Naishadhiya Charitam

Rs.500
Rs.500

Naishadhiya Charitam
INR
MANIMN5006
In Stock
500.0
Rs.500


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

నైషధీయచరితమ్ - ప్రథమః సర్గః

ఓం
శ్రీరామచన్దాయ నమః
శ్రీశ్రీహర్షుఁడు (12 శ.)

 

- గరిమెళ్ళ సోమయాజులు శర్మ

సంస్కృతసాహిత్యములో నిద్దఱు హర్షులు ప్రసిద్ధులు. మొదటివాఁడు హర్షుఁడు. క్షత్రియుఁడు. 7వ శతాబ్దికిఁ జెందినవాఁడు. రెండవ వాఁడు శ్రీహర్షుఁడు. బ్రాహ్మణుఁడు. 12వ శతాబ్దమునకుఁ జెందినవాఁడు.

హర్షుఁడు (క్రీ.శ. 606-647) -

ఈ మహానుభావుఁ డుత్తరభారతదేశమునంతటి నేకచ్ఛత్రాధిపత్యముగా నేలిన చక్రవర్తి. ధానేశ్వరము (స్థాణ్వీశ్వరము) రాజధాని. ఇతని తల్లి యశోమతి. తండ్రి ప్రభాకరవర్ధనుఁడు. అన్న రాజ్యవర్ధనుఁడు. విదేశములు కేఁగి బౌద్ధ ధర్మములను బ్రచారము చేసిన విదుషీమణి రాజశ్రీ చెల్లెలు. ఈయన పూర్తిపేరు హర్షవర్ధనుఁడు.

ఇతని పేరులో శ్రీకారము స్వతఃసిద్ధముగా లేదు. మంగళప్రదముగల శ్రీకారము చేరుటచే శ్రీహర్షుఁడైనాఁడు.

శ్లో॥ 'శ్రీహర్ష నిపుణః కవిః పరిషదప్యేషా గుణగ్రాహిణీ' అని నాగానందము.

ఈ మహాకవి 1. నాగానందము, 2. ప్రియదర్శిక, 3. రత్నావళి యను 3 నాటకములను రచించెను. 1) బాణుఁడు, 2) మయూరుఁడు, 3) మాతంగదివాకరుఁడు, 4) ధావకుఁడు మొదలగు వా రీతని యాస్థానమును ధగద్ధగ లాడించిన విద్వత్కవులు. ఇతని కాలము 7వ శతాబ్దము.

శ్రీశ్రీహర్షుఁడు

ఈయన పేరులోనే శ్రీకారము స్వతస్సిద్ధముగాఁ గలదు. మంగళప్రదమగు మఱియొక శ్రీకారము చేరుటవలన శ్రీశ్రీహర్షుఁ డైనాఁడు.

శ్లో॥ తాంబూలద్వయమాననం చ లభతే యః కన్యకుజ్జేశ్వరా
     యః సాక్షాత్కురుతే సమాధిషు పరబ్రహ్మ ప్రమోదార్జవమ్ ।
     యత్కావ్యమ్ మధువర్షి ధర్షితపరాస్తర్కేషు యస్యోక్తయః
     శ్రీశ్రీహర్షకవేః కృతిః కృతిముదే తస్యాభ్యుదీయాదియమ్ ॥

అని నైషధమునందు, ఖండనఖండఖాద్యము నందుఁ జివరలోఁ జెప్పుకొనినాఁడు...................

నైషధీయచరితమ్ - ప్రథమః సర్గః ఓం శ్రీరామచన్దాయ నమః శ్రీశ్రీహర్షుఁడు (12 శ.)   - గరిమెళ్ళ సోమయాజులు శర్మ సంస్కృతసాహిత్యములో నిద్దఱు హర్షులు ప్రసిద్ధులు. మొదటివాఁడు హర్షుఁడు. క్షత్రియుఁడు. 7వ శతాబ్దికిఁ జెందినవాఁడు. రెండవ వాఁడు శ్రీహర్షుఁడు. బ్రాహ్మణుఁడు. 12వ శతాబ్దమునకుఁ జెందినవాఁడు. హర్షుఁడు (క్రీ.శ. 606-647) - ఈ మహానుభావుఁ డుత్తరభారతదేశమునంతటి నేకచ్ఛత్రాధిపత్యముగా నేలిన చక్రవర్తి. ధానేశ్వరము (స్థాణ్వీశ్వరము) రాజధాని. ఇతని తల్లి యశోమతి. తండ్రి ప్రభాకరవర్ధనుఁడు. అన్న రాజ్యవర్ధనుఁడు. విదేశములు కేఁగి బౌద్ధ ధర్మములను బ్రచారము చేసిన విదుషీమణి రాజశ్రీ చెల్లెలు. ఈయన పూర్తిపేరు హర్షవర్ధనుఁడు. ఇతని పేరులో శ్రీకారము స్వతఃసిద్ధముగా లేదు. మంగళప్రదముగల శ్రీకారము చేరుటచే శ్రీహర్షుఁడైనాఁడు. శ్లో॥ 'శ్రీహర్ష నిపుణః కవిః పరిషదప్యేషా గుణగ్రాహిణీ' అని నాగానందము. ఈ మహాకవి 1. నాగానందము, 2. ప్రియదర్శిక, 3. రత్నావళి యను 3 నాటకములను రచించెను. 1) బాణుఁడు, 2) మయూరుఁడు, 3) మాతంగదివాకరుఁడు, 4) ధావకుఁడు మొదలగు వా రీతని యాస్థానమును ధగద్ధగ లాడించిన విద్వత్కవులు. ఇతని కాలము 7వ శతాబ్దము. శ్రీశ్రీహర్షుఁడు ఈయన పేరులోనే శ్రీకారము స్వతస్సిద్ధముగాఁ గలదు. మంగళప్రదమగు మఱియొక శ్రీకారము చేరుటవలన శ్రీశ్రీహర్షుఁ డైనాఁడు. శ్లో॥ తాంబూలద్వయమాననం చ లభతే యః కన్యకుజ్జేశ్వరా     యః సాక్షాత్కురుతే సమాధిషు పరబ్రహ్మ ప్రమోదార్జవమ్ ।     యత్కావ్యమ్ మధువర్షి ధర్షితపరాస్తర్కేషు యస్యోక్తయః      శ్రీశ్రీహర్షకవేః కృతిః కృతిముదే తస్యాభ్యుదీయాదియమ్ ॥ అని నైషధమునందు, ఖండనఖండఖాద్యము నందుఁ జివరలోఁ జెప్పుకొనినాఁడు...................

Features

  • : Naishadhiya Charitam
  • : Sri Mahakavi Sri Sriharsha Pranitam
  • : Mohan Publications
  • : MANIMN5006
  • : paparback
  • : Dec, 2023
  • : 467
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Naishadhiya Charitam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam