధల సంకలనాన్ని పాఠకలోకానికి ప్రేమతో సమర్పిస్తోంది.            గుంటూరుసీమ ఆత్మతోపాటు తెలుగుజాతి హృదయాన్ని ఆవిష్కరించే ఈ కధాసంకలనానిది ఇరవయ్యొకటో శతాబ్ది కధాసంకలనాల చరిత్రలోనే ఓ సుస్థిర స్థానం. - పెనుగొండ లక్ష్మినారాయణ

Features

  • : Gunturu Kadhalu
  • : Penugonda Lakshminarayana
  • : Andrapradesh Abyudaya Rachaitala Samgham
  • : VISHALAN17
  • : Paperback
  • : December 2013
  • : 567
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gunturu Kadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam