ఒక
అజ్ఞాత తీరంపై!
అజ్ఞాత తీరప్రాంతాలమీద
అడుగుజాడలన్నీ నావే
అంతులేని అగాధాల లోపల
నర్తిస్తున్న జలరాశి అశాంతినాదే!
ఏదో కొసనుంచి
కొండకోనలు దాటి
ఈ అంచుదాకా శ్వాసిస్తున్న సమూహంలో
నేనొక ఒంటరిగా
అందరిలో అందరిగా
అవ్యక్తంగా నిలిచిన అనుభూతిని!
అక్షరాల ఆల్చిప్పలను అన్వేషిస్తూ
నా పాదాల కింది కడలి తరగల్లో
ఇసుక లోతుల్లోకి
సుతారంగా జారుతున్న నీటి కదలికల
గిలిగింతల్లో తప్పిపోతూ
సప్తసముద్రాల జలానుభూతిలో మునిగి
ఇక్కడే అజ్ఞాత తీరప్రాంతాలపై ఒక ఉప్పెనలా..................
© 2017,www.logili.com All Rights Reserved.