ఒకటో అధ్యాయం
అవి నేను బస్తీలో పనేమీలేక పస్తులుంటూ తిరుగుతూన్న రోజులు. అది సాధారణమైన బస్తీకాదు. ఒక విచిత్రమైన నగరం. అక్కడ కొద్దికాలం ఉంటేచాలు. అనేక అనుభవాలు కలుగుతాయి. వాటిని మర్చిపోవడం ఎవరికీ సాధ్యంకాదు.
అది నగరంలో ఒక మూల గొట్టుప్రదేశం. హైకోర్టుకు, మార్కెట్టుకు, స్టేషనుకు, బస్ స్టాండుకు అన్నిటికీ దూరంగా ఉంటుంది. అక్కడ ఉండేవాళ్ళంతా అలగా జనం. రిక్షావాళ్ళు, జట్కావాళ్ళు, రింగ్జీ లీడర్లు, రికామిగా తిరిగేవాళ్ళు, త్రాగుబోతులు, దగాకోర్లు, తుంటర్లు, జూదగాళ్ళు, రౌడీలు, రంగసాన్లు ఇలాంటివాళ్ళందరికీ ఆ ప్రదేశం నిలయం. అన్నీ సందులు, గొందులు; మురికికాలవలు, పెంటకుప్పలు; అక్కడ విద్యుద్దీపాలుకూడా లేవు. అక్కడక్కడ లాంతరు స్థంభాలుమాత్రం వెలుగుతుంటాయి. ఏం చేయను మరి? గత్యంతరంలేదు. నగరంలో చౌకగా ఇళ్లెక్కడ దొరుకుతాయి ? అందుకనే నేనక్కడ ఒకమేడ పైభాగంలో అద్దెకుంటున్నాను.
అదొక పాతమేడ. పడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ మేడను ఒక్కక్షణం చూస్తూ నిలుచుంటే మనకు తెలియకుండానే యేదో భయం కలుగుతుంది. ఒక పెద్ద భూతం నల్లగా జుట్టు విరయబోసుకొని ఏడుస్తూ ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందామేడ. అందుకనే అందరూ దాన్ని 'దయ్యాల మేడ' అని పిలుస్తుంటారు. పై అంతస్తులో C దాదాపు పదిగదులున్నాయి. చిన్న చిన్న గదులు. ఒక్కొక్క గదిలో ఒక మనిషికంటే ఎక్కువమంది ఉండడానికి వీల్లేదు. అన్నిటి కంటే వెనకాల ఉన్న గదిలో నా మకాం. అందులో నేను అయిదారు నెలల బట్టీ ఉంటున్నాను. మిగతా గదుల్లో అప్పనంగా ఎవరూ ఉండరు. ఎక్కువ అద్దె ఇచ్చుకోలేని నాబోటి దౌర్భాగ్యులెవరో అప్పుడప్పుడు వస్తుంటారు. వాళ్ళ పనులు కాగానే వెళ్ళిపోతుంటారు. ఒక్కొక్క గదికి అద్దె నెలకు అయిదు రూపాయలు.........................
ఒకటో అధ్యాయం అవి నేను బస్తీలో పనేమీలేక పస్తులుంటూ తిరుగుతూన్న రోజులు. అది సాధారణమైన బస్తీకాదు. ఒక విచిత్రమైన నగరం. అక్కడ కొద్దికాలం ఉంటేచాలు. అనేక అనుభవాలు కలుగుతాయి. వాటిని మర్చిపోవడం ఎవరికీ సాధ్యంకాదు. అది నగరంలో ఒక మూల గొట్టుప్రదేశం. హైకోర్టుకు, మార్కెట్టుకు, స్టేషనుకు, బస్ స్టాండుకు అన్నిటికీ దూరంగా ఉంటుంది. అక్కడ ఉండేవాళ్ళంతా అలగా జనం. రిక్షావాళ్ళు, జట్కావాళ్ళు, రింగ్జీ లీడర్లు, రికామిగా తిరిగేవాళ్ళు, త్రాగుబోతులు, దగాకోర్లు, తుంటర్లు, జూదగాళ్ళు, రౌడీలు, రంగసాన్లు ఇలాంటివాళ్ళందరికీ ఆ ప్రదేశం నిలయం. అన్నీ సందులు, గొందులు; మురికికాలవలు, పెంటకుప్పలు; అక్కడ విద్యుద్దీపాలుకూడా లేవు. అక్కడక్కడ లాంతరు స్థంభాలుమాత్రం వెలుగుతుంటాయి. ఏం చేయను మరి? గత్యంతరంలేదు. నగరంలో చౌకగా ఇళ్లెక్కడ దొరుకుతాయి ? అందుకనే నేనక్కడ ఒకమేడ పైభాగంలో అద్దెకుంటున్నాను. అదొక పాతమేడ. పడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ మేడను ఒక్కక్షణం చూస్తూ నిలుచుంటే మనకు తెలియకుండానే యేదో భయం కలుగుతుంది. ఒక పెద్ద భూతం నల్లగా జుట్టు విరయబోసుకొని ఏడుస్తూ ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందామేడ. అందుకనే అందరూ దాన్ని 'దయ్యాల మేడ' అని పిలుస్తుంటారు. పై అంతస్తులో C దాదాపు పదిగదులున్నాయి. చిన్న చిన్న గదులు. ఒక్కొక్క గదిలో ఒక మనిషికంటే ఎక్కువమంది ఉండడానికి వీల్లేదు. అన్నిటి కంటే వెనకాల ఉన్న గదిలో నా మకాం. అందులో నేను అయిదారు నెలల బట్టీ ఉంటున్నాను. మిగతా గదుల్లో అప్పనంగా ఎవరూ ఉండరు. ఎక్కువ అద్దె ఇచ్చుకోలేని నాబోటి దౌర్భాగ్యులెవరో అప్పుడప్పుడు వస్తుంటారు. వాళ్ళ పనులు కాగానే వెళ్ళిపోతుంటారు. ఒక్కొక్క గదికి అద్దె నెలకు అయిదు రూపాయలు.........................© 2017,www.logili.com All Rights Reserved.