1962 సంవత్సరాన ఒకనాటి రాత్రి.
చీకటిని చీల్చుకుంటూ గదగ్ వైపుకు దూసుకుపోతున్న పది పెట్టెల గూడ్సు బండి ఒక్కసారిగా ఆగిపోయింది. మెటికలు విరచుకున్నట్లు బ్రేకులు కిటకిట మంటూ పట్టుకున్నాయి చక్రాలను. దట్టమైన ఆ నల్లని నల్లమల అడివి మధ్యలో ఒక కర్ర దెబ్బతో నడుము విరిగి కదలలేక కోపంతో బుసలుకొడుతున్న నల్లత్రాచులా.
కారణం తెలియని గార్డు చేతిదీపం ఊపుకుంటూ పెట్టెనుండి రెండు మెట్లుదిగి ఇంజన్వైపు దీపం వూపాడు. గూడ్సు మధ్యనున్న వ్యాగన్ నుండి ఏవో పెట్టెలు కొన్ని ధన్ ధన్ మంటూ కిందకు దొర్లుతున్న శబ్ధం.. కొన్ని నల్లని ఆకారాలు కనిపించాయి. అంతే ! గార్డు ఒక్కగంతున పెట్టెలోకి దూకి తలుపు బిగించుకున్నా గుండెదడ ఆగలేదు. ముచ్చెమటలతో అతని దుస్తులు తడుస్తున్నాయి. అంతలో ' అమ్మా !" అన్న బాధాపూరిత అరుపు విని గార్డు మరింత బిక్కచచ్చిపోయి లైటు ఆర్పి నిశ్శబ్ధంగా కూర్చున్నాడు. “ఇంజన్ డ్రైవర్" ? ? !! ఇక ఆలోచించలేక ఒణుకుతున్నాడు. ఎంతసేపు అలా వున్నాడో తెలియలేదు... బిగుసుకున్న కీళ్ళు ఒదులైనట్లు బ్రేకులు వదులై బండిని లాగుతున్నట్లు ... అంతలోనే చుట్టూవున్న కొండలు ప్రతిధ్వనించేలా కూతపెట్టి శరవేగం అందుకుంది. "డ్రైవరు జీవించే వున్నాడు!" అనే ఆలోచన గార్డు దడను తగ్గించింది. మరలా లైటు వెలిగించి, మూసిన తలుపు తెరిచాడు. కాని బయటకు తొంగిచూడలేకపోయాడు.
రెండు నెలల క్రితం ఈ స్థలంలోనే గూడ్సు నిలిపి డ్రైవరును, గార్డును చెట్టుకు కట్టేసి దొంగలు రెండు వ్యాగన్లు దోచారు. ఆ సంగతి జ్ఞాపకం వచ్చిందేమో! కూత ఆపనంటే ఆపనంటూ చీకటికి చిల్లులుపడేలా కూస్తూ వేగం మరింత జుకున్నది.
"బండి ఇంత ఆలస్యమైందేమిటి? అవతలి స్టేషను వదిలినట్లు ఫోను వచ్చిందే? సిగ్నల్ కూడా ఇచ్చి వున్నదే” అని స్టేషను మాస్టరు ఆందోళన చెందుతున్న....................
1962 సంవత్సరాన ఒకనాటి రాత్రి. చీకటిని చీల్చుకుంటూ గదగ్ వైపుకు దూసుకుపోతున్న పది పెట్టెల గూడ్సు బండి ఒక్కసారిగా ఆగిపోయింది. మెటికలు విరచుకున్నట్లు బ్రేకులు కిటకిట మంటూ పట్టుకున్నాయి చక్రాలను. దట్టమైన ఆ నల్లని నల్లమల అడివి మధ్యలో ఒక కర్ర దెబ్బతో నడుము విరిగి కదలలేక కోపంతో బుసలుకొడుతున్న నల్లత్రాచులా. కారణం తెలియని గార్డు చేతిదీపం ఊపుకుంటూ పెట్టెనుండి రెండు మెట్లుదిగి ఇంజన్వైపు దీపం వూపాడు. గూడ్సు మధ్యనున్న వ్యాగన్ నుండి ఏవో పెట్టెలు కొన్ని ధన్ ధన్ మంటూ కిందకు దొర్లుతున్న శబ్ధం.. కొన్ని నల్లని ఆకారాలు కనిపించాయి. అంతే ! గార్డు ఒక్కగంతున పెట్టెలోకి దూకి తలుపు బిగించుకున్నా గుండెదడ ఆగలేదు. ముచ్చెమటలతో అతని దుస్తులు తడుస్తున్నాయి. అంతలో ' అమ్మా !" అన్న బాధాపూరిత అరుపు విని గార్డు మరింత బిక్కచచ్చిపోయి లైటు ఆర్పి నిశ్శబ్ధంగా కూర్చున్నాడు. “ఇంజన్ డ్రైవర్" ? ? !! ఇక ఆలోచించలేక ఒణుకుతున్నాడు. ఎంతసేపు అలా వున్నాడో తెలియలేదు... బిగుసుకున్న కీళ్ళు ఒదులైనట్లు బ్రేకులు వదులై బండిని లాగుతున్నట్లు ... అంతలోనే చుట్టూవున్న కొండలు ప్రతిధ్వనించేలా కూతపెట్టి శరవేగం అందుకుంది. "డ్రైవరు జీవించే వున్నాడు!" అనే ఆలోచన గార్డు దడను తగ్గించింది. మరలా లైటు వెలిగించి, మూసిన తలుపు తెరిచాడు. కాని బయటకు తొంగిచూడలేకపోయాడు. రెండు నెలల క్రితం ఈ స్థలంలోనే గూడ్సు నిలిపి డ్రైవరును, గార్డును చెట్టుకు కట్టేసి దొంగలు రెండు వ్యాగన్లు దోచారు. ఆ సంగతి జ్ఞాపకం వచ్చిందేమో! కూత ఆపనంటే ఆపనంటూ చీకటికి చిల్లులుపడేలా కూస్తూ వేగం మరింత జుకున్నది. "బండి ఇంత ఆలస్యమైందేమిటి? అవతలి స్టేషను వదిలినట్లు ఫోను వచ్చిందే? సిగ్నల్ కూడా ఇచ్చి వున్నదే” అని స్టేషను మాస్టరు ఆందోళన చెందుతున్న....................© 2017,www.logili.com All Rights Reserved.