మిగులు
ఆదివారం నాడు తల్లిదండ్రులతో బయల్దేరింది బుంగి. మనసు ఉరకలేస్తుంది. వాహనం దూసుకెళ్తుంది. గంట ప్రయాణం సాగింది. రోడ్డు పక్కన దేవస్థానం బోర్డు స్వాగతిస్తూ కన పడింది. రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు వెలిసాయి. కింది నుండి గుడి అందంగా కనిపిస్తుంది. కారు నేరుగా గుడిముందు ఆగింది. ట్యాచ్ల ద్వారా నీళ్ళు వస్తున్నాయి. కాళ్ళు కడుక్కొని, గుళ్ళోకి వెళ్ళి పూజయ్యాక బయటకు వచ్చారు.
"డాడీ! కొండ చాలా మారింది కదా”
""అవును"
"చెట్లన్నీ పోయాయి. ఉన్నవాటిలో పచ్చదనం లేదు. గుడివెనుక చిన్న తోట ఉంది. సారిక లేదు. పాలదోనె లేదు. అసలు కొండే మాయమయింది. అటుచూడు అక్కడేవో మిషన్లున్నాయి."
"అవి స్టోన్ క్రషింగ్ మిషన్లు. కొండను కొట్టి రాయిని తీసుకెళ్తారు. దేన్ని కూడా మిగలరు.”
"ఎందుకు ? ఎటు?
"ఇక్కడిరాయి విలువైంది. నిర్మాణాలకు పనికొస్తుంది. బండ పగులగొట్టి సైజులుగా మార్చి అమ్ముతున్నారు”
"చెట్లను కొడితే, మరిన్ని చెట్లను పెంచవచ్చు. కొండలను పిండిచేస్తే తిరిగి వాటిని పెంచేదెలా?"
"దేవుని గుట్టను కొడితే పాపం తగలదా?”
"పాపం పుణ్యం దేవుడెరుగు. మన దగ్గర వర్షం పడుతుందా ?” "మబ్బులొస్తున్నాయి. కాని వర్షం పడుతలేదు"
"నీవు పాఠాల్లో చదివినట్లు అడవులు, గుట్టలు అంతరిస్తే వర్షం పడదు" “ఇట్లెందుకు చేస్తున్నరు”
"అభివృద్ధి పేరున అడవుల్ని, ఆధునికత కోసం గుట్టల్ని నాశనం చేస్తున్నారు. అది వ్యాపార దారి, నీ కిప్పుడు చెప్పినా అర్థం కాదు." అంటూ ఇంటి వైపు కారును మళ్ళించాడు.
నీళ్ళు నీడలు రాళ్ళును నికరముగను
మిగుల నీయక మనుజులు మింగివేయ
అడవులన్నియు అణగారె అవని లోన
కశప చెప్పిన కథనమ్ము కాంతి పథము
మిగులు ఆదివారం నాడు తల్లిదండ్రులతో బయల్దేరింది బుంగి. మనసు ఉరకలేస్తుంది. వాహనం దూసుకెళ్తుంది. గంట ప్రయాణం సాగింది. రోడ్డు పక్కన దేవస్థానం బోర్డు స్వాగతిస్తూ కన పడింది. రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు వెలిసాయి. కింది నుండి గుడి అందంగా కనిపిస్తుంది. కారు నేరుగా గుడిముందు ఆగింది. ట్యాచ్ల ద్వారా నీళ్ళు వస్తున్నాయి. కాళ్ళు కడుక్కొని, గుళ్ళోకి వెళ్ళి పూజయ్యాక బయటకు వచ్చారు. "డాడీ! కొండ చాలా మారింది కదా” ""అవును" "చెట్లన్నీ పోయాయి. ఉన్నవాటిలో పచ్చదనం లేదు. గుడివెనుక చిన్న తోట ఉంది. సారిక లేదు. పాలదోనె లేదు. అసలు కొండే మాయమయింది. అటుచూడు అక్కడేవో మిషన్లున్నాయి." "అవి స్టోన్ క్రషింగ్ మిషన్లు. కొండను కొట్టి రాయిని తీసుకెళ్తారు. దేన్ని కూడా మిగలరు.” "ఎందుకు ? ఎటు? "ఇక్కడిరాయి విలువైంది. నిర్మాణాలకు పనికొస్తుంది. బండ పగులగొట్టి సైజులుగా మార్చి అమ్ముతున్నారు” "చెట్లను కొడితే, మరిన్ని చెట్లను పెంచవచ్చు. కొండలను పిండిచేస్తే తిరిగి వాటిని పెంచేదెలా?" "దేవుని గుట్టను కొడితే పాపం తగలదా?” "పాపం పుణ్యం దేవుడెరుగు. మన దగ్గర వర్షం పడుతుందా ?” "మబ్బులొస్తున్నాయి. కాని వర్షం పడుతలేదు" "నీవు పాఠాల్లో చదివినట్లు అడవులు, గుట్టలు అంతరిస్తే వర్షం పడదు" “ఇట్లెందుకు చేస్తున్నరు” "అభివృద్ధి పేరున అడవుల్ని, ఆధునికత కోసం గుట్టల్ని నాశనం చేస్తున్నారు. అది వ్యాపార దారి, నీ కిప్పుడు చెప్పినా అర్థం కాదు." అంటూ ఇంటి వైపు కారును మళ్ళించాడు. నీళ్ళు నీడలు రాళ్ళును నికరముగను మిగుల నీయక మనుజులు మింగివేయ అడవులన్నియు అణగారె అవని లోన కశప చెప్పిన కథనమ్ము కాంతి పథము© 2017,www.logili.com All Rights Reserved.