శ్రీకారము
వేదకాలంలో వ్యాకరణం, ఖగోళం, వైద్యం, తత్త్వం, కామం, ధర్మం, అర్ధం, మొదలగు వాటికి సంబంధించిన భిన్న భిన్న రచనలు అవతరించాయి. వేదాలలో, బ్రాహ్మణాలలో, ఉపనిషత్తులలో, రామాయణ మహాభారతములలో, పురాణాలలో రిమ్మ (Sex) విషయాలు పరిహరించబడలేదు. మానవ జననమునకు ముందు వెనుకలు చర్చించి అనుశాసించేది కామశాస్త్రము.
కోరిక వలన స్త్రీని పురుషుడు, పురుషుని స్త్రీ పొంది ఆనందిస్తున్నారు. ఇదే కామవాంఛ, రిమ్మ తెగులు. సౌష్ఠవం కల స్త్రీ నగతో సమానం. సౌశీల్యం కల స్త్రీ సంపదతో సమానం. స్త్రీ పురుషుల పరస్పర ఆకర్షణల వలన ప్రపంచం నడుస్తుంది.
ప్రాచార్య దండి (ఏడవ శతాబ్ది) కామస్తు విషయాసక్త చేతసోః స్త్రీ పుంసయోః నిరతిశయసుఖ స్పర్శవిశేషః (దశకుమారచరితమ్ ద్వితీయ ఉచ్ఛ్వాసః పుట 71; దిల్లీ, 1966 నాలుగవ ముద్రణ) అని నిర్వచించినాడు.
(“కామమనగా విషయాసక్త మానసులగు స్త్రీ పురుషులకు పెంపు మీరిన ఇంపొసగెడు ఒకానొక తాకుడు" - తొలి కళాప్రపూర్ణ వేదం వేంకటరాయశాస్త్రి 1853-1929).
కామక్రియకు ఆవశ్యకమైన విషయాలను వింగడించి పేర్కొని విపులీకరించి ఆచరణగ తీర్చి దిద్దడం కామశాస్త్ర ప్రయోజనం.
వ్యక్తి ఆయుస్సు నూరేండ్లు కనుక కాలాన్ని చక్కగా విభజించుకొని న్యాయబద్ధంగ పరస్పర విఘాతం లేకుండా త్రివర్గాలను సేవించాలని పెద్దల ఆకాంక్ష. ధర్మ అర్థాలు ప్రవృత్తిమార్గ సంబంధి. కామము త్రివర్గములలో చివరిదైనా మిక్కిలి ముఖ్యమైనది.
ధర్మ శబ్దం ధర్మ-అర్థ-కామ పదాలకు సంకేతం. ధర్మబద్ధములైన...............................
శ్రీకారము వేదకాలంలో వ్యాకరణం, ఖగోళం, వైద్యం, తత్త్వం, కామం, ధర్మం, అర్ధం, మొదలగు వాటికి సంబంధించిన భిన్న భిన్న రచనలు అవతరించాయి. వేదాలలో, బ్రాహ్మణాలలో, ఉపనిషత్తులలో, రామాయణ మహాభారతములలో, పురాణాలలో రిమ్మ (Sex) విషయాలు పరిహరించబడలేదు. మానవ జననమునకు ముందు వెనుకలు చర్చించి అనుశాసించేది కామశాస్త్రము. కోరిక వలన స్త్రీని పురుషుడు, పురుషుని స్త్రీ పొంది ఆనందిస్తున్నారు. ఇదే కామవాంఛ, రిమ్మ తెగులు. సౌష్ఠవం కల స్త్రీ నగతో సమానం. సౌశీల్యం కల స్త్రీ సంపదతో సమానం. స్త్రీ పురుషుల పరస్పర ఆకర్షణల వలన ప్రపంచం నడుస్తుంది. ప్రాచార్య దండి (ఏడవ శతాబ్ది) కామస్తు విషయాసక్త చేతసోః స్త్రీ పుంసయోః నిరతిశయసుఖ స్పర్శవిశేషః (దశకుమారచరితమ్ ద్వితీయ ఉచ్ఛ్వాసః పుట 71; దిల్లీ, 1966 నాలుగవ ముద్రణ) అని నిర్వచించినాడు. (“కామమనగా విషయాసక్త మానసులగు స్త్రీ పురుషులకు పెంపు మీరిన ఇంపొసగెడు ఒకానొక తాకుడు" - తొలి కళాప్రపూర్ణ వేదం వేంకటరాయశాస్త్రి 1853-1929). కామక్రియకు ఆవశ్యకమైన విషయాలను వింగడించి పేర్కొని విపులీకరించి ఆచరణగ తీర్చి దిద్దడం కామశాస్త్ర ప్రయోజనం. వ్యక్తి ఆయుస్సు నూరేండ్లు కనుక కాలాన్ని చక్కగా విభజించుకొని న్యాయబద్ధంగ పరస్పర విఘాతం లేకుండా త్రివర్గాలను సేవించాలని పెద్దల ఆకాంక్ష. ధర్మ అర్థాలు ప్రవృత్తిమార్గ సంబంధి. కామము త్రివర్గములలో చివరిదైనా మిక్కిలి ముఖ్యమైనది. ధర్మ శబ్దం ధర్మ-అర్థ-కామ పదాలకు సంకేతం. ధర్మబద్ధములైన...............................© 2017,www.logili.com All Rights Reserved.