పాత్రలు ఎలా తయారవుతాయి?
ఎయన్నార్, ఎన్టీయార్, ఎస్వీయార్, గుమ్మడి వంటి పాత్రధారులకి యింతింత పేర్లు రావడానికి కారణం వాళ్లు ధరించిన పాత్రలు. ఆ పాత్రలను కల్పించేది రచయిత. రచయిత కథ రాస్తూ పాత్రకు ప్రాణం పోస్తాడు. అలా ప్రాణం పోసిన వ్యక్తికి దర్శకుడు నడక నేర్పిస్తాడు. రచయిత వూహించిన దాన్ని తెర మీదకు అనువదిస్తాడు. ఇక తక్కిన మేకప్, మ్యూజిక్ యిలాటి వన్నీ అలంకారాలు. అసలు ప్రాణం అంతా రచయిత కల్పించిన పాత్రలో, ఆ పాత్రలకు ఆలంబన అయిన కథలో వుంది.
ఓ సారి ఎన్టీయార్ అన్నారు - 'సినిమా సక్సెస్ అయ్యేందుకు కారణం కథ. సక్సెస్ రేంజ్కు కారణం - మేము, అంటే పాత్రధారులం!' అని. "బందిపోటు” సినిమా వుందనుకోండి. కాంతారావు హీరో అయితే 50 రోజులాడేది. ఎన్టీ రామారావు హీరో కాబట్టి 100 రోజులాడింది. అదీ తేడా! అయితే ఎన్టీ రామారావు వేసినా 100 రోజులు కాదు కదా, 10 రోజులు కూడా ఆడని సినిమాలున్నాయి. ఎందువల్ల? వాటిలో కథాబలం చాలక!
కథ లోంచే పాత్రలు పుడతాయి. పాత్ర ఎలా వుండాలి? ప్రేక్షకుడిని అలరించేట్లు వుండాలి. ప్రేక్షకుడు తనను తాను ఆ పాత్రలో చూసుకునేట్లు వుండాలి. ఏ పాత్ర? ముఖ్య పాత్ర! ఇంగ్లీషులో 'ప్రొటగానిస్ట్' అంటారు. “పాతాళభైరవి” తీసుకుంటే ప్రేక్షకుడు తనను తాను ఎన్టీ రామారావుగా ఊహించు కుంటాడు కానీ, ఎస్వీ రంగారావు లాగానో, రేలంగి లాగానో ఊహించుకోడు. “సెక్రటరీ” సినిమా చూస్తున్న అమ్మాయి తనను తాను రాజశేఖరం వరించే జయంతిలా వూహించు కుంటుంది కానీ అతని వెంటపడే వ్యాంప్ వూహించుకోదు.
అసమర్థ నాయకుడిలో ఐక్యం కావడానికి పాఠకుడి అంతరంగం అంగీకరించదు. ఒక సమర్థ నాయకుడిలో తాదాత్మ్యం చెందటం ప్రేక్షకుడికి ఏ మాత్రం కష్టం కాదు. మరి అలా అయితే “దేవదాసు” సినిమా ఎందుకు హిట్ అయినట్టు? ముఖ్య పాత్రతో ప్రేక్షకుడు ఐడెంటిఫై చేసుకోలేదా? ఇక్కడ 'ఎంపతీ' అనే ఫ్యాక్టర్ లెక్కలోకి తీసుకోవాలి. 'పాపం ఏం చేయగలడు? ప్రేమించిన అమ్మాయిని మరిచి పోలేక తాగుబోతు అయిపోయాడు. నేనయినా అదే చేసేవాణ్నేమో' అని ప్రేక్షకుడు అనుకున్నాడు కాబట్టే సినిమా హిట్ అయింది.......................
పాత్రలు ఎలా తయారవుతాయి? ఎయన్నార్, ఎన్టీయార్, ఎస్వీయార్, గుమ్మడి వంటి పాత్రధారులకి యింతింత పేర్లు రావడానికి కారణం వాళ్లు ధరించిన పాత్రలు. ఆ పాత్రలను కల్పించేది రచయిత. రచయిత కథ రాస్తూ పాత్రకు ప్రాణం పోస్తాడు. అలా ప్రాణం పోసిన వ్యక్తికి దర్శకుడు నడక నేర్పిస్తాడు. రచయిత వూహించిన దాన్ని తెర మీదకు అనువదిస్తాడు. ఇక తక్కిన మేకప్, మ్యూజిక్ యిలాటి వన్నీ అలంకారాలు. అసలు ప్రాణం అంతా రచయిత కల్పించిన పాత్రలో, ఆ పాత్రలకు ఆలంబన అయిన కథలో వుంది. ఓ సారి ఎన్టీయార్ అన్నారు - 'సినిమా సక్సెస్ అయ్యేందుకు కారణం కథ. సక్సెస్ రేంజ్కు కారణం - మేము, అంటే పాత్రధారులం!' అని. "బందిపోటు” సినిమా వుందనుకోండి. కాంతారావు హీరో అయితే 50 రోజులాడేది. ఎన్టీ రామారావు హీరో కాబట్టి 100 రోజులాడింది. అదీ తేడా! అయితే ఎన్టీ రామారావు వేసినా 100 రోజులు కాదు కదా, 10 రోజులు కూడా ఆడని సినిమాలున్నాయి. ఎందువల్ల? వాటిలో కథాబలం చాలక! కథ లోంచే పాత్రలు పుడతాయి. పాత్ర ఎలా వుండాలి? ప్రేక్షకుడిని అలరించేట్లు వుండాలి. ప్రేక్షకుడు తనను తాను ఆ పాత్రలో చూసుకునేట్లు వుండాలి. ఏ పాత్ర? ముఖ్య పాత్ర! ఇంగ్లీషులో 'ప్రొటగానిస్ట్' అంటారు. “పాతాళభైరవి” తీసుకుంటే ప్రేక్షకుడు తనను తాను ఎన్టీ రామారావుగా ఊహించు కుంటాడు కానీ, ఎస్వీ రంగారావు లాగానో, రేలంగి లాగానో ఊహించుకోడు. “సెక్రటరీ” సినిమా చూస్తున్న అమ్మాయి తనను తాను రాజశేఖరం వరించే జయంతిలా వూహించు కుంటుంది కానీ అతని వెంటపడే వ్యాంప్ వూహించుకోదు. అసమర్థ నాయకుడిలో ఐక్యం కావడానికి పాఠకుడి అంతరంగం అంగీకరించదు. ఒక సమర్థ నాయకుడిలో తాదాత్మ్యం చెందటం ప్రేక్షకుడికి ఏ మాత్రం కష్టం కాదు. మరి అలా అయితే “దేవదాసు” సినిమా ఎందుకు హిట్ అయినట్టు? ముఖ్య పాత్రతో ప్రేక్షకుడు ఐడెంటిఫై చేసుకోలేదా? ఇక్కడ 'ఎంపతీ' అనే ఫ్యాక్టర్ లెక్కలోకి తీసుకోవాలి. 'పాపం ఏం చేయగలడు? ప్రేమించిన అమ్మాయిని మరిచి పోలేక తాగుబోతు అయిపోయాడు. నేనయినా అదే చేసేవాణ్నేమో' అని ప్రేక్షకుడు అనుకున్నాడు కాబట్టే సినిమా హిట్ అయింది.......................© 2017,www.logili.com All Rights Reserved.