Pathakulu Naku Rasina Uttaralu

By Ranganayakamma (Author)
Rs.50
Rs.50

Pathakulu Naku Rasina Uttaralu
INR
APHRNY0044
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

           పాఠకులు నాకు ఉత్తరాలు రాయడం నేను "పల్లెటూరు" కథ రాసినప్పటి నుంచీ ప్రారంభమైంది. అప్పుడు నాకు 18వ సంవత్సరం ఉండొచ్చు. అంతకు ముందు కుడా 2, 3 చిన్న కథలు రాశాను. కానీ "పల్లెటూరు" కొంచెం పెద్దది. "ప్రేమ లేకుండా పెళ్లి ఉండకూడదు" అని చెప్పిన కథ అది. పాఠకులకు అది బాగా నచ్చింది. 

          నాకు మార్క్సిజం పరిచయమయ్యాక  'విషవృక్షమే'  మొదటి రచన. తర్వాత  'కాపిటల్ పరిచయాలు' 5 భాగాలు అయ్యే వరకూ అదే పని సాగింది. పాఠకుల ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. నా జవాబులు వెళ్తూనే ఉన్నాయి.

          అసలు నేను పాఠకుల గురించి ఏమనుకు౦టానంటే, పుస్తకాలు తరచుగా పునర్ముద్రణలు అవుతున్నాయంటే, పాఠకులు వాటిని కొంటున్నారని అర్థమే. కొంటున్నారు సరే, చదువుతున్నారా? నాలుగు పేజీలు  అటూ ఇటూ తిప్పి పడేస్తున్నారా? చదివితే అర్థమవుతున్నాయా? అర్థమైతే, సంతోషిస్తున్నారా? ఒక పుస్తకం చదవకముందు కన్నా, చదివిన తర్వాత వాళ్లకి తమలో కానీ, బయట కానీ ఏమైనా మార్పు కనబడుతుందా? చదివినప్పుడు తాత్కాలికంగా కలిగే సంతోషమేనా, భావాల్లో నిజంగా స్థిరపడే మార్పులు జరుగుతున్నాయా - ఇటువంటి ప్రశ్నలే ఉంటాయి నాకు.

        పాఠకులకు నా పుస్తకాలు అర్థమవుతున్నాయా? చదివే విషయాలతో ఎకీభవిస్తున్నారా? నా రాతల వల్ల ఏదైనా ఉపయోగం ఉందా? వాటి వల్ల వారి ఆలోచనల్లో మార్పు జరిగిందా? - అనే నా సందేహాలకు జవాబులు ఉన్నాయి ఈ ఉత్తరాల్లో! నాకు ఈ పుస్తకం పని సంతోషంగా అయింది.

 రచయితలు ఇలా చేస్తే, పాఠకుల స్పందనలు ఇతర పాఠకులకు తెలుస్తాయి.

- రంగనాయకమ్మ 

 

           పాఠకులు నాకు ఉత్తరాలు రాయడం నేను "పల్లెటూరు" కథ రాసినప్పటి నుంచీ ప్రారంభమైంది. అప్పుడు నాకు 18వ సంవత్సరం ఉండొచ్చు. అంతకు ముందు కుడా 2, 3 చిన్న కథలు రాశాను. కానీ "పల్లెటూరు" కొంచెం పెద్దది. "ప్రేమ లేకుండా పెళ్లి ఉండకూడదు" అని చెప్పిన కథ అది. పాఠకులకు అది బాగా నచ్చింది.            నాకు మార్క్సిజం పరిచయమయ్యాక  'విషవృక్షమే'  మొదటి రచన. తర్వాత  'కాపిటల్ పరిచయాలు' 5 భాగాలు అయ్యే వరకూ అదే పని సాగింది. పాఠకుల ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. నా జవాబులు వెళ్తూనే ఉన్నాయి.           అసలు నేను పాఠకుల గురించి ఏమనుకు౦టానంటే, పుస్తకాలు తరచుగా పునర్ముద్రణలు అవుతున్నాయంటే, పాఠకులు వాటిని కొంటున్నారని అర్థమే. కొంటున్నారు సరే, చదువుతున్నారా? నాలుగు పేజీలు  అటూ ఇటూ తిప్పి పడేస్తున్నారా? చదివితే అర్థమవుతున్నాయా? అర్థమైతే, సంతోషిస్తున్నారా? ఒక పుస్తకం చదవకముందు కన్నా, చదివిన తర్వాత వాళ్లకి తమలో కానీ, బయట కానీ ఏమైనా మార్పు కనబడుతుందా? చదివినప్పుడు తాత్కాలికంగా కలిగే సంతోషమేనా, భావాల్లో నిజంగా స్థిరపడే మార్పులు జరుగుతున్నాయా - ఇటువంటి ప్రశ్నలే ఉంటాయి నాకు.         పాఠకులకు నా పుస్తకాలు అర్థమవుతున్నాయా? చదివే విషయాలతో ఎకీభవిస్తున్నారా? నా రాతల వల్ల ఏదైనా ఉపయోగం ఉందా? వాటి వల్ల వారి ఆలోచనల్లో మార్పు జరిగిందా? - అనే నా సందేహాలకు జవాబులు ఉన్నాయి ఈ ఉత్తరాల్లో! నాకు ఈ పుస్తకం పని సంతోషంగా అయింది.  రచయితలు ఇలా చేస్తే, పాఠకుల స్పందనలు ఇతర పాఠకులకు తెలుస్తాయి. - రంగనాయకమ్మ   

Features

  • : Pathakulu Naku Rasina Uttaralu
  • : Ranganayakamma
  • : Sweet Home Publications
  • : APHRNY0044
  • : Paperback
  • : 2015
  • : 181
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Pathakulu Naku Rasina Uttaralu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam