Naa Gnapakalu

By Sri S V S (Author)
Rs.54
Rs.54

Naa Gnapakalu
INR
MANIMN5065
In Stock
54.0
Rs.54


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

వంశచరిత్ర

మాది విజయనగరం. మా వంశ చరిత్ర తెలియజేసే ముందు విజయనగరరాజుల గురించి చెప్పాలి. విజయనగర రాజులు గజపతులు. శ్రీకృష్ణదేవరాయలు గజపతులను ఓడించి, జయస్తంభం సింహాచలం కొండమీద స్థాపించాడు. ఆ గజపతుల వంశంలోని వాడే పూసపాటి విజయరామరాజు. బొబ్బిలి యుద్ధం వీరికాలంలోనే జరిగింది. ఫ్రెంచిదొర బుస్సీ కారణంగా ఈ యుద్ధం జరిగింది. ఈ బుస్సీ కథనే చెప్పి 'బూచి' అని తల్లులు పిల్లల్ని భయపెడుతూ ఉంటారు.

బొబ్బిలి యుద్ధం జరిగిన తరువాత శిబిరంలో విజయరామరాజు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన పరిపాలనలో మా తాతగారు చొదిమెళ్ల శ్రీరామమూర్తిగారు మంత్రిగా ఉన్నారు. ఆయన, విజయరామరాజు కుమారుడు ఆనందగజపతి కూడా శిబిరంలో ఉన్నారు. యుద్ధంలో విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు.

బొబ్బిలివారి బావమరిది తాండ్రపాపారాయుడు యుద్ధసమయంలో బొబ్బిలిలో లేడు. విషయం తెలిసి బొబ్బిలి వచ్చాడు. తనవారందరూ చనిపోవడం చూసి చాలా బాధపడ్డాడు. శిబిరంలో నిద్రిస్తూన్న విజయరామరాజు వద్దకు వచ్చాడు. అతనిని నిద్రలేపి బాకుతో పొడిచి చంపి, తనవారెవరూ జీవించి ఉండని కారణంగా తాను కూడా పొడుచుకుని చనిపోయాడు. చనిపోతూ విజయరామరాజు తన కుమారుడైన ఆనందగజపతిని మా తాత గారికి అప్పగించి, యుక్తవయస్సులో ఆయనకు పట్టాభిషేకం జరిపించి, మంత్రిగా ఉండమని ఆదేశించాడు. మా తాతగారు ఆనందగజపతిని విజయనగరం కోటకు రహస్యంగా తీసుకునివచ్చారు. యుక్తవయస్సు వచ్చాక పట్టాభిషేకం జరిపించారు..........

వంశచరిత్ర మాది విజయనగరం. మా వంశ చరిత్ర తెలియజేసే ముందు విజయనగరరాజుల గురించి చెప్పాలి. విజయనగర రాజులు గజపతులు. శ్రీకృష్ణదేవరాయలు గజపతులను ఓడించి, జయస్తంభం సింహాచలం కొండమీద స్థాపించాడు. ఆ గజపతుల వంశంలోని వాడే పూసపాటి విజయరామరాజు. బొబ్బిలి యుద్ధం వీరికాలంలోనే జరిగింది. ఫ్రెంచిదొర బుస్సీ కారణంగా ఈ యుద్ధం జరిగింది. ఈ బుస్సీ కథనే చెప్పి 'బూచి' అని తల్లులు పిల్లల్ని భయపెడుతూ ఉంటారు. బొబ్బిలి యుద్ధం జరిగిన తరువాత శిబిరంలో విజయరామరాజు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన పరిపాలనలో మా తాతగారు చొదిమెళ్ల శ్రీరామమూర్తిగారు మంత్రిగా ఉన్నారు. ఆయన, విజయరామరాజు కుమారుడు ఆనందగజపతి కూడా శిబిరంలో ఉన్నారు. యుద్ధంలో విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు. బొబ్బిలివారి బావమరిది తాండ్రపాపారాయుడు యుద్ధసమయంలో బొబ్బిలిలో లేడు. విషయం తెలిసి బొబ్బిలి వచ్చాడు. తనవారందరూ చనిపోవడం చూసి చాలా బాధపడ్డాడు. శిబిరంలో నిద్రిస్తూన్న విజయరామరాజు వద్దకు వచ్చాడు. అతనిని నిద్రలేపి బాకుతో పొడిచి చంపి, తనవారెవరూ జీవించి ఉండని కారణంగా తాను కూడా పొడుచుకుని చనిపోయాడు. చనిపోతూ విజయరామరాజు తన కుమారుడైన ఆనందగజపతిని మా తాత గారికి అప్పగించి, యుక్తవయస్సులో ఆయనకు పట్టాభిషేకం జరిపించి, మంత్రిగా ఉండమని ఆదేశించాడు. మా తాతగారు ఆనందగజపతిని విజయనగరం కోటకు రహస్యంగా తీసుకునివచ్చారు. యుక్తవయస్సు వచ్చాక పట్టాభిషేకం జరిపించారు..........

Features

  • : Naa Gnapakalu
  • : Sri S V S
  • : Sri Raghvendra Publications
  • : MANIMN5065
  • : paparback
  • : Dec, 2023
  • : 96
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Naa Gnapakalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam