ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ వినూత్న పరిశోధనలకు నిలయం. ఇక్కడ రాయప్రోలు సుబ్బారావు, ఖండవల్లి లక్ష్మీరంజనం, ఆనందమూర్తి, యశోదారెడ్డి, సి. నారాయణరెడ్డి, డా. ఎన్. గోపి వంటి మహామహులు తమ పరిశోధనలతో సరికొత్త ఒరవడిని సృష్టించారు. వారు చూపిన దారిలో ఎన్నో పరిశోధనలు పురుడుపోసుకున్నాయి. నేటికీ ఆ జ్ఞాన వారసత్వం కొనసాగుతున్నది. ఈ క్రమంలో డా. మహేందర్ బర్ల అస్తిత్వ సాహిత్య పరిరక్షణలో భాగంగా కురుమల సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తూ పరిశోధన కొనసాగించాడు.
తెలంగాణ సాంస్కృతిక సౌరభాలను వెదజల్లే కళారూపాలలో ఒగ్గుకథ ఒకటి. ఒగ్గుడోలు మ్రోగుతుంటే దాని లయను అనుసరిస్తూ పాట, ఆట సాగుతుంది. ఒగ్గుకథ అనగానే గుర్తుకువచ్చేది కురుమలే. వారి సాహిత్యం, సంస్కృతి-జీవనచిత్రణను పరిశోధనాత్మక దృష్టితో భిన్న కోణాల్లో అందించాడు మహేందర్. కురుమ, కురుబ వంటి సమానార్ధక నామాలతో పిలువబడే కురుమల అస్తిత్వ గాథలను పరిచయం చేస్తూ ఆదిరెడ్డి నీలమ్మల సంతానమైన మల్లన్న కథను సవివరంగా వినిపిస్తాడు. మూలాల వేళ్ళను పట్టుకొని కురుమకుల ఆవిర్భావ గాథను ఒక కళాకారుడి వలె విశ్లేషణ చేస్తాడు. కురుమలు పాలకులుగా పలు రాజవంశాలను ఉదాహరణలుగా చేసి సాక్ష్యాలను చూపిస్తాడు. గొర్ల కాపరులుగా తమ వృత్తిని నిర్వహించేటప్పుడు వారు ఎదుర్కొనే సాదక బాధకాలను, వారికి సహకరించే జంతు జాలాన్ని, వాటి సహకారాన్ని గురించి ఆప్యాయంగా చెబుతాడు. ఒగ్గోళ్ళు, బీరన్నలు పూజారులుగా వారు పాడే కథాగానానికి ఊగిపోయే జనుల హృదయ స్వచ్ఛతను పల్లెతనంతో పాఠకులకు పరిచయం చేసిన గ్రంథమిది......................
ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ వినూత్న పరిశోధనలకు నిలయం. ఇక్కడ రాయప్రోలు సుబ్బారావు, ఖండవల్లి లక్ష్మీరంజనం, ఆనందమూర్తి, యశోదారెడ్డి, సి. నారాయణరెడ్డి, డా. ఎన్. గోపి వంటి మహామహులు తమ పరిశోధనలతో సరికొత్త ఒరవడిని సృష్టించారు. వారు చూపిన దారిలో ఎన్నో పరిశోధనలు పురుడుపోసుకున్నాయి. నేటికీ ఆ జ్ఞాన వారసత్వం కొనసాగుతున్నది. ఈ క్రమంలో డా. మహేందర్ బర్ల అస్తిత్వ సాహిత్య పరిరక్షణలో భాగంగా కురుమల సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తూ పరిశోధన కొనసాగించాడు. తెలంగాణ సాంస్కృతిక సౌరభాలను వెదజల్లే కళారూపాలలో ఒగ్గుకథ ఒకటి. ఒగ్గుడోలు మ్రోగుతుంటే దాని లయను అనుసరిస్తూ పాట, ఆట సాగుతుంది. ఒగ్గుకథ అనగానే గుర్తుకువచ్చేది కురుమలే. వారి సాహిత్యం, సంస్కృతి-జీవనచిత్రణను పరిశోధనాత్మక దృష్టితో భిన్న కోణాల్లో అందించాడు మహేందర్. కురుమ, కురుబ వంటి సమానార్ధక నామాలతో పిలువబడే కురుమల అస్తిత్వ గాథలను పరిచయం చేస్తూ ఆదిరెడ్డి నీలమ్మల సంతానమైన మల్లన్న కథను సవివరంగా వినిపిస్తాడు. మూలాల వేళ్ళను పట్టుకొని కురుమకుల ఆవిర్భావ గాథను ఒక కళాకారుడి వలె విశ్లేషణ చేస్తాడు. కురుమలు పాలకులుగా పలు రాజవంశాలను ఉదాహరణలుగా చేసి సాక్ష్యాలను చూపిస్తాడు. గొర్ల కాపరులుగా తమ వృత్తిని నిర్వహించేటప్పుడు వారు ఎదుర్కొనే సాదక బాధకాలను, వారికి సహకరించే జంతు జాలాన్ని, వాటి సహకారాన్ని గురించి ఆప్యాయంగా చెబుతాడు. ఒగ్గోళ్ళు, బీరన్నలు పూజారులుగా వారు పాడే కథాగానానికి ఊగిపోయే జనుల హృదయ స్వచ్ఛతను పల్లెతనంతో పాఠకులకు పరిచయం చేసిన గ్రంథమిది......................© 2017,www.logili.com All Rights Reserved.