కృష్ణశాస్త్రి జీవితం – సాంస్కృతిక నేపథ్యం
భావకవిత్వాన్ని ఉద్యమంగా తీర్చిదిద్దిన దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిగారు 1-11-1897న కార్తీక శుద్ధ అష్టమినాడు పిఠాపురం దగ్గర చంద్రంపాలెంలో జన్మించారు. తండ్రి దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి అనే తమ్మన్నశాస్త్రిగారు. పెదతండ్రి దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి. దేవులపల్లి సోదరకవులుగా ప్రసిద్ధులైన వీరి పూర్వీకులు కృష్ణాజిల్లా ఆగిరిపల్లికి చెందినవారు.
కృష్ణశాస్త్రిగారి పూర్వీకులంతా 'వేదంబుల శాస్త్రంబుల వాదంబుల నెదురులేని వారలే' 'సీతావర పదసేవన విధాన పావనులే." కావ్యాలూ, నాటకాలూ రచించిన దేవులపల్లి కులాగ్రణి వేంకట సూరిమణి, ఆ తర్వాత జగన్నాధార్యుడు గాధా బోధనాశాలి. ' వేంకట రామశాస్త్రి, రామశాస్త్రి అందరూ కళావేత్తలే. వేంకట రామశాస్త్రిగారు సంగీత సాహిత్యాలలో నిష్ణాతులు. ' కృష్ణశాస్త్రిగారి పూర్వీకుల కళాసంస్కారంలో సంప్రదాయం మెరుగులు దిద్దుకుంది.
2. bid - 40 వ పద్యము
3. శ్రీమహేంద్రవిజయము - దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి. ప్రథమాశ్వాసము - 44 వ పద్యము
4. Ibid - 47వ పద్యము
5. lbid - 58వ పద్యము.........................
కృష్ణశాస్త్రి జీవితం – సాంస్కృతిక నేపథ్యం భావకవిత్వాన్ని ఉద్యమంగా తీర్చిదిద్దిన దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిగారు 1-11-1897న కార్తీక శుద్ధ అష్టమినాడు పిఠాపురం దగ్గర చంద్రంపాలెంలో జన్మించారు. తండ్రి దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి అనే తమ్మన్నశాస్త్రిగారు. పెదతండ్రి దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి. దేవులపల్లి సోదరకవులుగా ప్రసిద్ధులైన వీరి పూర్వీకులు కృష్ణాజిల్లా ఆగిరిపల్లికి చెందినవారు. కృష్ణశాస్త్రిగారి పూర్వీకులంతా 'వేదంబుల శాస్త్రంబుల వాదంబుల నెదురులేని వారలే' 'సీతావర పదసేవన విధాన పావనులే." కావ్యాలూ, నాటకాలూ రచించిన దేవులపల్లి కులాగ్రణి వేంకట సూరిమణి, ఆ తర్వాత జగన్నాధార్యుడు గాధా బోధనాశాలి. ' వేంకట రామశాస్త్రి, రామశాస్త్రి అందరూ కళావేత్తలే. వేంకట రామశాస్త్రిగారు సంగీత సాహిత్యాలలో నిష్ణాతులు. ' కృష్ణశాస్త్రిగారి పూర్వీకుల కళాసంస్కారంలో సంప్రదాయం మెరుగులు దిద్దుకుంది. శ్రీ మహేంద్ర విజయం - దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి .. ప్రథమాశ్వాసం - 39వ పద్యము 2. bid - 40 వ పద్యము 3. శ్రీమహేంద్రవిజయము - దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి. ప్రథమాశ్వాసము - 44 వ పద్యము 4. Ibid - 47వ పద్యము 5. lbid - 58వ పద్యము.........................© 2017,www.logili.com All Rights Reserved.